నారప్ప చిత్రం ఫస్ట్ సింగిల్ విడుదల
విక్టరి వెంకటేష్ నారప్ప చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ `చలాకీ చిన్నమ్మీ..` విడుదల
విక్టరి వెంకటేష్ హీరోగా మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `నారప్ప`. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో నారప్ప భార్య `సుందరమ్మ`గా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు.
మెలొడి బ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ చలాకీ చిన్నమ్మీ..ఈ రోజు విడుదలైంది.
వెంకటేష్ ఫ్యామిలీ అంతా కలిసి తన కొడుకు పెళ్లి చూపులకు వెళ్లే నేపథ్యంలో వచ్చే పాట ఇది. కార్తీక్ రత్నం ఈ చిత్రంలో వెంకటేష్ కొడుకుగా నటించిన విషయం తెలిసిందే..ఈ ఫ్యామిలీ పాటకు చిన్న రొమాంటిక్ టచ్‌ని కూడా కలిపి మెలొడి బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేశారు.
ఆదిత్య అయ్యంగార్, నూతన మోహన్ శ్రావ్యంగా ఆలపించిన ఈ పాటకు అనంత శ్రీరామ్ మంచి సాహిత్యాన్ని అందించారు.
ఇటీవల సురేష్ ప్రొడక్షన్ వారు ఎస్పీ మ్యూజిక్ లేబుల్‌ని ప్రారంభించిన విషయం తెలిసిందే..అందులో మొదటి సినిమాగా `నారప్ప` సాంగ్స్ విడుదలవుతున్నాయి. ఎస్పీ మ్యూజిక్ లేబుల్ వారు మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ సాంగ్ అని చెప్పొచ్చు.
ఇప్పటికే షూటింగ్, పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలను ముగిశాయి. త్వరలోనే విడుదల తేదిని ప్రకటించనున్నారు మేకర్స్.
ఈ మూవీలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న సరికొత్త పాత్రలలో విక్టరి వెంకటేష్ కనిపించనున్నారు. అలాగే తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు ఇతర ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
ప్రస్తుతం ఈ సినిమాకు ఉన్న బజ్‌ని బట్టి చూస్తే `నారప్ప` వెంకటేష్‌కు మరో భారీ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది.
తారాగణం: విక్టరి వెంకటేష్, ప్రియమణి, కార్తిక్ రత్నం, రావు రమేష్, రాజీవ్ కనకాల తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
నిర్మాతలు: డి. సురేష్‌బాబు, కలైపులి ఎస్. థాను
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
ఆర్ట్: గాంధీ నడికుడికర్
కథ: వెట్రిమారన్
స్క్రిప్ట్ కన్సల్టెంట్: సత్యానంద్
ఫైట్స్: పీటర్ హెయిన్స్, విజయ్
లిరిక్స్: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, అనంతశ్రీరామ్, కృష్ణకాంత్, కాసర్ల శ్యాం