నాంది ఎఫ్ఐఆర్ను ఆవిష్కరించిన విజయ్ దేవరకొండ
అల్లరి నరేష్ బర్త్‌డే సందర్భంగా హరీష్ శంకర్ వాయిస్ ఓవర్‌తో మొదలైన ‘నాంది’ ఎఫ్ఐఆర్ను ఆవిష్కరించిన విజయ్ దేవరకొండ
“ఒక మనిషి పుట్టడానిక్కూడా తొమ్మిది నెలలే టైమ్ పడుతుంది. మరి నాకు న్యాయం చెప్పడానికేంటి సార్.. ఇన్ని సంవత్సరాలు పడుతోంది?”.. ఇది ‘నాంది’ సినిమాలో అల్లరి నరేష్ వేస్తున్న ప్రశ్న. ఆ సినిమా ఇతివృత్తం ఏ లైన్ మీద ఆధారపడిందో ఈ ఒక్క డైలాగ్ చెబుతోంది. జూన్ 30 హీరో అల్లరి నరేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ‘నాంది’ ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్) టీజర్‌ను ఉదయం 9:18 గంటలకు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆవిష్కరించారు.
టీజర్‌ను షేర్ చేస్తూ, “ప్రపంచానికి ఈ టీజర్‌ను షేర్ చేస్తున్నందుకు వెరీ హ్యాపీ. మొత్తం టీమ్‌కు నా శుభాకాంక్షలు. అల్లరి నరేష్ ఫెంటాస్టిక్‌గా కనిపిస్తున్నారు. హ్యాపీ బర్త్‌డే అన్నా” అని ట్వీట్ చేశారు విజయ్ దేవరకొండ.
డైరెక్టర్ హరీష్ శంకర్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన టీజర్ ప్రకారం అల్లరి నరేష్ ఒక అండర్ ట్రయల్ ఖైదీ అనీ, చేయని నేరానికి జైలు పాలై, న్యాయం కోసం అలమటించిపోతున్నాడనీ అర్థమవుతోంది. 2015 నాటికి దేశంలోని జైళ్లన్నింటిలో 3,66,781 మంది ఖైదీలుంటే, వారిలో 2,50,000 మంది అండర్ ట్రయల్ ఖైదీలేననీ, అంటే కోర్టులో శిక్షపడని ఖైదీలేననీ ఈ టీజర్లో తన వాయిస్ ఓవర్ ద్వారా హరీష్ శంకర్ చెప్పారు. అలాంటి ఒక అండర్ ట్రయల్ ఖైదీ కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు విజయ్ కనకమేడల. హరీష్ శంకర్ దగ్గర కో-డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమాకు సంబంధించి లాక్డౌన్ విధించక ముందే 80 శాతం షూటింగ్ పూర్తయింది.
‘నాంది’ అల్లరి నరేష్ నటిస్తోన్న 57వ చిత్రం. ఇప్పటివరకూ ఎక్కువ శాతం సినిమాల్లో ప్రేక్షకులకు నవ్వులు పంచుతూ వచ్చిన ఆయన ఈ చిత్రంలో వాటికి పూర్తి భిన్నమైన, ఒక ఉద్వేగభరితమైన పాత్రను చేస్తున్నారని అర్థమవుతోంది. టీజర్లో చూపించిన దాని ప్రకారం పోలీస్ స్టేషన్లో ఒక షాట్లో ఆయన పూర్తి నగ్నంగా కనిపించారు. దీన్ని బట్టి ఈ పాత్రను ఆయన ఎంత ప్రేమించి ఉంటారో ఊహించవచ్చు. నటుడిగా అల్లరి నరేష్‌లోని మరో కోణాన్ని ఈ సినిమాలో మనం చూడబోతున్నాం.
వరలక్ష్మీ శరత్‌కుమార్ లాయర్‌గా, హరీష్ ఉత్తమన్ పోలీస్ ఇన్స్పెక్టర్గా నటిస్తున్నట్లు టీజర్ తెలియజేస్తోంది.
తారాగణం:
అల్లరి నరేష్, వరలక్ష్మీ శరత్‌కుమార్, నవమి, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి, దేవీప్రసాద్, వినయ్ వర్మ, సి.ఎల్. నరసింహారావు, శ్రీకాంత్ అయ్యంగార్, రమేష్‌రెడ్డి, చక్రపాణి, రాజ్యలక్ష్మి, మణిచందన, ప్రమోదిని.
సాంకేతిక వర్గం:
కథ: తూమ్ వెంకట్
డైలాగ్స్: అబ్బూరి రవి
సాహిత్యం: చైతన్య ప్రసాద్, శ్రీమణి
సంగీతం: శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ: సిద్
ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్
ఆర్ట్: బ్రహ్మ కడలి
ఫైట్స్: వెంకట్
పీఆర్వో: వంశీ-శేఖర్
లైన్ ప్రొడ్యూసర్: రాజేష్ దండా
నిర్మాత: సతీష్ వేగేశ్న
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్ కనకమేడల.