పూరీ జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇస్మార్ట్ శంకర్
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్ లో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ వస్తుంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. దీనికి ఇస్మార్ట్ శంకర్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. రామ్ ఇస్మార్ట్ శంకర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. రామ్ ఇందులో తలకిందులుగా సిగరెట్ తాగుతూ అద్భుతంగా ఉన్నాడు. ఈ చిత్రం కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు రామ్.
జనవరిలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. వీలైనంత త్వరలో సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్ర్యూ వివరాలు తెలపనున్నారు దర్శక నిర్మాతలు. ఇస్మార్ట్ శంకర్ సినిమాను పూరీ కనెక్ట్స్ సహకారంతో పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
నటీనటులు:రామ్ పోతినేని
దర్శకుడు: పూరీ జగన్నాథ్
నిర్మాతలు: పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్సంస్థలు, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్