Reading Time: 2 mins

తిప్పరా మీసo నవంబర్ 8 విడుదల

 

నవంబర్ 8న గ్రాండ్ గా విడుదలవుతున్న “తిప్పరా మీసం”

బ్రోచేవారేవరురా వంటి డీసెంట్ హిట్ తర్వాత శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం “తిప్పారామీసం”. అసుర ఫేమ్ విజయ్ కృష్ణ  ఎల్. దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, కృష్ణవిజయ్ ఎల్ ప్రొడక్షన్స్  పతాకాలపై  శ్రీ హోమ్ సినిమాస్ సమర్పణలో  యువ నిర్మాత రిజ్వాన్ నిర్మించిన చిత్రం “తిప్పరా మీసం”. ఈ చిత్రం టీజర్, ట్రైలర్స్ కి టెర్రిపిక్ రెస్పాన్స్ వస్తోంది. సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం మ్యూజిక్ శ్రోతలని అలరిస్తుంది. నిక్కి తంబోలి హీరోయిన్ గా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం నవంబర్ 8న వరల్డ్ వైడ్ గా గ్లోబల్ సినిమాస్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ నిక్కి తంబోలి, దర్శకుడు కృష్ణవిజయ్.ఎల్, నటుడు, సమర్పకుడు అచ్యుత రామారావు, కమేడియన్ నవీన్,  సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, ఎడిటర్ ధర్మేంద్ర, పాటల రచయిత పూర్ణచారి తదితరులు పాల్గొన్నారు..

కో-ప్రొడ్యూసర్ అచ్యుత రామారావు మాట్లాడుతూ… ఈ సినిమా బిగినింగ్ నుండి సినిమా మంచి హిట్ అవుతుందని మేమంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం.. బిజినెస్ పరంగా, ఔట్ ఫుట్ పరంగా చాలా పాజిటివ్ వైబ్ వస్తోంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ బాగా కోపరేట్ చేశారు. ముఖ్యంగా హీరో శ్రీవిష్ణు, దర్శకుడు విజయ్ చాలా కష్టపడి ఈ ప్రాజెక్టుని ముందుకు నడిపించారు. మా అందరికి ఈ చిత్రం చాలా ప్లస్ అవుతుంది.. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్స్ కు మా తరుపున రెండు లక్షలు విరాళంగా ఇస్తాం..సినిమా సక్సెస్ మీట్లో మరిన్ని విషయాలు మాట్లాడతాను.. అన్నారు.

నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి తిప్పరా మీసం టైటిల్ పెట్టి విజయ్ మంచిపని చేశాడు. ఈ కథకి శ్రీవిష్ణు ని సెలెక్ట్ చేసుకున్నప్పుడే విజయ్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. శ్రీవిష్ణు సెలెక్టీవ్ గా కథలను ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తున్నాడు. వరుస హిట్ లు సాధిస్తున్నారు. విజయ్ ప్రతివిషయంలో కేర్ తీసుకొని ఈ సినిమా చేశాడు. ఈ సినిమాకి విజయ్ హార్ట్ అయితే, ప్రాణం శ్రీవిష్ణు అని చెప్పొచ్చు. వారిద్దరూ డే అండ్ నైట్ కష్టపడి ఈ సినిమాని చేశారు. అచ్యుత రామారావు, ఖుషి ఇద్దరు నాకు బాగా సపోర్ట్ చేశారు. సురేష్ బొబ్బిలి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే సిద్ధు బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు. ప్రతి ఒక్కళ్ళు ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారు.. నవంబర్ 8న ఈ చిత్రాన్ని విడుదలచేస్తున్నాం.. అన్నారు.

దర్శకుడు కృష్ణవిజయ్.యల్ మాట్లాడుతూ… ఒక మంచి సినిమా చేద్దామని నేను, శ్రీవిష్ణు ఈ సినిమాని స్టార్ట్ చేశాం.  ఆతర్వాత నా ఫ్రెండ్ అచ్యుత రామారావు, రిజ్వాన్ జాయిన్ అయ్యారు. సురేష్ బొబ్బిలి మంచి ట్యూన్స్ తో పాటు ఆరార్ అద్భుతంగా చేశాడు. పూర్ణ మంచి లిరిక్స్ రాశాడు. శ్రీవిష్ణు, నిక్కి ఫెంటాస్టిక్ గా చేశారు. ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది… అన్నారు.

హీరోయిన్ నిక్కీ తంబోలి మాట్లాడుతూ… ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ కి ఫ్యాన్ అయిపోయాను. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన రిజ్వాన్ గారికి నా థాంక్స్.. అన్నారు.

హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. విజయ్ అసుర చేసిన  తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి. అప్పట్నుంచి మా జర్నీ కొనసాగుతుంది. మాకు ఒక ప్లాట్ ఫామ్ కావాలని రెండు మూడు సినిమాలు ప్రొడ్యూస్ చేశాం. నేను చిన్న చిన్న వేషాలు వేశాను.  నేను కొంచెం బెటర్ సినిమాలు చేశాక  ఇద్దరం సినిమా చేద్దాం అనుకున్నాం. విజయ్  నాతో సినిమా చేస్తానని మాట ఇచ్చి ఆమాట కోసం ఇప్పుడు నాతో ఈ సినిమా చేశాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ఇది. నవంబర్ 8న రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులందరు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను.. అన్నారు.