పతంగ్ చిత్రం టీజర్ విడుదల
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా పతంగ్ అందర్ని మనసులకు హత్తుకుంటుంది
ఇప్పటి వరకు భారతీయ సినిమాలో ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు ప్రేక్షకులు చూసి వుంటారు. కాని తొలిసారిగా పతంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్యతారలుగా నటిస్తున్నారు. మరికొంత మంది నూతన నటీనటులతో పాటు ప్రముఖ సింగర్, నటుడు ఎస్పీ చరణ్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం టీజర్‌ను గురువారం ప్రసాద్ ఐమ్యాక్స్‌లో జరిగిన వేడుకలో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సంచలన దర్శకుడు ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌తో పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్న బుచ్చిబాబు సానా టీజర్‌ను విడుదల చేశారు. మరో అతిథి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఈ సినిమా కాంటెస్ట్‌లో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో
ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, వంశీ పూజిత్ ప్రణీత్ పత్తిపాటి, ఆటా సందీప్ మాస్టర్, మాజీ ప్లార్లమెంట్ సిరిసిల్ల రాజయ్య, నటి శాన్వి, రవిప్రకాష్, చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
బుచ్బిబాబు మాట్లాడుతూ కంటెంట్ చూస్తుంటే సినిమా షూర్ షాట్ హిట్ అనిపిస్తుంది. ఈ సినిమాకు ఆ
యూత్‌ఫుల్ వైబ్ కనిపిస్తుంది. మరో హ్యపీడేస్లా ఘనవిజయం సాధిస్తుందన్న అనిపిస్తుంది. నాని నేను మా గురువు గారు సుకుమార్ దగ్గర పనిచేస్తున్నప్పుడు నాకు తెలుసు. మంచి టెక్నికల్ నాలెడ్జ్ వుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి అందరికి మంచి పేరును తీసుకరావాలి అన్నారు.
దర్శకుడు ప్రణీత్ మాట్లాడుతూ సినిమా టీజర్ నచ్చితే అందరికి సినిమా నచ్చినట్టే. ఒక తెలుగు కమర్షియల్ సినిమాలో వున్న ఎలిమెంట్స్ వున్నాయి. తప్పకుండ సినిమా నచ్చుతుంది. టీజర్ లో చెప్పినట్లుగా మ్యాచ్‌లో కలుద్డాం అన్నారు.
నిర్మాత సంపత్ మక మాట్లాడుతూ ఈ సినిమా చాలా వ్యయ ప్రయాసాలతో జరిగింది. ఈ గాలిపటం దారం తెగకుండా చూసుకున్నాడు నాని. ఈ రోజు సినిమా బాగా రావడానికి టీమ్ అంతా కృషి చేశారు. టీజర్లో వున్నట్లు అందరూ మ్యాచ్ కోసం ఈసినిమా మళ్లీ మళ్లీ చూస్తారు.
క్రియేటివ్ నిర్మాత నాని బండెడ్డ్రి మాట్లాడుతూ ఎంతో బిజీగా రెహమాన్ గారితో మ్యూజిక్ సిట్టింగ్ష్లో వున్న బుచ్చిబాబు గారు మా మీద ప్రేమతో వచ్చినందుకు కృతజజ్క్షతలు తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా అందర్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఈ సినిమా థియేటర్స్‌లో యూత్ఫెస్టివల్స్ జరుగుతాయి.
సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ ఈ సినిమా విజయం సాధించి మరెంతో మందికి ప్రేరణగా నిలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.