Reading Time: 2 mins

ప్రేమ కథా చిత్రం 2 మెద‌టి లుక్ విడుద‌ల‌

విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్బంగా  ఆర్ పి ఏ క్రియేషన్స్ బ్యానర్లో సుమంత్ అశ్విన్ , నందిత శ్వేత ల‌ “ప్రేమ కథా చిత్రం 2 మెద‌టి లుక్ విడుద‌ల‌

ప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్ ని క్రియెట్ చేసి, జక్కన్న తో కమ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ ని సాదించిన ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం-3 గా తెర‌కెక్కుతున్న చిత్రం ప్రేమ‌క‌థాచిత్ర‌మ్2 . ఈచిత్రంతో హ‌రి కిషన్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్‌, సిధ్ధి ఇద్నాని జంట‌గా న‌టిస్తున్నారు. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రంలో త‌న పెర్‌ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్న నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా న‌టిస్తుంది.  ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా తెర‌కెక్కుతున్న‌ “ప్రేమ కథా చిత్రం 2” సినిమా మెద‌టిలుక్ ని విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్బంగా విడుద‌ల చేశాము.  ‘బ్యాక్ టూ ఫియర్ అనే  క్యాప్షన్ తో ఇప్ప‌టికే 90% షూటింగ్ పూర్తిచేసుకుని మ‌రో రెండు పాట‌లు, క్లైమాక్స్ మిన‌హ షూటింగ్ పార్ట్ ని పూర్తిచేసుకంది. అన్నికార్య‌క్ర‌మాలు పూర్తిచేసి న‌వంబ‌ర్ చివ‌రి వారంలో విడుద‌ల‌కి స‌న్నాహ‌లు చేస్తున్నారు..

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ… ఆర్ పి ఏ క్రెయేషన్స్ బ్యానర్లో వచ్చిన ప్రేమ కథా చిత్రం, జక్కన్న సూపర్ హిట్స్ గా మా సంస్థ కు మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రేమ కథా చిత్రం హిలేరియస్ కామెడీ తో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా ప్రేమ కథా చిత్రం 2 ప్రారంభించాం. సుమంత్ ఆశ్విన్ , సిధ్ధి ఇద్నాని లు జంట‌గా నటిస్తున్నారు. ఎక్క‌డికి పొతావు చిన్న‌వాడా చిత్రంతో క్రేజి హీరోయిన్ గా మారిన నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా న‌టిస్తుంది. హ‌రి కిషన్ ను దర్శకుడు గా పరిచయం అవుతున్నాడు. లవ్ అండ్ హ‌ర్ర‌ర్ కామెడి ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే కథ ఇది. మా బ్యానర్ కి మరొక సూపర్ హిట్ చిత్రం గా నిలుస్తుందని నమ్ముతున్నాం.

విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా మెద‌టి లుక్ ని విడుద‌ల చేసాం.. ఈ నెల 22 నుండి బ్యాల‌న్స్ రెండు సాంగ్స్‌, క్లైమాక్స్ ని షూట్ చేసి, న‌వంబ‌ర్ నెలాఖ‌రుకి విడ‌దుల స‌న్నాహ‌లు చేస్తున్నాం.

న‌టీన‌టులు.. సుమంత్ అశ్విన్‌, నందిత శ్వేత‌, సిధ్ధి ఇద్నాని, కృష్ణ తేజ‌, విధ్యులేఖ‌, ప్ర‌భాస్ శ్రీను, ఎన్‌.టి.వి.సాయి త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు :
కెమెరామెన్ – సి. రాం ప్రసాద్,
ఎడిటర్ – ఉద్ధవ్ య‌స్‌.బి
సంగీతం – జె.బి
డైలాగ్ రైటర్ – గ‌ణేష్‌
లిరిక్ రైట‌ర్‌- అనంత్ శ్రీరామ్,కాస‌ర్ల్య శ్యామ్‌, పూర్ణా చారి.
ఆర్ట్ – కృష్ణ‌
కో ప్రొడ్యూసర్స్ – ఆయుష్ రెడ్డి, ఆర్ పి అక్షిత్ రెడ్డి
నిర్మాత –  ఆర్. సుదర్శన్ రెడ్డి
దర్శకుడు – హరి కిషన్

Attachments area