Reading Time: 2 mins

పార్ట్‌నర్ మూవీ ట్రైలర్ విడుదల

డైరెక్టర్ మారుతి లాంచ్ చేసిన ఆది పినిశెట్టి, హన్సిక మోత్వాని పార్ట్‌నర్ థియేట్రికల్ ట్రైలర్

ఆది పినిశెట్టి, హన్సిక మోత్వాని లీడ్ రోల్స్ లో మనోజ్ ధమోధరన్ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ కామెడీ & కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పార్ట్‌నర్. రాయల్ ఫార్చున్ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని బి.జి.గోవింద్ రాజు సమర్పణలో ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఎంఎస్ మురళీధర్ రెడ్డి తెలుగులో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పార్ట్‌నర్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

పార్ట్‌నర్ థియేట్రికల్ ట్రైలర్‌ను దర్శకుడు మారుతి లాంచ్ చేశారు. సైంటిఫిక్ ఫాంటసీ ఎలిమెంట్స్ తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా ట్రైలర్ నవ్వులు పంచింది. ఆది పినిశెట్టి, యోగిబాబు క్లోజ్ ఫ్రండ్స్. డబ్బు అవసరం వుండటంతో యోగి బాబుతో కలిసి రాబరీ పనికి అంగీకరిస్తాడు ఆది. కానీ ఊహించని సంఘటన కారణంగా యోగి బాబు, హన్సిక గా మారిపోతాడు. తర్వాత ఏం జరుగుతుందనేది రోలర్ కోస్టర్ ఫన్ రైడ్ గా చూపించారు.

ఆది పినిశెట్టి, యోగి బాబు కలిసి చక్కని నవ్వులు పూయించారు. హన్సిక ఎంట్రీ తర్వాత వినోదం రెట్టింపు అయ్యింది. ఈ కాంబినేషన్ థియేటర్లలో హిలేరియస్ వినోదాన్ని అందించబోతోంది. పల్లక్ లల్వానీ ఆది ప్రియురాలుగా కనిపించింది. పార్ట్‌నర్ కాన్సప్ట్ చాలా యూనిక్ గా హిలేరియస్ గా వుంది.

ఈ చిత్రంలో జాన్ విజయ్, పాండిరాజన్, రోబో శంకర్ ఇతర ముఖ్య పాత్రలలో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ ధయానిధి సంగీతం అందిస్తుండగా, షబీర్ అహమ్మద్ సినిమాటోగ్రఫర్. ప్రదీప్ రాఘవ్ ఎడిటర్.

నిర్మాతలు ముందుగా అనౌన్స్ చేసినట్లుగా ఆగష్టు 25న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేయనున్నారు.

తారాగణం :

ఆది పినిసెట్టి, హన్సిక మోత్వాని, యోగి బాబు, పల్లక్ లాల్వానీ, పాండిరాజన్, రోబో శంకర్ , జాన్ విజయ్, రవి మరియ, టైగర్ తంగదురై

టెక్నికల్ టీమ్ :

దర్శకత్వం : మనోజ్ ధమోధరన్
ప్రొడక్షన్ హౌస్ : రాయల్ ఫార్చున్ క్రియేషన్స్
సమర్పణ: బి.జి.గోవింద్ రాజు
తెలుగు విడుదల: ఎంఎస్ మురళీధర్ రెడ్డి, ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: సంతోష్ ధయానిధి
సినిమాటోగ్రఫీ: షబీర్ అహమ్మద్
ఎడిటర్ : ప్రదీప్ E రాఘవ్