నో ఎంట్రీ ట్రైలర్ మూవీ విడుదల
ఆండ్రియా జెరెమియా యాక్షన్ థ్రిల్లర్ నో ఎంట్రీ ట్రైలర్ విడుదల.
కోలీవుడ్‌లోని మల్టీటాలెంటెడ్ హీరోయిన్స్‌లో ఆండ్రియా జెరెమియా ఒకరు. ఆమె ఇప్పటివరకు ఫ్యామిలీ, లవ్, కామెడీ చిత్రాల్లో నటించింది. అయితే ఈ సారి ఆండ్రియా యాక్షన్ హీరోయిన్గా కనిపించనుంది. అటవీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న నో ఎంట్రీ చిత్రంలో ఆమె సరికొత్త పాత్రలో నటిస్తోంది. ఈ మూవీలో ఆండ్రియా ఎంతో సాహసంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ పాత్ర చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా నో ఎంట్రీ మూవీ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్.
ట్రైలర్‌ని గమనిస్తే దట్టమైన అటవీ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్ళిన కొంత మంది స్నేహితులు అడవిలోని కొండ శిఖరంలో ఉన్న లగ్జరీ విల్లాలో బస చేస్తారు. ఆ ఇంటిని క్రూరమైన అడవి కుక్కలు చుట్టుముడతాయి. ఆ కుక్కల భారీనుండి వారు ఏ విధంగా తప్పించుకున్నారన్నదే ఈ చిత్ర కథగా తెలుస్తోంది. ఎంతో థ్రిల్లింగ్‌గా, రోమాలు నిక్కబొడుచుకునేలా ఇందులోని సన్నివేశాలను తెరకెక్కించినట్టు దర్శకుడు ఆర్. అళగు కార్తీక్ వెల్లడించారు. జంబో సినిమాస్ బ్యానరులో శ్రీధర్ అరుణాచలం ఈ చిత్రాన్ని నిర్మించారు. అదవ్ కణ్ణదాసన్,రన్యరావ్, మానస్, జయశ్రీ, జాన్వీ ఇతర కీలకపాత్రల్లో నటించారు. త్వరలోనే ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో విడుదలకానుంది.