పవర్ ప్లే మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్
యంగ్ హీరో రాజ్ తరుణ్, కొండా విజయ్ కుమార్ల సక్సెస్ఫుల్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ `పవర్ ప్లే`. శ్రీమతి పద్మ సమర్పణలో వనమాలి క్రియేషన్స్ ప్రై.లి పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతోన్నఈ చిత్రాన్ని మహిదర్, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా మార్చి 5న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు.
ఈ మూవీని యూఎస్ఎ లో గ్రేట్ ఇండియా ఫిలింస్ రిలీజ్ చేస్తుండగా ఆస్ట్రేలియాలో సథరన్ స్టార్ ఇంటర్నేషనల్, మిడిల్ ఈస్ట్‌లో మను రిలీజ్ చేస్తున్నారు.
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ ట్రైడెంట్ హోటల్లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో పవర్‌ప్లే బిగ్ టికెట్‌ని తెలంగాణ టూరిజం ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ప్రముఖ నిర్మాతలు కె.ఎస్.రామారావు, కె.కె. రాధా మోహన్ సంయుక్తంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా..
క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ – “చిత్ర నిర్మాత మహిధర్ నాకు చాలా కాలంగా పరిచయం. మా సినిమాల్ని ఓవర్సీస్లో రిలీజ్ చేస్తుంటారు. ఈ సినిమాని దేవేష్ సాయంతో సియాటెల్ నుండే నిర్మించాడు. ముందుగా వారిద్దరికీ ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నాను. డెఫినెట్‌గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనంత్సాయి మా ఫ్యామిలీ మెంబర్. క్రియేటివ్ కమర్షియల్స్‌లో చాలా ముఖ్యమైన వ్యక్తి. అతను ఈ సినిమాకి ఇంత బడ్జెట్ అవుతుంది అని చెప్పినప్పుడు జాగ్రత్తగా చేయి అని చెప్పాను. అదే బడ్జెట్లోనే సినిమా కంప్లీట్ చేశాం అని రీసెంట్గా చెప్పాడు. చాలా ఆశ్చర్యమేసింది. దానికి కారణం మహిధర్, కొండా విజయ్ కుమార్‌గారు, సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ మిగతా నటీనటులు అందరు. కార్పోరేట్ సిస్టమ్‌లో సినిమా ఎలా చేయాలో మొదటిసారి ఈ సినిమాతోనే నేర్చుకున్నాను. ట్రైలర్ చూశాక కొండా విజయ్‌కుమార్ ఆలోచనలు మారిపోయాయి అనిపించింది. ఎందుకంటే రాజ్‌తరుణ్ తో ఫస్ట్ టైమ్ ఇలాంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చేయడం నిజంగా గొప్ప విషయం. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటూ టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను“ అన్నారు.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె రాధామోహన్ మాట్లాడుతూ – “ఈ టీమ్‌తో మా బేనర్లో ఒరేయ్ బుజ్జిగా.. మూవీ చేశాను. ఈ సినిమా చూస్తుంటే నాకు హోమ్ ప్రొడక్షన్ అనిపిస్తోంది. ఈ మూవీ ఒక మంచి టీమ్ వర్క్. ప్రొడ్యూసర్‌కి షార్టెస్ట్ టైమ్‌లో సినిమా తీయాలి అంటే డైరెక్టర్, డిఓపికి మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. అందుకే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. ప్రోమోస్, ట్రైలర్ చూస్తుంటే రాజ్ కొంత రఫ్ అయ్యా డని పిస్తోంది ఈ సినిమా మహిధర్, దేవేష్‌కి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. వారు ఇలాంటి మరిన్ని సినిమాలు తీయాలి. నేను పూర్ణగారికి పెద్ద ఫ్యాన్‌ని. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్“ అన్నారు
తాండూరు ఎమ్ఎల్ఏ పైలేట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ – “ముందుగా నా స్నేహితులు మహిధర్, దేవేష్‌కి ఆల్ ది బెస్ట్. ట్రైలర్ చాలా బాగుంది. తప్పకుండా బంపర్‌హిట్ కాబోతుందని తెలుస్తోంది. 5మార్చి తర్వాత మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి మాట్లాడుతూ – “విజయ్ గారు, రాజ్ కలిసి ఒరేయ్ బుజ్జిగా.. లాంటి మంచి ఎంటర్టైనర్ తర్వాత వెంటనే ఒక డిఫరెంట్ జోనర్లో మరో మూవీ చేశారు. ట్రైలర్ చాలా బాగుంది. విజయ్, రాజ్ చేంజోవర్ కూడా చాలా బాగుంది. ప్రొడ్యూసర్స్‌కి మంచి లాంచింగ్ అవ్వాలని కోరుకుంటున్నాను“ అన్నాయి.
మధునందన్ మాట్లాడుతూ – “ విజయ్‌గారు, రాజ్‌గారి ఎంటర్టైన్మెంట్ జోనర్‌ని బ్రేక్ చేసి ఇలాంటి ఒక డిఫరెంట్ చిత్రాన్ని నిర్మించిన మహిధర్ గారికి, దేవేష్ గారికి థాంక్స్. ఈ లాక్ డౌన్లో జరిగిని బెస్ట్ థింగ్ ఈ సినిమా“ అన్నారు.
ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయి మాట్లాడుతూ – “ నిర్మాతలు నా క్లోజ్ ఫ్రెండ్స్. ఈ మూవీ నేను ఎడిట్ రూమ్‌లో డైరెక్టర్‌గారితో కలిసి చూశాను. చాలా బాగా వచ్చింది. ఆండ్రూ వండర్ఫుల్ కెమెరామెన్. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్“ అన్నారు.
దర్శకుడు సంతోష్ మాట్లాడుతూ – “ రాజ్ అన్ని సినిమాలు చేసిన చాలా కామ్‌గా ఉంటాడు. ఆలాగే విజయ్ చాలా కూల్ డైరెక్టర్. వారిద్దరి కాంబినేషన్లో వస్తోన్న పవర్‌ప్లే బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
రచయిత నంధ్యాల రవి మాట్లాడుతూ – “ ఈ సారి కామెడీ కాకుండా డిఫరెంట్ జోనర్లో సినిమా చేద్దాం అని రాజ్ తరుణ్ చెప్పగానే నేను,విజయ్ గారు కలిసి ఈ కథ రెడీ చేయడం జరిగింది. ఈ సినిమాకి అన్ని చాలా బాగా కుదిరాయి. అందరం కలిసి ఒక మంచి సినిమా చేశాం. ఇది ఆర్టిస్టులు సినిమా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్“ అన్నారు.
హీరోయిన్ హేమల్ మాట్లాడుతూ – “రాజ్, విజయ్ గారి సూపర్‌హిట్ కాంబినేషన్లో వస్తోన్న ఈ మూవీలో భాగం అవడం చాలా హ్యాపీగా ఉంది. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి థ్యాంక్స్. ఈ సినిమా మేకింగ్ ఒక జాయ్ రైడ్ అని చెప్పొచ్చు“ అన్నారు.
హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ – “ ఒక వండర్ఫుల్ టీమ్. ఇలాంటి ఒక క్యారెక్టర్ ని నేను ఇంతవరకూ చేయలేదు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన విజయ్‌గారికి, నిర్మాతలకి థ్యాంక్యూ వెరీ మచ్. దేవేష్గారు నా బెస్ట్ ఫ్రెండ్. రాజ్ చాలా మంచి యాక్టర్. విజయ్‌గారి లాంటి స్వీట్ డైరెక్టర్ని నేను ఇంత వరకూ చూడలేదు. ఒక డైరెక్టర్ ఇంత కామ్‌గా వర్క్ చేయడం నేనింతవరకూ చూడలేదు“ అన్నారు.
సినిమాటోగ్రాఫర్ ఐ. ఆండ్రూ మాట్లాడుతూ – ` నాలుగు లవ్‌స్టోరీస్ తర్వాత ఒక డిఫరెంట్ మూవీ చేశాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్“ అన్నారు.
ప్రిన్స్ మాట్లాడుతూ – “ చాలా మంచి బిజినెస్ జరిగిందని విన్నాను. ఒక వండర్ఫుల్ మూవీలో నన్ను పార్ట్ చేసింనందుకు థ్యాంక్యూ. దేవేష్ అందరినీ చాలా బాగా చూసుకున్నాడు. మహిధర్ ఇక్కడ లేకున్నా అన్ని చూసుకున్నాడు. విజయ్‌గారు యాక్టర్స్ డైరెక్టర్. ప్రతి ఒక్కరి నుండి బెస్ట్ ఔట్పుట్ రాబట్టుకుంటారు. ఈ టీమ్‌తో మళ్లీ కలిసి వర్క్ చేయాలి అనుకుంటున్నాను“ అన్నారు.
చిత్ర నిర్మాత దేవేష్ మాట్లాడుతూ – “ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ మూవీ చూసి విజయ్‌గారు నాకు ఫోన్ చేసి సినిమా చాలా బాగా వచ్చింది అని చెప్పారు. ఇది ఇంతటితో అయిపోలేదు సక్సెస్‌మీట్‌లో మళ్లీ కలుద్దాం“ అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పాలమర్తి అనంత్ సాయి మాట్లాడుతూ – “లాక్డౌన్ ఎండ్ అయిన రెండు రోజుల్లో విజయ్ గారిని కలిసి సర్ సినిమా చేద్దామా అని అడగగానే వెంటనే డెఫినెట్ గా చేద్దాం అని షూటింగ్ స్టార్ట్ చేశారు. రాజ్ తరుణ్ గారు ఫుల్ సపోర్ట్ చేశారు. మార్చి 5న మిమ్మల్ని కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాం“ అన్నారు.
