Reading Time: 2 mins

నిర్మాత గౌరికృష్ణ ఇంటర్వ్యూ

మంచి క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డ‌మే నిర్మాత‌గా నా ల‌క్ష్యం – నిర్మాత గౌరికృష్ణ

మాఊరి పొలిమేర చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం మా ఊరి పొలిమేర 2 డా.అనిల్ విశ్వనాథ్. ద‌ర్శ‌కుడు. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల ముఖ్యతారలుగా నటించిన ఈ చిత్రం ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. గౌరికృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. విడుద‌లైన రోజు నుంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యం దిశ‌గా చిత్రం కొన‌సాగుతుంది. ఈ సంద‌ర్భంగా నిర్మ‌త గౌరిక్రిష్ణ పాత్రికేయులతో ముచ్చ‌టించారు.

స‌క్సెస్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?

నా తొలి స‌క్సెస్. చాలా కొత్త‌గా వుంది. నేను ఊహించ‌ని విజ‌యం. ప్రేక్ష‌కుల నుంచి ఇంత గొప్ప స్పంద‌న వ‌స్తుందని అనుకోలేదు. మొద‌ట్లో అంద‌రూ చిన్న సినిమాగానే చూశారు. ఫ‌లితం ఓ పెద్ద సినిమాలా వ‌చ్చింది. రోజు రోజుకు వ‌సూళ్లు పెరుగుతున్నాయి. థియేట‌ర్‌లు కూడా పెరిగాయి.

మొద‌టి పార్ట్ విజ‌యం సాధించ‌డం రెండో పార్ట్ విజ‌యానికి ఎంత వ‌ర‌కు దోహ‌ద‌ప‌డింది?

చాలా హెల్ప్ అయ్యింది. పార్ట్ చూసిన వాళ్లంద‌రూ బాగుంద‌ని అన్నారు. ఈ రోజు పార్ట్-2 ట్రైల‌ర్ విడుద‌ల కాగానే పార్ట్ -1 ట్రెండింగ్‌లోకి వ‌చ్చింది. మొద‌టి పార్ట్ హిట్ అయ్యింద‌ని పొలిమేర 2 తీయ‌లేదు. ముందే దీనికి సీక్వెల్ ప్లాన్ చేశాం. ద‌ర్శ‌కుడి మీద న‌మ్మ‌కంతోనే పొలిమేర -2 తీశాం

మా వూరి పొలిమేర ఓటీటీలో విడుద‌ల చేశారు? పార్ట్ 2 థియేట‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని అనుకున్నారా?

ముందే అనుకున్నాం. మా వూరి పోలిమేర -2 ఖ‌చ్చితంగా థియేట‌ర్‌లో విడుద‌ల చేద్దామ‌ని అనుకున్నాం. అనుకున్న‌ట్లుగానే ఆ దిశ‌గానే ప్ర‌య‌త్న‌లు చేశాం.

ప్రేక్ష‌కుల స్పంద‌న ఎలా వుంది?
టీమ్ అంతా కలిసి థియేట‌ర్లు తిరుగుతున్నాం. ఆడియ‌న్స్ ప్ర‌తి స‌న్నివేశాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ప్ర‌తి ట్విస్ట్‌కు ఎంతో థ్రిల్ల్‌గా ఫీల‌వుతున్నారు. థియేట‌ర్‌లో వాళ్ల అరుపులు, కేక‌లు చూసి మా క‌ష్టాన్ని మ‌ర్చిపోయాం.

చేత‌బ‌డుల నేప‌థ్యం ఎంచుకోవ‌డానికి కార‌ణం?

నేటి స‌మాజంలో జ‌రుగుతున్న‌కొన్ని సంఘ‌ట‌న‌ల ప్రేర‌ణ‌తో ద‌ర్శ‌కుడు ఈ క‌థ‌ను రాసుకున్నాడు. కాన్సెప్ట్ కూడా కొత్త‌గా వుండ‌టంతో ఈ నేప‌థ్యాన్ని ఎంచుకున్నాను.

నిర్మాత‌గా ఈ సినిమా ఎలాంటి ఎక్స్‌పీరియ‌న్స్ ఇచ్చింది?

తొలి స‌క్సెస్ కిక్కు ఇచ్చింది. ఈ చిత్ర విజ‌యం నా లో ఆత్మ‌విశ్వాసాన్ని పెంచింది. త‌ప్ప‌కుండా భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని మంచి సినిమాలు తీయాల‌నుకుంటున్నాను. మంచి క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డ‌మే నిర్మాత‌గా నా ల‌క్ష్యం.

వంశీ నందిపాటి విడుద‌ల చేయ‌డం మీ విజ‌యానికి ఎలా దోహ‌ద‌ప‌డింది?

గీతా ఆర్ట్స్ సంస్థ కు చెందిన వ్య‌క్తి విడుద‌ల చేయ‌డం వ‌ల్ల సినిమాకు బాగా ప్ల‌స్ అయ్యింది.మంచి థియేట‌ర్‌లు దొర‌క‌డం, మంచి ప్ర‌మోష‌న్ చేయ‌డంతో సినిమాకు మంచి బ‌జ్ వ‌చ్చింది.

మీ త‌దుప‌రి చిత్రం

క‌థాచ‌ర్చ‌లుజ‌ర‌గుతున్నాయి. త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాను.