డర్టీ హరి మూవీ రివ్యూ
అంత డర్టీ యేం కాదు: ‘డర్టీ హరి’ రివ్యూ
Rating:2.5/5
హాట్ కంటెంట్ ఉండటం వల్ల ఈ సినిమా ట్రైలర్ కి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలోనూ బాగా బజ్ వచ్చింది. ఈ బజ్ కి గొప్ప విజువల్స్ కారణంహాట్ కంటెంట్ ఉండటం వల్ల ఈ సినిమా ట్రైలర్ కి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలోనూ బాగా బజ్ వచ్చింది. ఈ బజ్ కి గొప్ప విజువల్స్ కారణం అనలేం కానీ, ఎం.ఎస్.రాజు డైరెక్షన్ ప్రధాన కారణం. అనలేం కానీ, ఎం.ఎస్.రాజు డైరెక్షన్ ప్రధాన కారణం.దేవి, వర్షం, ఒక్కడు , మనసంతా నువ్వే ,నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బాస్టర్స్ నిర్మించిన ఎం.ఎస్.రాజు దర్శకునిగా ఒక ఇలాంటి హాట్ సినిమాతో ముందుకు వస్తారని ఎవరూ ఊహించలేదు. ఆయన నేను కొత్త పంధాలో ఈ సినిమా ని తీర్చిదిద్దాను, ఈ సినిమా మేకింగ్ ని పర్సనల్ గా ఎంజాయ్ చేస్తూ తీసాను. నా కెరీర్ లోనే గొప్ప స్క్రీన్ ప్లే సినిమాగా నిలిచిపోతుంది అంటూ ఆయన చెలా చెప్పారు. ఈ నేపధ్యంలో రిలీజైన ఈ చిత్రం అసలు మ్యాటర్ ఏమిటి..టైటిల్,టీజర్ కు తగ్గట్లు డర్టీగా ఉందా…ఎంఎస్ రాజు ఈ సినిమాలో కేవలం డర్టీనెస్ ని నమ్మారా లేక మరేదైనా నమ్మారా…వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
జీవితంలో ఉన్నత స్దాయికి ఎదగాలని కోరిక ఉన్న కుర్రాడు హరి (శ్రవణ్ రెడ్డి) .తనకు చేతనైన చెస్ ఆటలో నెంబర్ వన్ అవుదామని హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఓ అమ్మాయి వసుధ (రుహాని)తో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి కాస్త సౌండ్ పార్టీ. డబ్బులో మునిగితేలుతూంటుంది. అతి తక్కువ టైమ్ లోనే తమ ప్రేమ వ్యవహారాన్నినెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్తాడు. అయితే అదే సమయంలో పరిచయం అవుతుంది జాస్మిన్(సిమ్రత్). ఆమె ఆకర్షణ సామాన్యమైనది కాదు. ఆమె ఓ యాస్పరింగ్ ఆర్టిస్ట్. అంతే మనస్సు ఆమె చుట్టూ ప్రతిక్షణలు చేయటం మొదలెడుతుంది. మెల్లిమెల్లిగా ఆమెను లైన్ లో పెట్టి..ఆమెతో రిలేషన్ పెట్టుకుంటాడు. ఇక్కడే అసలైన సమస్య వస్తుంది. ఆస్ది ఉన్న అమ్మాయితో అనుబంధం సాగించాలా లేక ఆమెను విదిలించుకుని అందాల దీవితో సంభందం కొనసాగించాలా అనేది తేల్చుకోలేని స్దితి వస్తుంది. ఆ డైలమోలో హరి ఓ నిర్ణయం తీసుకుంటాడు.ఆ నిర్ణయం అతని జీవితాన్ని ఏ మలుపు తిప్పింది..ఇద్దరిలో ఎవరికి హరి దగ్గరయ్యాడు..అనేది ట్విస్ట్ తో కూడిన మిగతా కథ.
స్క్రీన్ ప్లే ఎనాలసిస్
గొప్ప స్క్రీన్ ప్లే సినిమాగా నిలిచిపోతుందని ఎమ్ ఎస్ రాజు గారు భావించి ఈ సినిమా చేసారు. కానీ ఇదేమీ కొత్త కథ కాదు..కొత్త స్క్రీన్ ప్లే కాదు. రెగ్యులర్ గా సినిమాలు చూసేవారు ఊహించగలిగిందే. హాలీవుడ్ సినిమాలు చూసేవారికి Unfaithful (2002 film) కు ఓ వెర్షన్ అని అర్దమయ్యదే. కాకపోతే ఒరిజనల్ కాన్సెప్టులోనే విభిన్నత ఉంది. దాన్నే ఇక్కడా ఎక్సప్లోర్ చేసే ప్రయత్నం చేసారు. ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా ఇంకొక మనిషి దాగి ఉంటాడు. మనం రోజూ చూసే మనిషి, పైకి కనపడే మనిషి ఒక్కోసారి వేరే రకంగా కనిపిస్తారు. ఆ లోపలి మనిషి ఒక్కోసారి గాడి తప్పి ప్రవర్తించొచ్చు. ఆ యానిమల్ ఇన్స్టింక్ట్ వల్ల చాలా పరిణామాలు సంభవిస్తాయి. అదే చెప్దామని దర్శకుడి ప్రయత్నం. అందుకు ఇందులో హీరో పాత్రకు ఇద్దరమ్మాయిలతో ఏర్పడిన అనుబంధం అనేక పరిణామాలకు దారి తీయటం అనే బేస్ తీసుకున్నారు.
ఆ బేస్ మీద ఈ ముగ్గురి మధ్యన జరిగే డ్రామా చుట్టూ అల్లారు. అయితే సీన్స్, స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటేనే ఇలాంటి సినిమాలు బాగుంటాయి. అందులో కొంతవరకూ సక్సెస్ అయ్యారు. కానీ పూర్తిగా కాదు. ఈ ఎరోటిక్ థ్రిల్లర్ అనుకున్న స్దాయిలో థ్రిల్ల్ ఇవ్వలేకపోయింది. లవ్,లస్ట్ అంటూ సాగతీయటమే కారణం. ప్రీ క్లైమాక్స్ కానీ కథలోని ట్విస్ట్ రివీల్ కాదు. హాలీవుడ్ కు అలాంటి ట్విస్ట్ లు సబబే కానీ మనకు అలా చేస్తే విసుగు అనిపిస్తుంది. కాకపోతే క్లైమాక్స్ డ్రామా బాగా బాగుండటంతో ఆ బోర్ ని అధిగమించగలిగాము. థ్రిల్లర్ లో ఎమోషన్స్, ఎరోటిక్ కలిపి డీల్ చేయాలంటే చాలా కసరత్తు అవసరం. అది కొంతవరకూ కొరవడిందనే అనేకంటే సరిపోలేదు అనటం సబబు.
డైరక్షన్ ..మిగతా డిపార్టమెంట్స్
ఎమ్ ఎస్ రాజు నిర్మాత ఎంతో ప్రసిద్దుడు. తన సినిమాలు దగ్గరుండి ప్రతీ అంశమూ చూసుకునేవారు. బేసిగ్గా సినిమాని ఆయన ఎంజాయ్ చేస్తూ చేస్తారు. దాంతో ఆయనకీ దర్శకత్వ విషయాలు అలవోకగా అబ్బేసాయి. అయితే ఆయన డైరక్షన్ లో వచ్చిన తొలి చిత్రం వాన డిజాస్టర్ అవటం, ఆ తర్వాత కొడుకు ని లాంచ్ చేస్తూ చేసిన తూనీగ తూనీద దెబ్బ కొట్టకొట్టడంతో ఆయన ప్రతిభ అలాగే ఉండిపోయింది. కానీ మళ్లీ తన లోని డైరక్టర్ ని బయిటకు తీసి..ప్రతీ షాట్ ని క్లాస్ గా తీద్దామని ప్రయత్నం చేసారు. అదే సమయంలో ప్రస్తుత సమయంలో పేయింగ్ ఎలిమెంట్ గా మారిన అడల్ట్ కంటెంట్ ని కలుపుకుంటూ పోయారు. ఎక్కడా వల్గారిటీ, జుగుప్స లేకుండా ఆ సీన్స్ నీ తీసి మెప్పించారు. ఇక ఆయనకు టెక్నికల్ టీమ్ కూడా బాగానే సహకరించింది. ముఖ్యంగా కెమెరా,సంగీతం రెండు బాగా వర్క్ చేసాయి. ఆర్ట్ డిపార్టమెంట్ సైతం అదరకొట్టింది. ఉన్నంతలో ఎడిటింగ్ మరికాస్త షార్ప్ గా ఉంటే బాగుండేదనిపించింది.
నటీనటుల్లో హీరోగా పరిచయం అయిన శ్రవణ్ రెడ్డికు వంక పెట్టడానికి ఏమి లేదు. సెటెల్డ్ ఫెరఫార్మెన్స్ ఇచ్చారు.ఇద్దరు హీరోయిన్స్ లో సిమ్రత్ అదరకొట్టింది. అటు హాట్ సీన్స్ లోనూ ఇటు నటనపరంగానూ మంచి మార్కులే వేయంచుకుంది. మిగతావాళ్లు గుర్తుంచుకునే స్దాయిలో ఎవరూ చేయలేదు.
చూడచ్చా
ఖచ్చితంగా చూడాల్సిన సినిమా కాదు కానీ, చూస్తే మరీ విసిగించదు.
తెర ముందు..వెనక
నటీనటులు :శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ, రోషన్ బషీర్, అప్పాజీ అంబరీష, సురేఖావాణి, అజయ్, అజీజ్ నాజర్, మహేష్ తదితరులు.
సంగీత దర్శకుడు: మార్క్.కే.రాబిన్,
ప్రొడక్షన్ డిజైనర్: భాస్కర్ ముదావత్,
డీఓపీ: ఎం.ఎన్ .బాల్ రెడ్డి,
ఎడిటర్: జునైద్ సిద్ధిఖి,
సమర్పణ: గూడూరు శివరామకృష్ణ,
నిర్మాతలు: గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్, కేదార్ సెలగంశెట్టి , వంశీ కారుమంచి,
రచన – దర్శకత్వం: ఎం.ఎస్.రాజు.
విడుదల తేదీ:18-12-2020
రన్ టైమ్: 1 గంట 57 నిమిషాల
విడుదల :ఫ్రైడే మూవీస్ ఆన్ లైన్ ATT