దేవర చిత్రం గ్లింప్స్ విడుదల
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కొరటాల శివ భారీ చిత్రం దేవర గ్లింప్స్ విడుదల.. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతోన్న చిత్రం
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేటెస్ట్ భారీ చిత్రం దేవరతో మాస్ అవతార్‌లో మరోసారి తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. మరో బాలీవుడ్ స్టార్ సైప్ అలీ ఖాన్ కీలక పాత్రలో అలరించబోతున్నారు. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించబోతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. అందులో తొలి భాగం దేవర పార్ట్ 1 ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 5న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అవుతోంది.
దేవర సినిమా కోసం తారక్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తోంది చిత్ర బృందం. ఈ నేపథ్యంలో మేకర్స్ సోమవారం ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. పాన్ ఇండియా భారీ బడ్జెట్ మూవీ గ్లింప్స్‌లోని సన్నివేశాలను చూస్తుంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో రూపొందుతోందని తెలుస్తోంది. వీడియో గ్లింప్స్‌ను గమనిస్తే అందులో సముద్రం, ఓడలతో పాటు రక్తంతో నిండిన ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఇంతకు ముందెన్నడూ చూడని మాస్ అవతార్‌లో దేవరగా ఎన్టీఆర్ నటన, లుక్ చూస్తుంటే పులి గాండ్రిస్తున్నట్లే అనిపిస్తోంది. లుక్ ఎన్టీఆర్‌ను చూస్తుంటే వావ్ అనిపిస్తుంది. గ్లింప్స్‌లోని ప్రతీ ఫ్రేమ్ చూస్తుంటే కొరటాల శివ రూపొందించిన సరికొత్త భారీ ప్రపంచం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
గ్లింప్స్‌లో ఎంత భారీగా సినిమాను రూపొందిస్తున్నారనే విషయం స్పష్టమవుతుంది. అలాగే దేవర పాత్ర ఎలా ఉండబోతుందనేది అర్థమవుతుంది. ఎన్టీఆర్ తనదైన నటనతో, ప్రతీ భాషలో డైలాగ్‌ను ఆయన పలికిన తీరు చూస్తే వావ్ అనాల్సిందే. రక్తంతో తడిసిన డి ఆకారంలోని ఆయుధాన్ని ఎన్టీఆర్ శుభ్రం చేస్తూ, ఈ సముద్రం చేపల కంటే రక్తాన్నే ఎక్కువగా చూసింది అందుకనే దీన్ని ఎర్ర సముద్రం అంటారు అంటూ ఆ సముద్రాన్ని ఎర్ర సముద్రం అని ఎందుకు పిలుస్తారోనని తన పవర్ఫుల్ వాయిస్‌తో చెప్పటం చూస్తుంటే గూజ్ బమ్స్ రావటం పక్కా.
టైగర్ నటన అద్భుతం అంటూ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ అంతర్జాతీయ స్థాయి సంగీతాన్ని అందించారు. దేవర గ్లింప్స్ సినిమాను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళుతుంది. తన బ్యాగ్రౌండ్ స్కోర్ టీజర్‌కు మేజర్ ఎసెట్ అవుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్స్ అంచనాలను మించేలా ఎక్కడా తగ్గకుండా అన్కాంప్రమైజ్డ్గా సినిమాను రూపొందిస్తున్నాయి. వి.ఎఫ్.ఎక్స్ టీమ్ వర్క్ ప్రతీ ఫ్రేమ్‌ను మరో స్థాయిలో ఆవిష్కరిస్తోంది. టాప్ టెక్నికల్ వర్క్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం ఎలా ఉండనుందనే విషయాన్ని గ్లింప్స్ ద్వారా తెలియజేశారు.
ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న దేవర చిత్రంలో ఇంకా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్ చాకో, నరైన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ సంగీత సారథ్యం వహిస్తుండగా శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.