పరిగెత్తు పరిగెత్తు మూవీ రివ్యూ
క్రైమ్ థ్రిల్లర్ !!: ‘పరిగెత్తు పరిగెత్తు’ రివ్యూ
Emotional Engagement Emoji (EEE) :
కొన్ని సినిమాలు థియోటర్ లో చూడటానికి బాగుంటాయి. మరికొన్ని ఓటీటిలోనే చూడగలం. ఇంకొన్ని అసలు ఎక్కడా చూడలేం. అందుకే థియోటర్ లో నడవకపోయినా ఓటీటిలో సక్సెస్ అవుతాయేమో అని ఆశపడుతూంటారు. అలా థియోటర్ లో రిలీజైన సినిమాలు ఆ తర్వాత కాలంలో ఓటీటిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘పరిగెత్తు పరిగెత్తు’ అనే చిత్రం అమేజాన్ ప్రైమ్ ఓటీటిలో రిలీజైంది. ఆ సినిమా ఎలా ఉంది, రిజల్ట్ ఏమిటో చూద్దాం.
స్టోరీ లైన్
మిడిల్ క్లాస్ కుర్రాడు అజయ్(సూర్య శ్రీనివాస్ ) త్వరగా సెటిలై తన కుటుంబ కష్టాలు తీర్చాలనుకుంటాడు. అందుకోసం బిజినెస్ ని మార్గం గా ఎంచుకుంటాడు. అలాగే అతనికి రెడ్ క్రాస్ సొసైటీలో పనిచేసే ప్రియ(అమృత) పరిచయం అవుతుంది. ఎప్పటిలాగే వీరిద్దరి అభిరుచులు, అభిప్రాయాలు ఒక్కటై ప్రేమలో పడుతారు.ఇక తన బిజినెస్ కోసం మాఫియా దగ్గర 10లక్షలు అప్పు చేసి,బిజినెస్ నడవక తీర్చలేక అతని నుంచి తప్పించుకు తిరుగుతుంటాడు. దాంతో ఆ అప్పు ఇచ్చిన మాఫియా… డబ్బు వసూలు చేయటం కోసం అజయ్ ప్రియురాలు ప్రియ (అమృత) ని బంధించి.. తన అప్పు తీర్చి ఆమెను తీసుకెళ్లాలని షరతు పెడతాడు. అప్పుడు అజయ్ ఏం చేసాడు. అప్పు తీర్చి.. తన లవర్ ని విడిపించుకున్నాడా? ఏంటనేది స్క్రీన్ పై చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే ఎనాలసిస్…
ఈ సినిమా చూస్తూంటే గతంలో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన రన్ చిత్రం గుర్తు వస్తుంది. ఈ టైటిల్ కూడా రన్ కు తెలుగు అనువాదంలా పరుగెత్తు అని పెట్టారు. ఆ పోలిక ప్రక్కన పెడితే… ఇలా కొత్త వాళ్లతో చేసే సినిమాలకు కథ,కథనం బలంగా ఉంటేనే చూడగలం. ముఖ్యంగా స్క్రీన్ ప్లేనే ప్రధాన బలంగా నిలవాలి. స్క్రీన్ ప్లేని ఎంత ఇంట్రస్టింగ్ గా మలుపులతో చూపించగలిగితే… ప్రేక్షకులు అంత బాగా ఇన్వాల్వ్ అయ్యి, థ్రిల్ కు గురవుతూ ఎంజాయ్ చేస్తారు. చిన్న ఐడియాలాంటి స్టోరీ లైన్ ని పూర్తిస్థాయి కథగా మలిచిన విధానం కూడా బాగుంది. ముఖ్యంగా ప్రధాన కథకు ఒక్కో క్యారెక్టర్‌ను కలుపుతూ చేసిన స్క్రీన్‌ప్లే బాగానే ఉంది. ఓ వైపు హీరో చెల్లి ఆరోగ్యాన్ని… మరోవైపు విలన్ చేతిలో బంధీ అయిన ప్రియురాలిని రక్షించుకునే క్రమంలో హీరో ఎలాంటి రిస్క్ ను చేసి.. అనే కథలోని అసలు పాయింట్‌ని ఫస్టాఫ్ లోనే బాగా ప్లాంట్ చేసి పరిచయం చేశారు. అనవసర ఆర్భాటాలకు పోకుండా నడపాలనే ఆలోచనా బాగుంది.

అయితే టైటిల్ లో ఉన్న పరుగు తెరపై కనపడదు. ఈ సినిమాకు సెకండాఫ్ మైనస్. సెకండాఫ్‌లో సినిమాను డల్ గా నడిపించారు. కాంప్లిక్ట్స్ ఏమిటో తెలిసిపోయి రిజాల్వ్ అయ్యే సన్నివేశాలు బోరింగ్‌గా ఉన్నాయి. విలన్ పాత్రకు సరైన క్యారెక్టరైజేషన్ లేదు. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లకు వచ్చేసరికి తొందర తొందరగా చుట్టేసినట్లనిపించింది. చివర్లో సినిమాను తేలిపోయేలా చేశారు. అలాగే హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. ఈ లవ్‌స్టోరీలో ఫ్రెష్‌నెస్ లేదు. ఇక సెకండాఫ్‌లో హీరోయిన్ పాత్రను చాలాచోట్ల ప్రస్తావనకు కూడా ఉండదు.అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం… వైజాగ్ నుంచి చుట్టు పక్కల నగరాలకు గంజాయి ఎలా సరఫరా అవుతోంది… అందులో నిరుద్యోగ యువత ఎలా చిక్కుకొని.. ప్రాణాల మీదికి తెచ్చుకుంటోంది బాగా చూపించటం. గంజాయి మాఫియాలో..వ్యవస్థలోని ముఖ్యమైన వ్యక్తులు కూడా చాలా మంది ఇన్ వాల్వ్ అవుతున్నారని ఎత్తి చూపించాడు.
టెక్నికల్ గా…
ఇలాంటి క్రైం థ్రిల్లర్స్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ముఖ్యం. సునీల్ కశ్యప్ ఇందులో బాగా స్కోర్ చేశారు. రీరికార్డింగ్ చాలా సీన్స్ కు ప్లస్ అయ్యింది. తక్కువ బడ్జెట్లో, తక్కువ లొకేషన్స్‌లో నడిచే సినిమాను అన్నివిధాలా ఉన్నంతలో క్వాలిటీగా ఉంచేలా చేయడంలో సినిమాటోగ్రాఫర్ పనితనం బాగుంది. కల్యాణ్ సమీ సినిమాటోగ్రఫి కూడా ఈ సినిమాకు రిచ్ లుక్ తెచ్చే ప్రయత్నం చేసింది. వెంకట్ ప్రభు ఎడిటింగ్ ఓకే.మిగతా విభాగాల్లోని సాంకేతిక నిపుణులు తమ పరిధి మేరకు ఒకే అనిపించారు. నిర్మాత యామినీ కృష్ణ చిన్న సినిమా అయినా అలా కనపడనీయకుండా ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించారు. . చివర్లో క్లైమాక్స్ ని చకచకా తేల్చేయ కుండా ఉండాల్సింది. ఓవరాల్‌గా దర్శకుడు ఫర్వాలేదనిపించాడు.
నటీనటుల విషయానికి వస్తే…
హీరో, హీరోయిన్ లు ఇద్దరూ కొత్తవాళ్లైనా బాగానే నటించారు..మెప్పించారు. విలన్ పాత్రధారులతో పాటు, చివర్లో వచ్చే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఇంకాస్త బాగా చేసి ఉండాల్సింది. ఐటెం సాంగు మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తుంది.
చూడచ్చా
క్రైం థ్రిల్లర్ ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.
ఎవరెవరు..
బ్యానర్: ఎన్ ఎస్ సినీ ఫ్లిక్స్
నటీనటులు: సూర్య శ్రీనివాస్ , అమృత ఆచార్య, రామకృష్ణ తోట , యోగి , దినేష్, జయ చంద్ర, జయభారత్ రెడ్డి, ప్రకాష్, లక్ష్మణ్, రాజశేఖర్ తదితరులు
ఛాయాగ్రహణం: కల్యాణ్ సమీ
మ్యూజిక్: సునీల్ కశ్యప్
ఎడిటింగ్: బీ వెంకట్ ప్రభు
స్టంట్స్: శంకర్
ఆర్ట్: రాజ్ కుమార్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామకృష్ణ తోట
నిర్మాత: ఏ యామిని కృష్ణ
రన్ టైమ్: 2 గంటల 10 నిముషాలు
రిలీజ్ డేట్: 01,అక్టోబర్ 2021
ఓటీటి: అమెజాన్ ప్రైమ్ సంస్థ