Reading Time: 2 mins

దాడి చిత్రం టైటిల్ సాంగ్ విడుద‌ల

సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ చేతుల మీదుగా ‘దాడి’ చిత్రంలోని ‘ఎవ‌రి కోసం’ టైటిల్ సాంగ్ విడుద‌ల‌

విశ్వ‌క‌వి ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్ భావాల‌తో ప్ర‌స్తుతం సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా తెర‌కెక్కుతోన్న చిత్రం ‘దాడి’. మధుశోభ టి. ద‌ర్శ‌క‌త్వంలో శంకర్ ఎ. నిర్మిస్తోన్న‌ ఈ మూవీలో శ్రీరామ్, అక్ష‌ర‌, జీవన్, కమల్ కామరాజు ప్ర‌ధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ మంచి రెస్పాన్స్ రాబ‌ట్టుకుంది.

స్వ‌ర‌బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ బాణీలు స‌మ‌కూర్చిన ఈ చిత్రంలోని ‘ఎవ‌రి కోసం’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌ను గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా శుక్ర‌వారం తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ త‌మ నివాసంలో విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, “పాట చాలా బాగుంది. సంగీతం, పిక్చ‌రైజేష‌న్ ఆక‌ట్టుకుంటున్నాయి. మంచి ఆశ‌యంతో శంక‌ర్ నిర్మిస్తున్న ఇలాంటి  సినిమాను అంద‌రూ ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఉంది. ఇలాంటి మంచి సినిమాల‌కు నా స‌పోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. దాడి చిత్రాన్ని డైరెక్ట‌ర్ మ‌ధుశోభ చ‌క్క‌గా తీస్తున్నారు. టీమ్‌కు ఆల్ ద బెస్ట్” అని చెప్పారు.

‌నిర్మాత శంకర్ ఎ. మాట్లాడుతూ, “మా పాట‌ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ గారి చేతుల మీదుగా లాంచ్ అవ‌డం చాలా ఆనందంగా ఉంది. మాకు ఆయ‌న స‌పోర్ట్ ల‌భించ‌డం మా అదృష్టం. మెలోడీ బ్ర‌హ్మ‌గా పేరుపొందిన మ‌ణిశ‌ర్మ‌గారు ఇచ్చిన అద్భుత‌మైన బాణీలు, శ్యామ్ కె. నాయుడు ఛాయాగ్ర‌హ‌ణం క‌లిసి ఈ పాటను చాలా ఆక‌ర్ష‌ణీయంగా మ‌ల‌చాయి. ఆమ‌ధ్య‌ ర‌వీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా విడుద‌ల‌చేసిన మా ‘దాడి’ ఫ‌స్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ర‌వీంద్రనాథ్ ఠాగూర్ గారి భావాలతో ద‌ర్శ‌కుడు మధుశోభ వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా కథ రాసుకొని ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఆయ‌న మేకింగ్ చాలా బాగుంది. మ‌ణిశ‌ర్మ గారి సంగీతం కాసర్ల శ్యామ్, భాష్య శ్రీల సాహిత్యం మా సినిమాకు త‌ప్ప‌కుండా ప్ల‌స్ అవుతాయి. ఇప్ప‌టివ‌ర‌కూ సినిమా ఔట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. న‌టులు శ్రీరామ్, అక్ష‌ర‌, జీవన్ వారి పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేశారు. సినిమా త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది” అన్నారు.

తారాగ‌ణం:
శ్రీరామ్, అక్ష‌ర‌, జీవన్, కమల్ కామరాజు, గణేష్ వెంకట రమణ, ముఖేష్ ఋషి, చరణ్ రాజ్, అజయ్ రత్నం, అజయ్, నాగినీడు, అజయ్ ఘోష్, మధు, అలోక్, రాజా రవీంద్ర, సలీమ్ పాండా, దిల్ రమేష్, సితార

సాంకేతిక బృందం:
లిరిక్స్: కాసర్ల శ్యామ్, భాష్య శ్రీ
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్ర‌ఫీ: శ్యామ్ కె. నాయుడు
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
డాన్స్: రాజ సుందరం, శివ శంకర్, శేఖర్
స్టంట్స్: కనల్ కన్నన్, వెంకట్
నిర్మాత: శంకర్ ఎ.
కథ, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: మధు శోభ టి.