Reading Time: 3 mins

పఠాన్ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ పఠాన్ అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు. ఒకప్పుడు ఆయన నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయి ఫ్యాన్స్ గా మారిన వారంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు దానికి తోడు ఈ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది ఖచ్చితంగా ఆమె తన నటనతో పాటు గ్లామర్తోను ప్రేక్షకులని కట్టిపడేస్తుందనే నమ్మకం డైరక్టర్ సిద్దార్ద్ ఆనంద్ యాక్షన్ థ్రిల్లర్స్ చేయటంలో మంచి పేరుంది. ఆయన సినిమాల్లో ప్రతి సన్నివేశంలోను ప్రేక్షకులు థ్రిల్ అవుతారు ఇన్ని ప్లస్ లతో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది చిత్రం కథేంటి వర్కవుట్ అయ్యే మేటరేనా రెగ్యులర్ రొటీన్ బాలీవుడ్ స్టఫ్పా రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

అనాధగా పెరిగిన పఠాన్ (షారుఖ్ ఖాన్) కు ఈ దేశం అంటే ప్రాణం దేశం కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా, తీయటానకైనా సిద్దం అన్నట్లు ఉంటాడు ఇతోనో రా ఏజెంట్ అతను గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నాడు. అయితే అతను బయిటకు వచ్చి తనేంటో చూపించాల్సిన అవసరం ఏర్పడింది. మన దేశంలో ఆర్టికల్ 370ని రద్దు చేయటంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఓ పాకిస్దాన్ అధికారి దాడికి ప్లాన్ చేస్తాడు. ఆ దాడి చేయటం కోసం భారత్ అంటే మండిపడే జిమ్ (జాన్ అబ్రహం) ని ఎంచుకుని రంగంలోకి దింపుతాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే జిమ్ కూడా ఒకప్పుడు భారతదేశం తరఫున రా ఏజెంట్గా పనిచేసినవాడే అయితే అతను కొన్ని కారణాలతో భారత్ కు వ్యతిరేకంగా మారతాడు అతను ఎందుకు అలా మారాడు భారత్పై జిమ్ ఏ విధమైన దాడికి ప్లాన్ చేసాడు ఆ దాడికి సిద్ధమైన జిమ్ని పఠాన్ ఎలా ఎదుర్కొన్నాడు?ఈ క్రమంలో పాకిస్థాన్ ఐ.ఎస్.ఐ ఏజెంట్ రూబై (దీపికా పదుకొణె) (Deepika Padukone) పాత్ర ఏమిటి?చివరకు ఏమైంది? అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్

గత ముప్పై సంవత్సరాలుగా షారూఖ్ మనని పలకరిస్తూనే ఉన్నాడు ఆ విషయం ఆయనే స్వయంగా డైలాగులోనూ చెప్తారు అలా షారూఖ్ సినిమాలంటే ఒకప్పుడు యూత్ కు యమా మోజు. డీడీఎల్ జే, దిల్ చాహతా హై, బాజీగర్,కరణ్ అర్జున్, ఓం శాంతి ఓం ఇలా వరసపెట్టి ఎన్నో సూపర్ హిట్స్ అన్ని ఏమైపోయాయో ఒక్కసారిగా ఆయన వెనకబడ్డాడు ఆయన చివరి సినిమా జీరోలాగానే కెరీర్ ఆగిపోయింది. దాంతో తనను ఆవిష్కరించుకోవటానికి, తను ఎక్కడున్నాడో తెలుసుకోవటానికి, ఫిట్నెస్ పెంచుకోవటానికి బాలీవుడ్ బాద్షా నాలుగేళ్లు టైమ్ తీసుకున్నాడు ఈ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపించారు అయితే అంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఎలా ఉండచ్చు ఉంటుంది అనేది అభిమానుల మనస్సులో ఆలోచన చాలా హై ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు అందుకు తగ్గట్లుగానే గత పదిరోజులు నుంచి ప్యాన్స్ సెలబ్రేషన్స్ అడ్వాన్స్ బుక్కింగ్స్, ఓపినింగ్స్ రూపంలో కనపడుతున్నాయి. వారందిరినీ షారూఖ్ సంతృప్తి పరిచాడా అంటే కొంతవరకూ ఖచ్చితంగా అని చెప్పాలి ప్యూర్ యాక్షన్ సబ్జెక్టుతో దేశభక్తిని మిళితం చేసి ఈ సినిమాని దింపాడు.

ఓ సైనికుడు తనకి దేశం ఏం చేసిందని కాదు, తాను దేశానికి ఏం చేశాననే ఆలోచిస్తాడంటూ షారుఖ్ చెప్పే డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎందుకైనా మంచిదని తోడు సల్మాన్ ఖాన్ ని కూడా తెచ్చుకున్నాడు. సెకండాఫ్ లో వీరిద్దరూ కలిసి చేసే ట్రైన్ ఫైట్ అయితే కేక పెట్టించింది బేషరమ్ పాటకు థియేటర్స్ లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది సినిమా అంతా గ్రాండ్ గా ఉంది ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు ముందుకు వెళ్లారు అంతా బాగానే ఉంది కానీ కాస్త కథ కూడా పట్టించుకుంటే బాగుండేది అనేది సగటు ప్రేక్షకుడకి కూడా వచ్చే ఆలోచన స్క్రీన్ ప్లే చాలా ప్రెడిక్టబుల్ గా సాగుతుంది దర్శకుడు ట్విస్ట్ లు అనుకున్నవి అన్ని ముందే ప్రేక్షకుడు గుర్తించేయటమే అసలైన ట్విస్ట్. అలాగే షారుఖ్, జాన్, దీపికా ఈ మూడు పాత్రలకీ ఫ్లాష్ బ్యాక్ పెట్టారు అదీ పెద్దగా కిక్ ఇవ్వదు.

