డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు మూవీ లాక్డౌన్ సాంగ్ విడుదల
`118` వంటి సూపర్‌హిట్ చిత్రాన్నితెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్నలేటెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ (ఎవరు, ఎక్కడ, ఎందుకు). అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్‌తో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో అందరిలో చిన్న పాటి ధైర్యాన్ని తీసుకు రావడానికి `డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు` యూనిట్ లాక్డౌన్ ర్యాప్ వీడియో సాంగ్‌ను బుధవారం విడుదల చేసింది. సైమన్ కె.కింగ్ సంగీత దర్శకత్వంలో ‘హు వేర్ వై..’ అంటూ హుశారుగా సాగే ఈ పాటను రోల్ రైడా పాడారు. ప్రస్తుతం ఈ పాటకు సోషల్‌మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా..
చిత్ర దర్శకుడు కేవి గుహన్ మాట్లాడుతూ – ‘‘‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు`(ఎవ
చిత్ర నిర్మాత డా. రవి పి.రాజు దాట్ల మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం దేశంలో ఎలాంటి పరిస్థితులున్నాయో అందరికీ తెలిసిందే. కొవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంది. కొవిడ్ బారి నుంచి ప్రజలను కాపాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌ను ఈ పాటలో చిత్ర యూనిట్ అభినందించేలా, అందరూ మాస్కులు ధరించి, శానిటైజర్స్‌ను ఉపయోగిస్తూ సామాజిక దూరాన్ని పాటించాలని తెలియజేసేలా ఈ పాటను రూపొందించడం జరిగింది’’ అన్నారు.
అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, వైవా హర్ష తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి..
బ్యానర్: రామంత్ర క్రియేషన్స్,
సంగీతం: సైమన్ కె. కింగ్,
ఎడిటింగ్: తమ్మిరాజు,
ఆర్ట్: నిఖిల్ హాసన్,
డైలాగ్స్: మిర్చి కిరణ్,
లిరిక్స్: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, రోల్‌రైడా
కొరియోగ్రఫి: ప్రేమ్ రక్షిత్,
స్టంట్స్: రియల్ సతీష్,
కాస్ట్యూమ్ డిజైనర్: పొన్మని గుహన్
కో-ప్రొడ్యూసర్: విజయ్ ధరణ్ దాట్ల,
నిర్మాత: డా. రవి పి.రాజు దాట్ల,
కథ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫి, దర్శకత్వం: కె వి గుహన్.