పాప్ కార్న్ మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
ఉయ్యాలా జంపాల సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ అవికాగోర్. ఆ సినిమాతో సక్సెస్ అందుకున్న అవికా తరువాత వరుసగా అవకాశాలు అందుకుంటూ వచ్చింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన అవికాగోర్ ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. అయితే ఆ తర్వాత ఆమె కెరీర్ స్లో అయ్యింది. అలాగే స్టార్ హీరోలకి జోడీగా ఆఫర్స్ రాలేదు. ఈ క్రమంలో తనను తాను నెలబెట్టుకుంటూ నిర్మాతగా చేసిన చిత్రం ఈ రోజు రిలీజైంది. ఈ సినిమా ఎలా ఉంది. ఆమెకు పూర్వ వైభవం తెచ్చిపెడుతుందా, కథ ఏంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్ :
సమీరణ(అవికాగోర్) కు పెద్ద సింగర్ అవ్వాలనేదే జీవితాశయం. కానీ అమెకున్న అస్తమాతో ఎంత ప్రయత్నించినా పాడలేక లక్ష్యానికి దూరమైపోతుంది ఆడిషన్స్ లో ఫెయిల్ అవుతుంది. ఆ డిప్రెషన్ నుంచి బయిటపడటానికి ఆమె ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ ప్లాన్ చేస్తుంది ఆ క్రమంలో షాపింగ్ కి వెళ్తుంది అక్కడ తగులుతాడు పవన్ (రోనిక్) మ్యూజిక్ ని ఇష్టపడే పవన్ గిటార్ వాయిస్తుంటాడు. అతని తాత పెద్ద మ్యూజీషియన్ తెల్లారితే బర్త్ డే ఆయనకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు షాపింగ్ చేయడానికి మాల్‌కి వస్తాడు. ఇక్కడే సమీరణ, పవన్ కలుస్తారు మొదట ఇద్దరికి గొడవ అవుతుంది సమీకరణకు బుద్ది చెప్పాలని ఆమెని ఫాలో అవుతుంటాడు పవన్ ఈ క్రమంలో ఇద్దరు కలిసి మాల్ లో లిఫ్ట్ ఎక్కుతారు. టెక్నికల్ ప్లాబ్లంతో ఎంత ప్రయత్నించినా లిఫ్ట్ ఓపెన్ కాదు మాల్ నిర్వహకులు దాన్ని పట్టించుకోరు రాత్రి అయినా లిఫ్ట్ ఓపెన్ కాదు. ఈ లోగా లిఫ్ట్ లో చెలరేగిన మంటల కారణంగా పొగ మొదలవుతుంది. పొగపడని అస్తమా పేషెంట్ అయిన సమీరణ దాన్ని ఎలా ఫేస్ చేసింది, రోజంతా ఈ ఇద్దరు ఆ లిఫ్ట్ లో ఏం చేశారు? ఈ క్రమంలో బద్ద శత్రువులుగా ఉన్న వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? లిఫ్ట్ నుంచి ఎలా బయటపడ్డారు, అనేది మిగిలిన కథ.
ఎలా ఉంది?
అనుకోకుండా కలిసిన ఇద్దరు మొదట తగువు పడటం ఆ తర్వాత తప్పని పరిస్దితుల్లో కలిసి జర్నీ చేయాల్సి రావటంఒకరినొకరు అర్దం చేసుకోవటంచివరకు ఒకటి అవటం అనేది అనాదిగా ఎన్నో రొమాంటిక్ కామెడీ సినిమాల్లో వస్తున్న కామన్ పాయింటే అయితే అది ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. అందుకే డైరక్టర్స్ ప్రయత్నం చేస్తూంటారు కాకపోతే ఇలాంటి కథల్లో ఎంత గొప్ప గొప్పగా వాళ్లిద్దరి మధ్యా కెమిస్ట్రీ ఏర్పాటు చేసామన్నది కీలకమైన విషయం. ఆ విషయంలో స్క్రీన్ ప్లే ని జాగ్రత్తలు తీసుకుంటే డైరక్టర్ ఒడ్డున పడిపోతాడు అయితే ఇక్కడ డైరక్టర్ కేవలం ఓ లిప్ట్ లో వీళ్లిద్దరి మధ్యన కథ చెప్పాలని ఫిక్స్ అవ్వటం తప్ప కొత్తగా ఏమీ కనపడదు ఎక్కడా ఎమోషన్ కానీ, కామెడీ కానీ , కథలో కావాల్సిన ట్విస్ట్ లు కానీ ఏమి ఉండవు ఎంతసేపు ఈ పెయిర్ ని ఒకే లిప్ట్ లో చూడాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది బడ్జెట్ పరంగా సినిమా కు అది ప్లస్ కావచ్చు ఏమో కానీ ప్రేక్షకుడు పాయింటాఫ్ వ్యూలో సినిమా పరంగా వర్కవుట్ అయ్యే విషయం అయితే కాదు. చిన్న గొడవ తో లిఫ్ట్ లో ఇరుక్కున్న ఈ జంట ఆ కోపం నుంచి నెమ్మదిగా బయటపడి, ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని, ఆ తర్వాత వారి రుచులు అభిరుచులు, డ్రీమ్స్ తెలుసుకుని, వాటిని లిఫ్ట్ లోనే ఫుల్‌ఫిల్ చేసుకుని, చివరికి ఓ ఉత్కంఠభరిత, డ్రమటిక్ ఈవెంట్స్ మధ్య, అపాయ స్థితి నుంచి బయటపడటమే ఈ సినిమా. ఇలాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే, డైలాగులు ఓ మ్యాజిక్ లా జరగాలి. ఆ విషయంలో డైరక్టర్ జాగ్రత్తలు తీసుకోలేదు. ఓ చోట కథ ఆగిపోయి.కదలనని మెరాయించినట్లు అనిపిస్తుంది.ఈ సినిమాలో అన్నిటికన్నా పెద్ద ట్విస్ట్ ఏమిటంటే లిఫ్ట్ బయట ఏం జరుగుతుందో చెప్పే ఒక్క సీన్ కూడా లేకపోవడం.
