దర్శకుడు సురేష్ తిరుమూర్ ఇంటర్వ్యూ
‘లైఫ్ అనుభవించు రాజా’ని ఎన్టీఆర్ కు అంకితమిస్తున్నా: దర్శకుడు సురేష్ తిరుమూర్
– ‘లైఫ్ అనుభవించు రాజా’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు సురేష్ తిరుమూర్. రవితేజ, శ్రావణి నిక్కీ, శృతి శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సురేష్ గురువారం మీడియాతో చెప్పిన విశేషాలు..- దర్శకులు గుణశేఖర్, అమ్మ రాజశేఖర్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేశాను. ఈ సినిమాతో డెబ్యూ డైరెక్టర్ గా వస్తున్నా.- ‘అనుభవించు రాజా’ అంటే లివింగ్ దిస్ ఎవ్రీ మూమెంట్ అని అర్ధం. ‘అనుభవించు రాజా’ టైటిలే అనుకున్నాం..కానీ అది దొరకలేదు అందుకే టైటిల్ ముందు లైఫ్ యాడ్ చేశాం.- ఒక యువకుడు జీవితంలో ఎన్ని ఫెయిల్యూర్స్ చూశాడు.. మంచి, చెడులను ఎలా ఫేస్ చేశాడు? కోటీశ్వరుడు అవ్వాలని ఏం చేస్తాడు. లవ్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు? డబ్బు ఉన్నప్పుడు ఎలా ఉంటారు..డబ్బు లేనప్పుడు ఎలా ఉంటారనే అంశాలపై సినిమా సాగుతుంది. యువత ఆదర్శంగా తీసుకునే సినిమాగా ఇది నిలుస్తుంది. – కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమానైనా ఆదరిస్తారు. చిన్న సినిమానా, పెద్ద సినిమానా, కొత్తవారా, ఇమేజ్ ఉన్నావారా అని చూడటం లేదు. కొత్త వారితో చేయడం వల్ల ఓపెనింగ్స్ తక్కువ రావొచ్చు కానీ తర్వాత పుంజుకునే అవకాశం ఉంటుంది. మా సినిమాకు మేం అనుకున్న దానికంటే ఇప్పుడు థియేటర్లు పెరిగాయి.- హీరో రవితేజ కొత్త వాడైనా ఎక్కడా తడబడలేదు. సినిమా మొదలైన తర్వాత హీరో క్యారెక్టర్ కు కనెక్ట్ అయితే కొత్తవాడని ఎవరూ అనుకోరు. కథలో, పాత్రలో లీనమై నటించాడు. ఈ సినిమాలో 54 మంది కొత్త ఆర్టిస్టులుగా పరిచయం అవుతున్నారు. – నేను ఇలాంటి కథలనే డైరెక్ట్ చేస్తాడనిపించుకోను. రాఘవేంద్రరావు గారు, కె.విశ్వనాథ్ గారు, మణిరత్నం గారి లాంటి సినిమాలు కూడా చేయగలను. అలాంటి జోనర్లను కూడా డైరెక్ట్ చేయగలను.- సీనియర్ ఎన్టీఆర్ గారి ‘మనుషులంతా ఒక్కటే’ సినిమాలోని అనుభవించు రాజా పాటలోనుంచే ఈ టైటిల్ తీసుకున్నాం. ఈ సినిమాను ఆయనకే అంకితం ఇస్తున్నాం.- ఈ సినిమా పై చాలా నమ్మకం ఉంది. కచ్చితంగా ఆకట్టుకుంటుంది. యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. విడుదలైన తర్వాత నాకు చాలా ఆఫర్స్ వస్తాయని, సినీ వర్గాలు ఫోన్ చేసి అభినందిస్తారని నమ్ముతున్నా. మా ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా.