Reading Time: < 1 min

నవీన్ పోలిశెట్టి ఫస్ట్ లుక్ విడుదల

యూవీ క్రియేషన్స్ సినిమాలో స్టాండప్ కమెడియన్ పాత్రలో నవీన్ పోలిశెట్టి, బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల

యంగ్ టాలెంట్ నవీన్ పోలిశెట్టి, అందాల తార అనుష్క శెట్టి హీరో హీరోయిన్లుగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు పి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క చెఫ్ పాత్రలో నటిస్తున్నారు ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా సోమవారం హీరో నవీన్ పోలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆయన క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ సిద్ధు పోలిశెట్టి క్యారెక్టర్ లో కనిపించనున్నారు. కామెడీ టైమింగ్ లో మంచి పేరున్న నవీన్ స్టాండప్ కమెడియన్ గా మరింతగా నవ్వించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. వచ్చే ఏడాది తెరపైకి రానున్న ఈ మూవీపై ఫిల్మ్ లవర్స్ లో మంచి అంచనాలున్నాయి.

సాంకేతికవర్గం :

సంగీతం – రధన్
సినిమాటోగ్రఫీ- నీరవ్ షా
ఆర్ట్ – రాజీవన్ నంబియార్
పీఆర్వో – జీఎస్కే మీడియా
నిర్మాణం – యూవీ క్రియేషన్స్