క్లైమాక్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ దాదాపు అన్ని సినిమాలకు జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఇక్కడ డైరక్టర్ కేవలం షారూఖ్ చేత ఇంకెన్ని ఫైట్స్ ఇంకెంత విభిన్నంగా చేయించవచ్చు అనే ఆలోచనలో మునిగిపోయినట్లున్నాడు. ఏదైమైనా సగటు అభిమానికి ఈ సినిమా మంచి వంటకమే ఫుల్ మీల్సే మిగతా వారికే మామూలు మాసాలా పీసు గట్టిగా ఆలోచిస్తే హాలీవుడ్ నుంచి పుట్టిన మసాలా సీన్ ల లేసు. అయితే ఎన్ని చేసినా, ఎంత చేసినా ఎమోషనల్ డెప్త్ లేకపోతే ఆ కథ,సినిమా పెద్దగా ఏమీ అనిపించదు. అదే ఈ సినిమాకు జరిగింది దేశభక్తి అంటూ రైజ్ చేయాల్సిన ఎమోషన్స్ ని మరిచారు అలాగే ట్విస్ట్ లును నమ్ముకున్నాడు కానీ అవి సినిమాకు హైలెట్ అయ్యే స్దాయిలో లేవు.

టెక్నికల్ గా

డైరక్టర్ ఎలాగైనా షారూఖ్ కు హిట్ ఇవ్వాలని అన్ని జాగ్రత్తలు తీసుకుని చేసారు. పూర్తి స్దాయి హీరోయిజాన్ని, దేశభక్తిని కలిపి వండారు. అలాగే సల్మాన్ ఖాన్ ని తీసుకురావటం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. చాలా సార్లు హాలీవుడ్ సినిమా యాక్షన్ సీన్స్ ని చూసిన ఫీలింగ్ వస్తుంది అలాగే పనిలో పనిగా మార్వెల్ సినిమాల్ని చూస్తున్న అనిపిస్తుంది. కథ, కథనాలు పట్టించుకోకుండా ఈ సినిమాకి విజువల్స్ ని హైలైట్గా చేస్తూ నడిపారు. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా విజువల్ గా గ్రాండియర్ గా ఉంది డైలాగులు, పాటలు, రీరికార్డింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అవుతాయి సినిమాటోగ్రఫీ స్పెషల్ గా కనిపిస్తుంది యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పేదేముంది?

నటీనటుల్లో

ఇది షారూఖ్ ఖాన్ భుజాలపై మోసిన చిత్రం. పాకిస్తాన్ ISI ఏజెంట్ గా దీపిక ని చూస్తూంటే హాలీవుడ్ స్టార్ Scarlett Johansson గుర్తు వస్తుంది. విలన్ గా జాన్ అబ్రహం బాగున్నాడు కానీ షారూఖ్ వంటి స్టార్ కు ఎదురు నిలిచి నిలబడేలా కనపడలేదు. సీనియర్ నటి డింపుల్ కపాడియా మరియు అశుతోష్ రాణా కీలక పాత్రల్లో నటించి మెప్పించారు మిగతా పాత్రధారులు కూడా అద్భుతంగానే నటించారు.

ప్లస్ పాయింట్స్

వయస్సుతో పాటు పెరుగుతున్న షారూఖ్ గ్రేస్
సల్మాన్ ఎపిసోడ్
ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్

సాగదీత సన్నివేశాలు
రొటీన్ ట్విస్ట్ లు,
నీరసం తెప్పించే స్క్రీన్ ప్లే

చూడచ్చా

యాక్షన్ సీన్స్ , స్పై సినిమాలు ఇష్టపడేవారికి ఇది ఫుల్ మీల్స్ మిగతా వారికి ఓ కొత్త షారూఖ్ సినిమా అంతే.

నటీనటులు :

షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్, జాన్ అబ్రహం, అశుతోష్ రానా, డింపుల్ కపాడియా తదితరులతో పాటు అతిథి పాత్రలో సల్మాన్ ఖాన్

సాంకేతిక వర్గం :

స్క్రీన్ ప్లే : శ్రీధర్ రాఘవన్
ఛాయాగ్రహణం : సంచిత్ పౌలోస్
స్వరాలు : విశాల్ – చంద్రశేఖర్
నేపథ్య సంగీతం : సంచిత్ బల్హారా, అకింత్ బల్హారా
నిర్మాత : ఆదిత్య చోప్రా
కథ, దర్శకత్వం : సిద్ధార్థ్ ఆనంద్
రన్ టైమ్ : 146 మినిట్స్
విడుదల తేదీ: జనవరి 25, 2023