త్రీ మంకీస్ చిత్రం ట్రైలర్ విడుదల
కమెడియన్స్ అందరూ కలిసి చేసిన ‘త్రీ మంకీస్` 2020లో పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను – బ్రహ్మానందం.
జబర్దస్థ్ షో ద్వారా బుల్లితెరపై ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ బిగ్ స్క్రీన్‌పై ‘త్రీ మంకీస్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. కారుణ్య చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఓరుగల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ జి. దర్శకత్వంలో నగేష్ జి. నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర యూనిట్ సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..
నిర్మాత నగేష్. జి మాట్లాడుతూ – “రిపబ్లిక్ డే సందర్భంగా నా అభిమాన నటుడు బ్రహ్మానందం గారి చేతుల మీదుగా మా సినిమా ట్రైలర్ విడుదలవడం సంతోషంగా ఉంది. అందరూ కమెడియన్స్ తో చేసిన రేపు థియేటర్ లో సినిమా చూసి తప్పకుండా ఎమోషన్ అవుతారు. కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్ ఇలా ప్రతి యాస్పెక్ట్ ని టచ్ చేసేలా ఈ సినిమాని తెరకెక్కించాం” అన్నారు.
రామ్ ప్రసాద్ మాట్లాడుతూ – ” కమెడియన్స్ అందరికి బ్రహ్మానందం గారే ఇన్స్పిరేషన్. ఆయన మా సినిమా ట్రైలర్ ను విడుదలచేయడం హ్యాపీగా ఉంది” అన్నారు.
సుధీర్ మాట్లాడుతూ – ” గాడ్ ఫర్ గుడ్ హెల్త్ గా పిలవబడే బ్రహ్మానందం గారు మా ట్రైలర్ ని విడుదల చేయడం మా అదృష్టం. మనం అందరం ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన పూయించిన నవ్వులే కారణం. బ్రహ్మానందం గారికి రీప్లేస్ మెంట్ అంటూ ఎవ్వరూ ఉండరు. ప్రతి కమెడియన్ ఆయన్ను ఇన్స్పైర్ అయ్యో లేదా ఆయన్ని కాపీ కొట్టో కామెడీ చేస్తారు” అన్నారు.
గెటప్ శ్రీను మాట్లాడుతూ – ” కింగ్ ఆఫ్ కామెడీ మా అందరికి గాడ్ ఫాదర్ బ్రహ్మానందం గారు మా ట్రైలర్ విడుదలచేయడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి కమెడియన్ ఎక్స్ప్రెషన్ లో సెకండ్ లేయర్ లో బ్రహ్మానందం గారే ఉంటారు” అన్నారు.
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ – ” కోతి వేశాలలో కూడా అంతర్లీనంగా గొప్ప సందేశం ఉంటుంది. కోతులు కొన్ని సార్లు వాటికి తెలియకుండానే మంచి పనులు చేస్తుంటాయి.దాన్ని ఆధారం చేసుకొని దర్శకుడు ఈ సినిమా తీశాడు అనిపిస్తుంది. ఒక కమెడియన్ అనేవాడు తన గురించి ఆలోచించకుండా ఎదుటివారిని నవ్విస్తాడు. వారి కష్టాన్ని బేరీజు వేయలేము. జబర్దస్ కామెడీ షో ద్వారా కొన్ని కోట్ల మందిని నవ్వించే కమెడియన్స్ అందరూ కలిసి చేస్తున్న చిత్రం 2020 లో పెద్ద హిట్టు అయ్యి టీమ్ అందరికి మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
దర్శకుడు అనిల్ కుమార్ జి మాట్లాడుతూ – ” హాస్యానికి కింగ్ అయిన పద్మశ్రీ బ్రహ్మానందం గారు మనస్పార్తిగా మమ్మల్ని ఆశీర్వదించినందుకు దన్యవాదాలు. ఈ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఎందుకు కలుస్తారో తెలీదు కానీ దానికి ఒక బలమైన కారణం ఉంటుంది. మా సినిమాలో 50% కామెడి, 30% సెంటిమెంట్ , 20% హార్ట్ టచింగ్ క్లైమాక్స్ ఉంటుంది” అన్నారు.