ప్రవీణ్ ఐపీఎస్ మూవీ గ్లిమ్స్ విడుదల
ఐరా ఇన్ఫోటైన్మెంట్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నీల మామిడాల నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం ప్రవీణ్ ఐపిఎస్, షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది.
నందకిషోర్, రోజా హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా దుర్గా దేవ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
మాజీ ఐపిఎస్ అధికారి, ప్రస్తుత బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ గారి బయోపిక్ గా ప్రవీణ్ ఐపిఎస్ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత వివేక్ కూచిబొట్ల గారు విడుదల చేశారు. తాజాగా ఈ చిత్ర గ్లిమ్స్ ను ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ ఐపిఎస్ చిత్ర యూనిట్ సభ్యులతో పాటు నిర్మాత దామోదర్ ప్రసాద్, దర్శకుడు రమణ తేజ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ లక్ష్మీ బాయి పాల్గొన్నారు.
నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ
ప్రవీణ్ ఐపీఎస్ సినిమా ఒక మంచి కథ కథనంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూ వస్తున్నారు. అదే విధంగా ప్రవీణ్ ఐపిఎస్ సినిమా సక్సెస్ సాధించి అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్న అన్నారు.
అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ లక్ష్మీ బాయి మాట్లాడుతూ
ప్రవీణ్ ఐపిఎస్ సినిమా గ్లిమ్స్ ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. మోషన్ పోస్టర్ , టైటిల్ అన్ని బాగున్నాయి. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బయోపిక్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమా అందరికి కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను, చిత్ర యూనిట్ అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.
నవంబర్ లో సినిమాను రిలీజ్ చెయ్యడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
నటీనటులు:
నంద కిషోర్, రోజా, దుర్గా దేవ్ నాయుడు, వన్య అగర్వాల్, సతీష్ సరిపల్లి, జ్యోతి తదితరులు
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: ఐరా ఇన్ఫోటైన్మెంట్ ప్రవేట్ లిమిటెడ్
నిర్మాత: నీలా మామిడాల
డైరెక్టర్: దుర్గా దేవ్ నాయుడు
మ్యూజిక్: ఎన్. ఎస్. ప్రసు
కెమెరామెన్: నాగ్ సోధనపల్లి
ఎడిటర్: ఆర్.ఎం. విశ్వనాధ్ కుచనపల్లి