టెక్నికల్ గా :
దర్శకుడు మురళీగంధం తొలి చిత్రమైనా ఆ స్దాయి కష్టం కనపడదు జస్ట్ ఓకే అన్నట్లు ప్రొసీడింగ్స్ సాగుతూంటాయి ఇక్కడ ఏకైన టాలెంట్ కెమెరామెన్ ది ఒకే లిఫ్ట్ లో సీన్ కంటిన్యూటిని కొనసాగిస్తూ షూట్ చేయడం గొప్ప విషయమే అలాగే శ్రవణ్ భరద్వాజ్ పాటలు జస్ట్ ఓకే. ఆర్‌ఆర్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏమీ బాగోలేదు ఇక ఎడిటర్ కె ఎస్ ఆర్ చేయటానికి ఏమీ లేదు సినిమాలో ఒకటి రెండు బయట జరిగే సీన్లు తప్ప మిగిలినదంతా లిఫ్ట్ లోనే కావడంతో బడ్జెట్ సమస్యలేదు అందుకేనేమో అవికా గోర్ తాను నిర్మాతగా మారిచేసింది కాన్సెప్ట్ బాగానే అనిపించినా, లాజిక్ లేని కొన్ని సీన్స్ , విసుగు పుట్టించే డైలాగులు & సిల్లీ ప్రొసీడింగ్‌ల సినిమాను డల్‌గా మార్చింది అయినా లిఫ్ట్‌లో ఇరుక్కున్న చోట ఎవరు పాటలు పాడుతూ పుట్టినరోజు జరుపుకుంటారో అర్థం కావడం లేదు.
నటీనటుల్లో
ఈ సినిమాలో చెప్పుకోదగ్గ నటన ఎవరిదీ అంటే అవికా గోర్ ది మాత్రమే చాలా డీసెంట్ గా చేసింది. అలాగే ఆమె సూపర్ క్యూట్ గా, బరువు తగ్గి టోనెడ్ బాడీతో కనిపించింది. సాయి రోనాక్ నటుడిగా రాణించలేకపోయాడు. చూడటానికి బాగున్నా యాక్టింగ్ స్కిల్స్ సున్నా. బాడీ లాంగ్వేజ్ లోనూ, డైలాగు డెలవరీలోనూ అతను మెచ్యూరిటీ లేదు.మిగతా వాళ్లు సోసో.
బాగున్నవి?
అవికా గోర్ లుక్
కెమెరా వర్క్
బాగోలేనివి?
లాజిక్ లేని సీన్స్
అర్దం పర్దం లేకుండా వచ్చే సాంగ్స్
ఎమోషన్ కంటెంట్ లేకపోవటం
బ్యాక్ గ్రౌండ్ స్క్రోర్
విసుగెత్తించే డైలాగులు
చూడచ్చా :
ఓ లిఫ్ట్ లో ఇరుక్కు పోయిన ఫీలింగ్ ఇచ్చే ఈ చిత్రం అవికాగోర్ పై ఆరాధనా భావం ఉంటే తప్పించి తట్టుకోవటం కష్టం
మూవీ డీటెయిల్స్ :
బ్యానర్స్: ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ ,
నటీనటులు: అవికా గోర్, సాయి రోనక్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్.బాల్ రెడ్డి,
మ్యూజిక్: శ్రవణ్ భరద్వాజ్,
ఎడిటర్: కె.ఎస్.ఆర్,
సమర్పణ: ఎం.ఎస్.చలపతి రాజు,
కాన్సెప్ట్ – స్టోరి – డైలాగ్స్ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: మురళి గంధం,
నిర్మాత: భోగేంద్ర గుప్తా,
రన్ టైమ్ : 105 నిమిషాలు
విడుదల తేదీ. 10 ఫిబ్రవరి 2023