డియర్ కామ్రేడ్ మూవీ రివ్యూ
కష్టం(‘డియర్ )కామ్రేడ్’రివ్యూ
Rating:2.5/5
కాలేజ్ స్టూడెంట్ లీడర్ చైతన్య అలియాస్ బాబీ(విజయ్ దేవరకొండ)కు ఆవేశం ఎక్కువ. ఎప్పుడూ ఏదో ఒకరితో గొడవపడే అతనికి స్నేహితులే సపోర్ట్. ఫైట్స్, పాటలు అంటూ కాలక్షేపం చేస్తున్న అతని జీవితంలోకి అపర్ణా దేవి అలియాస్ లిల్లీ(రష్మిక మందన్న) ప్రవేశిస్తుంది. ప్రక్కింటివాళ్ల చుట్టంగా పరిచయం అయిన ఆమె తన మనస్సులోకి అంత పాస్ట్ గా వచ్సేస్తుందని ఊహించడు.దాంతో ఇంక ఆలస్యమెందుకు అని లవ్ ప్రపోజల్ పెట్టేస్తాడు. ఆమె మొదట బెట్టు చేసినా ఆ తర్వాత ఓకే చెప్తుంది. సర్లే అని ఓ పాట పాడుకున్న ఆనందం ఎంతో సేపు ఉండదు. బాబి ఓ గొడవలో ఇరుక్కోవటంతో లిల్లీకి బాధ కలుగుతుంది. ఇలా ఎప్పుడూ ఎవరో ఒకరితో ఫైట్స్ చేస్తూ చేతికి,తలకు కట్లు కట్టుకుని తిరిగే వాడు తనకెందుకు అన్నట్లుగా బ్రేకప్ అనేసి బై చెప్పేస్తుంది. అప్పడు తెలిసి వస్తుంది బాబికి తన ఆవేశం ఎంత అనర్దం తెచ్చి పెట్టిందో. ఆ దెబ్బకు ప్రేమ పిచ్చోడైపోతాడు. ఈ గతాన్ని తలుచుకుని పదే పదే బాధపడుతూంటాడు.
సర్లే కాలం ఎంతటి గాయాన్ని అయినా మానుస్తుందని..మూడేళ్లకు మనోడు మామూలు బాబి అవుతాడు. ఆవేశం తగ్గుతుంది. ప్రేమ చేసిన గాయం మానుతుంది. అలా కూల్ అయితే కథేముంది. మళ్లీ లిల్లీ కనిపిస్తుంది. అయితే ఈ సారి ఓ హాస్పటిల్ లో కనిపిస్తుంది. అక్కడ ఆమె డిప్రెషన్ కు ట్రీట్మెంట్ తీసుకుంటుంది. చక్కగా క్రికెట్ ఆడుకునే పిల్ల ఇలా డాక్టర్లు, ట్రీట్మెంట్ లు అని తిరగటం ఏమిటా అని బాధపడిపోతాడు బాబి. ఆమెను ఎత్తుకుపోయి కేరళ లలో తిప్పి మామూలు మనిషిని చేస్తాడు. కానీ ఆమెను గతంలో జరిగిన ఓ సంఘటన పుండులా బాధపెడుతూంటుంది. ఇంతకీ ఆమె జీవితంలో ఈ గ్యాప్ లో ఏం జరిగింది. ఆ విషయం తెలుసుకున్న బాబి ఏం చేసాడు …తిరిగి వాళ్లిద్దరూ ఒకటయ్యారా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడక తప్పదు కదా.
రోడ్డు రోలర్ స్క్రీన్ ప్లే
మొదటి నుంచీ విజయదేవరకొండ ఫెరఫెర్మాన్స్ కు ఖచ్చితంగా అతని కథలు కలిసొచ్చాయనేది నిజం. ఎందుకంటే కథా బలం లేని సినిమాలను అతని స్టార్ ఇమేజ్ లాగలేకపోయింది. ఇప్పుడు కూడా ఈ సినిమా కథగా బాగానే ఉందనిపిస్తుంది. అందుకే దేవరకొండ ఒప్పుకున్నాడేమో. అయితే ఆ కథ..కథనం (స్క్రీన్ ప్లే ) దగ్గరకి వచ్చేసరికే వధ అయ్యిపోయింది. కథలో ఉన్న కాంప్లిక్ట్ ..ఎక్కడో ప్రీ క్లైమాక్స్ దాకా బయిటకు రాదు. దాంతో కథ…కాంప్లిక్ట్స్ లేకుండా నడిచి..బోర్ కొట్టేస్తుంది. దానికి తోడు దర్శకుడు ఫీల్ గుడ్ సినిమాలా తీయాలంటే స్లో నేరేషన్ బెస్ట్ ని ఫిక్స్ అయ్యి…రోడ్డు రోలర్ తో పోటీగా కథనం పరుగెట్టించాడు.
విజయ్ దేవరకొండ యాక్టింగ్, యాటిట్యూడ్ ,హీరోయిన్ రష్మికా తో కెమిస్ట్రీ అన్నీ ఇరగతీసాడు. ఆవేశపరుడైన చైతన్య అలియాస్ బాబీ పాత్రలో జీవించాడు. కానీ కథే అతనికి కలిసిరాలేదు. రష్మిక కూడా సేమ్ టు సేమ్. విజయ్ తో పోటీ పడి చేసింది. లవ్ సీన్స్ లోనూ, ఎమోషనల్ సీన్స్ లోనూ రష్మిక ఎక్సప్రెషన్స్ న్యాచురల్ గా ఉన్నాయి. హీరో ప్రెండ్స్ గా చేసిన వాళ్లు సైతం మంచి ప్రతిభను కనపరిచారు.
మిగతా క్రాఫ్ట్ లు
కథ,కథనం ఎప్పుడైతే దెబ్బ కొట్టాయో…ఏ క్రాఫ్ట్ ఎంత బాగా ఫెరఫార్మ్ చేసినా ఫలితం ఉండదు. డైరక్టర్ గా భరత్ కమ్మ పొయిటిక్ స్టైల్, రిచ్ విజువల్స్ తో తెరకెక్కించినా కలిసి రాలేదు. డైలాగులు సీన్ కు తగినట్లు బాగున్నాయి. జస్టిన్ ప్రభాకరన్ అందించిన పాటలు గొప్పగా లేకపోయినా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.అలాగే సినిమాటోగ్రఫి సినిమాకు హైలెట్ . కాశ్మీర్, కేరళ విజువల్స్ బాగున్నాయి. ఎడిటర్ మరింత షార్ప్ గా కట్ చేస్తే సినిమా ఇంత ఇబ్బంది పెట్టేది కాదు. ప్రొడక్షన్స్ వ్యాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.
చూడచ్చా
విజయ్ దేవరకొండ సినిమా కదా అని ఆవేశపడితే అంత సీన్ లేదని వెక్కిరిస్తుంది.
ఆఖరి మాట
హీరోకు కోపం ఎక్కువైతే, హీరోయిన్ కు కష్టాలు ఎక్కువ.దాంతో సినిమా చూసేవారికి ఓపిక ఎక్కువ ఉండాలి.
తెర వెనక ..ముందు
బ్యానర్స్: మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్
నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా, సుహాస్, చారుహాసన్ తదితరులు
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
కెమెరా: సుజిత్ సారంగ్
ఎడిటింగ్, డి.ఐ: శ‌్రీజిత్ సారంగ్
డైలాగ్స్: జె కృష్ణ
ఆర్ట్ డైరెక్టర్: రామాంజనేయులు
సాహిత్యం: చైతన్య ప్రసాద్, రహమాన్, కృష్ణకాంత్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యష్ రంగినేని
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భరత్ కమ్మ
సెన్సార్: యు/ఎ