తెలంగాణ టూరిజం ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ – “ రాజ్‌తరుణ్ నటించిన ఉయ్యాల జంపాల సినిమా చూసి అతనికి మంచి భవిష్యత్ ఉంటుంది అనుకున్నాను. పూర్ణగారు మంచి నటి. మార్చి 5న విడుదలవుతున్న పవర్‌ప్లే సినిమా సక్సెస్‌ఫుల్‌గా 100రోజులు ఆడాలని కోరుకుంటూ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్“ అన్నారు.
చిత్ర దర్శకుడు విజయ్ కుమార్ కొండా మాట్లాడుతూ – “మహిధర్గారు, దేవేష్గారు అనంత్‌గారి ద్వారా ఈ సినిమా చేద్దాం అని అప్రోచ్ అయినప్పుడు వనమాలి క్రియేషన్స్ ఫస్ట్ స్టెప్ వారు కంటిన్యూగా సినిమాలు చేయాలి అని మా టీమ్ అందరం ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం. నిర్మాతలు కొత్త వారైనా పూర్తి సహాకారం అందించారు. రాజ్ ఇప్పటివరకూ కామెడీ, లవ్‌స్టోరీ సినిమాలే చేశాడు. ఈ లాక్డౌన్లో అందరూ వరల్డ్ సినిమాలు చూశారు. కాబట్టి కొత్తగా సినిమా చేసి మమ్మల్ని మేము కొత్తగా ఆవిష్కరించుకోవాలి అని ఈ సినిమా చేయడం జరిగింది. రాజ్, నేను ఇంతవరకూ చేయని ఒక కొత్త జోనర్. నేను నంధ్యాల రవి, రాజ్ కలిసి ఈ సినిమా అనుకున్నప్పుడు ఆడియన్స్ ఈ సినిమాకి ఎందుకు రావాలి అని అనుకున్నాం. ఇది ఒక మ్యూజికల్ సినిమా. కెమెరా పరంగా మేకింగ్ స్టైలిష్‌గా ఉండే సినిమా. ఇప్పటి వరకూ కామెడీ చేసిన నటుల్ని కొత్తగా ఆవిష్కరించే సినిమా. అలాగే ప్లాన్ చేశాం. ఫస్ట్ టైమ్ రాజ్‌లో ఇంకో యాంగిల్ చూస్తారు. హేమల్ చాలా బాగా నటించింది. ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రలో పూర్ణ నటించింది. ఇప్పటి వరకూ మీరు చూడని పూర్ణగారిని చూస్తారు. ప్రిన్స్ ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ చేశారు. ఆండ్రూ గారు తన సినిమాలకి విభిన్నంగా ఈ సినిమా చేశారు. ఎడిటర్ ప్రవీణ్ పూడి కథను మాత్రమే ఫాలో అవుతారు. సురేష్ బొబ్బిలిగారు అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. రియల్ సతీష్ నేచురల్‌గా ఫైట్స్ కంపోజ్ చేయడం జరిగింది. సినిమా చూశాను కాబట్టి కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను. సినిమా సూపర్‌డూపర్ హిట్. మార్చి 5న థియేటర్లలో కలుద్దాం“ అన్నారు.
యంగ్ హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ – ` `హేమల్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోస్టార్. పూర్ణగారు ఆ పాత్ర చేయడం వలన సినిమా వేరే లెవల్‌కి వెళ్లింది. ఈ సినిమాలో భాగం అయిన ప్రతి ఒక్కరినీ ధన్యవాదాలు. విజయ్‌గారు, నంద్యాల రవిగారు, మధునందన్ కలిసి అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశారు. సురేష్ బొబ్బిలి మంచి సంగీతంలో పాటు అదిరిపోయే ఆర్ ఆర్ ఇచ్చారు. దేవేష్ గారు మంచి ఫ్రెండ్ అయ్యారు. ఈ అవకాశం ఇచ్చిన విజయ్‌గారికి స్పెషల్ థ్యాంక్స్. ఆయన కేవలం దర్శకుడే కాదు నా ఫ్యామిలీ మెంబర్.పవర్‌ప్లే సినిమా మార్చి 5న విడుదల కాబోతుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. దయచేసి థియేటర్లోనే సినిమా చూడండి“ అన్నారు.
రాజ్ తరుణ్, హేమల్ ఇంగ్లే, పూర్ణ, మధు నందన్, అజయ్, కోటా శ్రీనివాసరావు, రాజా రవీంద్ర, ధన్‌రాజ్, కేదరి శంకర్, టిల్లు వేణు, భూపాల్, అప్పాజీ, రవివర్మ, సంధ్య జనక్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి
కథ-మాటలు: నంధ్యాల రవి,
సినిమాటోగ్రఫి: ఐ. ఆండ్రూ,
సంగీతం: సురేష్ బొబ్బిలి,
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి,
ఆర్ట్: శివ,
ఫైట్స్: `రియల్` సతీష్,
ప్రొడక్షన్ కంట్రోలర్: బి.వి సుబ్బారావు,
కో- డైరెక్టర్: వేణు కురపాటి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పాలపర్తి అనంత్ సాయి,
సమర్పణ: శ్రీమతి పద్మ,
నిర్మాతలు: మహిదర్, దేవేష్,
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా.