దొరసాని మూవీ రివ్యూ
తెలిసిన కథే కానీ… (‘దొరసాని’ రివ్యూ)
Rating: 2.5
అప్పట్లో దొర, దొరల గడీ లు చూపిస్తూ ఒసేయ్ రాములమ్మ సినిమా వచ్చింది. ఆ తర్వాత ఎందుకనో దొరల ఆగడాలను స్పృశిస్తూ పెద్దగా కథలు రాలేదు. ఇప్పుడు తెలంగాణా విడిపోయాక అక్కడ సంస్కృతి, చరిత్రని అక్కడివారు గుర్తు చేసుకుంటున్నారు. తమ దైన కథలతో ముందుకు వస్తున్నారు. తమ ప్రాంత సాంస్కృతిక నేపధ్యాలను సినిమాల్లో తీసుకువస్తున్నారు. అలా వచ్చిందే దొరసాని. ఈ సినిమా కొన్ని ప్రాంతాలకే పరిమిత అవుతుందా…అందరికీ నచ్చే కథాంశమవుతుందా…అసలు సినిమాలో కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి..
తెలంగాణాలో ఓ పల్లెలో ఓ దొరగారు (వినయ్ వర్మ). ఆయనకో కూతురు దొరసాని (శివాత్మిక). దొర తన కూతురుని అందరికన్నా కాస్త ఎక్కువ గారాబంగానే పెంచుతాడు. అయితే గడీలో పెట్టి ఉంచుతాడు. అలా ఓ చోట దాస్తే ఏమౌతుంది. బయిట ప్రపంచంలోకి ఎప్పుడెళ్దామా అని ఆరాటం మొదలవుతుంది. ఈ పిల్లా అంతే. వెళ్ళటమే కాదు ఓ కుర్రాడు రాజు(ఆనంద్ దేవరకొండ) కళ్లలో పడింది. కళ్లు కళ్లూ కలిపేసింది..ఆనక కొద్ది రోజులు అయ్యాక పెదాలు..పెదాలు కూడా కలిపేసింది. అవన్ని పెద్దలు ఒప్పుకోరు..ముఖ్యంగా వాళ్ళ నాన్న అయినటువంటి దొరగారు ఒప్పుకోరనే విషయం మర్చిపోయింది. దాంతో ఆ దొర పగ పట్టేసాడు. వీళ్ల ప్రేమను విడతీసేసాడు. ఆ కూలి ఎదవతో నా కూతురు ప్రేమలో పడటమేంటని అసహ్యించుకున్నాడు. కుర్రాడని జైల్లో పెట్టించాడు. కూతురని అమెరికా తోలేసే ప్రయత్నం చేసాడు. అయితే ప్రేమ ఆయన కన్నా గొప్పది కదా. అందుకే ఆయన్ని , దొరతనాన్ని, ఆ ఊరుని దాటి ఒకటయ్యే ప్రయత్నం చేసింది. అదెలా జరిగింది అంటారా..అయితే సినిమా చూడాల్సిందే.
ఇవీ బాగన్నాయి
ఎనభైల్లో జరిగే ఈ కథకు సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరక్టర్ ఇద్దరూ కలిసి ప్రాణం పోసారు. డైరక్టర్ కన్నా వీళ్లే బాగా కష్టపడ్డారని అర్దమవుతుంది. ముఖ్యంగా సినిమాకు నేటివిటి ని అద్ది నిలబెట్టారు. దొర వ్యవస్ద, తెలంగాణా నేపధ్యం ఈ సినిమాకు కొత్తదనం తీసుకువచ్చాయి. అలాగే తెలంగాణా యాసలో డైలాగులు సైతం ఆ ప్రాంతంలోకి తీసుకువెళ్లాయి.
హీరో,హీరోయిన్స్ కొత్త అయినా..
హీరోహీరోయిన్లు గా పరిచయమైన ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ ఇద్దరూ అద్బుతంగా నటించారని అనలేం కానీ ప్రెష్ లుక్ తీసుకు వచ్చారు. ఆనంద్ కన్నా శివాత్మిక రాజశేఖర్ మంచి పరిణితి చూపించింది. గంభీరంగా కనిపిస్తూ .. కళ్లతోనే ముఖ్యమైన హావభావాలను పలికిస్తూ.. హైలెట్ గా నిలిచింది. ఆమెకు మంచి భవిష్యత్ ఉంది. హీరోకి ఫ్రెండ్స్ గా నటించిన కుర్రాళ్లు కూడా మంచి కామెడీ టైమింగ్ ఉన్నవాళ్లే. మిగతవాళ్లు గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేమీలేదు.
సాంకేతికంగా..
మొదటే చెప్పుకున్నట్లు ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డిపార్టమెంట్ హైలెట్. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్. ఎడిటరే మనని తిట్టుకునేలా చేసాడు. డైరక్టర్ ..సినిమాని సాగతీయటంలో పీహెడ్ డీ చేసినట్లు ఉన్నారు. మెల్లిగా నడిపిస్తూ పోయారు.
చూడచ్చా
తెలిసిన కథను బ్యాక్ డ్రాప్ మార్చి చెప్తే ఎలా ఉంటుందో చూడాలంటే వెళ్లచ్చు.
తెర వెనక..ముందు
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్, కన్నడ కిశోర్, వినయ్ వర్మ, `ఫిదా` శరణ్య తదితరులు
బ్యానర్: మధుర ఎంటర్టైన్మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్
సమర్పణ: డి.సురేష్‌బాబు
సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి
ఎడిటర్ : నవీన్ నూలి
సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
ఆర్ట్ డైరెక్టర్ : జెకె మూర్తి
కో ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని
నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని
రచన, దర్శకత్వం : కె.వి.ఆర్. మహేంద్ర