Reading Time: < 1 min

నేనుకీర్తన చిత్రం సీతా కోకై సాంగ్ విడుదల

చిమటా రమేష్ బాబు హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందించినవ నేను కీర్తన చిత్రం నుంచి విడుదలైన సీతాకోకై ఎగిరింది మనసే లిరికల్ వీడియోకు అసాధారణ స్పందన లభిస్తోంది. ఈ లిరికల్ వీడియోను సంచలన దర్శకుడు సాయి రాజేష్ విడుదల చేయడం తెలిసిందే. ఈ పాటను కులుమనాలిలో ఏరికోరి ఎంపిక చేసిన పలు అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించారు!!!

చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ… చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) రిషిత మేఘన హీరోహీరోయిన్లుగా… చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన నేనుకీర్తన చిత్రాన్ని అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు!!

బేబి దర్శకుడు సాయి రాజేష్ గారు రిలీజ్ చేసిన సీతా కోకై లిరికల్ వీడియోకు అనూహ్యమైన స్పందన వస్తుండడం ఈ చిత్ర విజయపై మేము పెట్టుకున్న నమ్మకాన్ని రెట్టింపు చేసింది అంటూ ఈ పాటను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ చిత్ర దర్శకుడు కమ్ కథానాయకుడు చిమటా రమేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. నేను కీర్తన చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు!!

మల్టీ జోనర్ ఫిల్మ్ గా తెరకెక్కి, సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉన్న నేను కీర్తన చిత్రానికి బిజినెస్ పరంగానూ మంచి క్రేజ్ ఏర్పడింది. కులుమనాలిలో చిత్రీకరించిన పాటలతోపాటు… ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది!!

నటీనటులు :

సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్

సాంకేతిక వర్గం :

సంగీతం: ఎం.ఎల్.రాజా
ఛాయాగ్రహణం: కె. రమణ
కూర్పు: వినయ్ రెడ్డి బండారపు
సమర్పణ: చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ)
నిర్మాత: చిమటా లక్ష్మికుమారి
రచన దర్శకత్వం: చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్.)