Reading Time: 3 mins

డైరెక్టర్ రంజిత్ జయకోడి ఇంటర్వ్యూ

మైఖేల్ రొమాంటిక్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ పీరియడ్ డ్రామా ప్రేక్షకులని సర్ ప్రైజ్ చేస్తుంది: డైరెక్టర్ రంజిత్ జయకోడి

హీరో సందీప్ కిషన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మైఖేల్. సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రమైన మైఖేల్ కి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, దివ్యాంశ కౌశిక్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ ఎల్ పి, మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి కలిసి ఈ చిత్రాన్ని భారీ నిర్మిస్తున్నాయి. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు. ఇప్పటికే విడుదలైన మైఖేల్ టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మైఖేల్ ఫిబ్రవరి3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానున్న నేపధ్యంలో దర్శకుడు రంజిత్ జయకోడి విలేఖరులు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

మీ నేపధ్యం గురించి చెప్పండి ?
మాది చెన్నై. దర్శకుడిగా మూడు సినిమాలు చేశాను నా తొలి చిత్రం విజయ్ సేతుపతి గారితో చేశాను తర్వాత హరీష్ కళ్యాణ్ తో మరో సినిమా చేశాను మూడో సినిమా కూడా విడుదలకు సిద్ధమౌతుంది మైఖేల్ నా నాలుగో చిత్రం.

అంతకుముందు సహాయ దర్శకుడిగా పని చేశారా ?
దర్శకుడు రామ్ దగ్గర సహాయకుడిగా పని చేశాను. ఒక సినిమాకి పని చేసిన తర్వాత దర్శకుడిగా నా ప్రయాణం మొదలుపెట్టాను.

మైఖేల్ ప్రయాణం ఎలా మొదలైయింది ?
నా రెండో సినిమా చూసి సందీప్ కిషన్ కాల్ చేశారు నా వర్క్ ఆయనకి చాలా నచ్చింది అలా మేము మంచి స్నేహితులయ్యాం లాక్ డౌన్ చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళం సెకండ్ లాక్ డౌన్ సమయంలో మనం కలసి ఒక సినిమా చేద్దాం అన్నారు ఆయనకి అప్పటికి ఒక యాక్షన్ సినిమా చేయాలని వుంది సరిగ్గా నేను కూడా ఆ సమయానికి యాక్షన్ స్క్రిప్ట్ రాస్తున్నాను అలా మైఖేల్ మొదలైయింది.

మైఖేల్ గ్యాంగ్ స్టార్ కథనా ?
మైఖేల్ మూవీ ఒక జోనర్ అని చెప్పలేం. రొమాంటిక్, యాక్షన్, గ్యాంగ్ స్టార్ డ్రామా, పిరియడ్ ఫిల్మ్ అనొచ్చు. ఇందులో 70, 80, 90 ఇలా మూడు కాలాలు వుంటాయి ఎక్కువ భాగం 90లో వుంటుంది కథ చాలా ఆసక్తికరంగా వుంటుంది గ్యాంగ్ స్టార్ డ్రామా వున్న బ్యూటీఫుల్ రొమాంటిక్ లవ్ స్టొరీ ఇది.

ట్రైలర్ చూస్తే మార్కెట్ కి మించి బడ్జెట్ పెట్టారనిపిస్తుంది రిస్క్ అనిపించలేదా ?
ఈ విషయంలో మా నిర్మాతలు సునీల్ గారు, పుస్కూర్ రామ్ మోహన్ గారు, భరత్ గారి ప్రోత్సాహాన్ని అభినందించాలి. సినిమాని క్యాలిటీగా తీయడం పట్ల ప్రత్యేక ద్రుష్టి పెట్టారు. ఫస్ట్ షెడ్యుల్ రష్ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. బడ్జెట్ గురించి ఆలోచించ వద్దు స్క్రిప్ట్ ప్రకారం అనుకున్నది తీమని చెప్పారు. వారి నమ్మకమే మైఖేల్ ని ఇంత బిగ్ ప్రాజెక్ట్ ని చేసింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై లో షూటింగ్ చేశాం. ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల చేస్తున్నాం. టీజర్, ట్రైలర్ కు అన్ని భాషల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమాని కూడా అన్ని చోట్ల గొప్పగా ఆదరిస్తారనే నమ్మకం వుంది.

మైఖేల్ ప్రాజెక్ట్ లోకి విజయ్ సేతుపతి ఎలా వచ్చారు ?
విజయ్ సేతుపతి నాకు మంచి స్నేహితుడు. నా మొదటి సినిమా ఆయనతోనే చేశాను. ఈ కథ కి పాన్ ఇండియా పాపులారిటీ వున్న ఒక స్టార్ కావాలి. నాకు తెలిసిన వారిలో విజయ్ సేతుపతి వున్నారు. ఈ పాత్ర గురించి చెప్పినపుడు ఆయనకి చాలా నచ్చింది. ఇందులో ఆయన పాత్ర చాలా సర్ ప్రైజింగా వుంటుంది. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.

సందీప్ కిషన్ తో పని చేయడం ఎలా అనిపించింది ?
సందీప్ కిషన్ ఎప్పటి నుండో తెలుసు. మా ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ వుంది. నాకు ఏం కావాలో సందీప్ కి తెలుసు. తనకి స్క్రిప్ట్ పట్ల చాలా మంచి అండర్ స్టాండింగ్ వుంటుంది. తనతో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్.

వరుణ్ సందేశ్ ని విలన్ గా చూపించాలనే ఆలోచన ఎవరిది ?
కథ రాసినప్పుడు ఆ పాత్ర కోసం వేరే నటుడు నా మనసులో వున్నారు. సందీప్ కిషన్, ఆ పాత్ర వరుణ్ కొత్తగా ఉంటాడు ఒకసారి ప్రయత్నించమని చెప్పారు. సందీప్ కి లవర్ బాయ్ ఇమేజ్ వుందని నాకు తెలుసు. కాస్త సందేహంతోనే ఆయన దగ్గరకి వెళ్లి స్క్రీన్ టెస్ట్ చేస్తానని కోరాను. వరుణ్ చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు. ఒక సీన్ ఇచ్చి స్క్రీన్ టెస్ట్ చేశాను. తొలి సినిమాకి ఆడిషన్ ఇస్తున్న ఆర్టిస్ట్ కు వున్న ఎనర్జీ వరుణ్ లో కనిపించింది. ఆ పాత్రలో నన్ను చాలా సర్ ప్రైజ్ చేశారు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా సర్ ప్రైజ్ అవుతారు.

విజువల్స్ డార్క్ మూడ్ లో చాలా రిచ్ గా కనిపిస్తున్నాయి కదా దిని కోసం ఏదైనా ప్రత్యేకమైన వర్క్ చేశారా ?

ఎలాంటి విజువల్స్ కావాలో కథే డిమాండ్ చేస్తుంది. లైటింగ్, ఫ్రేమ్స్ కథ ప్రకారమే వస్తాయి. నా గత సినిమాల్లో కూడా కెమరాపనితనం భిన్నంగా వుంటుంది. మైఖేల్ సినిమాకి కిరణ్ కౌశిక్ చేశారు. డీవోపీగా ఇది ఆయన మొదటి సినిమా అంటే ఎవరు నమ్మరు. అద్భుతంగా చేశాడు. సినిమా మేకింగ్ స్టయిల్ లో నాపై ఫారిన్ చిత్రాల ప్రభావం వుంది. సినిమా సెట్స్ పైకి వెళ్ళే ముందే ఎలాంటి టోన్ లో ఉండాలనే దానిపై ప్రత్యేకంగా పని చేస్తాను.

సామ్ సి ఎస్ మ్యూజిక్ గురించి ?
సామ్ సిఎస్ నాకు మంచి స్నేహితుడు. నేనే పరిచయం చేశాను. మా మధ్య మంచి అనుబంధం వుంది. నా సినిమా అంటే కొంచెం ప్రత్యేక శ్రద్ద వుంటుంది. మైఖేల్ మ్యూజిక్ అద్భుతంగా వుంటుంది.

పోస్టర్ డిజైన్ లో వైవిధ్యం కనిపించింది కదా ? ఒక పెయింటింగ్ లా చేశారు ?
అవును. పోస్టర్స్ ని ప్రత్యేకంగా ప్లాన్ చేశాం. పోస్టర్ చూడగానే టైటిల్ కూడా అవసరం లేకుండా ఇది మైఖేల్ మూవీ అని గుర్తు పెట్టేలా బ్రాండ్ ని క్రియేట్ చేయాలని భావించాం. అందులో సక్సెస్ అయ్యాం.

నిర్మాతల గురించి ?
నిర్మాతల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు చాలా స్వీట్. వెరీ కేరింగ్. చాలా కంఫర్ట్ ఇచ్చారు. సినిమా, బిజినెస్ పట్ల వారికి గొప్ప నాలెడ్జ్ వుంది. బడ్జెట్ గురించి కాకుండా క్యాలిటీ గురించి ఆలోచిస్తారు.

కొత్తగా చేయబోతున్న సినిమాలు ?
యువసుధ ఆర్ట్స్ లో ఒక సినిమా, అలాగే కరణ్ సి నిర్మాణంలో మరో సినిమాకి సైన్ చేశాను.

ఆల్ ది బెస్ట్
థాంక్స్