Reading Time: 3 mins

ఫైట్ మాస్టర్ వెంకట్ ఇంటర్వ్యూ

భగవంత్ కేసరి లో బాలకృష్ణ గారి యాక్షన్ స్టైల్ సరికొత్తగా వుంటుంది. యాక్షన్ ని చాలా నేచురల్ గా డిజైన్ చేశాం: ఫైట్ మాస్టర్ వెంకట్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ భగవంత్ కేసరి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలు, ట్రైలర్ ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న నేపధ్యంలో ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన ఫైట్ మాస్టర్ వెంకట్ విలేకరుల సమావేశంలో భగవంత్ కేసరి విశేషాలని పంచుకున్నారు ?

బాలకృష్ణ గారి సినిమాలకి యాక్షన్ కంపోజ్ చేయడం మామూలు విషయం కాదు. భగవంత్ కేసరి యాక్షన్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు?
దర్శకుడు అనిల్ రావిపూడి గారు ఈ కథని రాయడం మొదలుపెట్టినప్పుడే బాలకృష్ణ గారిని కొత్తగా చూపించాలని అనుకున్నారు. నాకు చెప్పినప్పుడు కూడా ముందు సినిమాలకి దీనికి తేడా వుండాలని చెప్పారు. బాలకృష్ణ గారిని కొత్తగా చూపించాలని ఆయన మనసులో బలంగా వుంది. భగవంత్ కేసరి ఫస్ట్ హాఫ్ లో ఒక స్టైల్ యాక్షన్, సెకండ్ హాఫ్ లో మరో స్టైల్ యాక్షన్ వుంటుంది. బాలకృష్ణ గారి స్పీడ్ ని పట్టుకొని హాలీవుడ్ స్టైల్ లో చాలా నేచురల్ గా యాక్షన్ ని డిజైన్ చేయడం జరిగింది. అనిల్ రావిపూడి గారు ఈ నేచురల్ స్టైల్ ని బలంగా నమ్మారు. మేము కూడా దాన్ని అడాప్ట్ చేసుకొని బాలకృష్ణ గారితో ఈసారి కొత్త స్టైల్ ఆఫ్ యాక్షన్ ప్రయత్నించాం. ఇది ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుంది. యాక్షన్ సన్నివేశాల్లో బాలయ్య బాబు గారి కష్టం కనిపిస్తుంది. ఇందులో ఎక్కువ కట్స్ ని ప్లాన్ చేసుకోలేదు. స్లో మోషన్ షాట్స్ ని తగ్గించేశాం. 24 ఫ్రేమ్స్ లో ఆయన యాక్షన్ చేస్తే ఎలా వుంటుందో దాన్నే చేశాం.

బాలకృష్ణ గారి ప్రతి సినిమాలో ఒక ప్రత్యేక ఆయుధం వుంటుంది. ఇందులో ఉన్న ఆయుధం ఆలోచన ఎవరిది ?
డైరెక్టర్ అనిల్ గారిదే. కథ, పాత్ర రాసుకున్నపుడే ఆ వెపన్ గురించి వుంది. తను ఫ్యాక్టరీలో పని చేస్తారు. దీని కోసం చాలా అద్భుతమైన సెట్ చేశారు. అక్కడ ఉన్న వాటితోనే ఒక ఆయుధం తయారు చేస్తారు. ఆ ఎపిసోడ్ టెర్రిఫిక్ గా వచ్చింది. ఇందులో ఇంటర్వెల్ కి ముందు వచ్చే సీక్వెన్స్ నెక్స్ట్ లెవల్ లో వుంటుంది.

బాలకృష్ణ గారితో గతంలో కూడా సినిమాలు చేసిన అనుభవం దీనికి కలిసొచ్చిందా ?
ఖచ్చితంగా అండీ. బాలకృష్ణ గారితో పైసా వసూల్, వీరసింహారెడ్డి చిత్రాలు చేశాను. ఆయన బాడీ లాంగ్వేజ్ మీద పట్టు దొరికింది. ఆయనకి ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్ లు ఐతే బావుటుందో అవగాహన వచ్చింది. ఆయన వేగాన్ని అర్ధం చేసుకోగలిగాం. అవన్నీ భగవంత్ కేసరి కి ప్లస్ అయ్యాయి. భగవంత్ కేసరి యాక్షన్ లో ఎడిటింగ్ ప్యాట్రన్ కూడా కొత్తగా వుంటుంది. యాక్షన్ సీక్వెన్స్ లు క్రిస్ప్ గా ఉంటాయ్ అదే సమయంలో ఇంపాక్ట్ ఫుల్ గా వుంటాయి.

ఇంకెవరైనా యాక్టర్స్ తో ఇంటెన్స్ యాక్షన్ జరిగిందా ?
అర్జున్ రాంపాల్ గారితో ఇంటెన్స్ క్లైమాక్స్ సీక్వెన్స్ వుంటుంది. బాలకృష్ణ గారు, అర్జున్ రామ్ పాల్ మధ్య వచ్చే యాక్షన్ సీన్ ..టగ్ ఆఫ్ వార్ గా వుంటుంది. యాక్షన్ సీక్వెన్స్ లో బాలకృష్ణ గారిని బీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఇందులో మాత్రం మొదట అర్జున్ రాంపాల్ టేకోవర్ చేస్తారు. బాలకృష్ణ గారు ఫైటర్స్ ని కూడా నేరుగా కొట్టమనేవారు. ఈ టగ్ ఆఫ్ వార్ వలన ఫైట్ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అయ్యింది.

షైన్ స్క్రీన్స్ నిర్మాతల నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభించింది ?
హరీష్ గారు, సాహు గారు మాపైన పూర్తి నమ్మకం ఉంచారు. ఎక్కడా రాజీపడలేదు. ప్రతి యాక్షన్ కి సెట్ వేశాం. ఏడు అద్భుతమైన సెట్స్ వున్నాయి ఇందులో. దాదాపు ఎనిమిది యాక్షన్ సీక్వెన్స్ లు వుంటాయి. అన్నీ అద్భుతంగా వచ్చాయి. నిర్మాతలు కావాల్సింది సమకూర్చారు. సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మించారు.

స్టార్ హీరోస్ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నపుడు ఎలాంటి జాగ్తతలు తీసుకుంటారు ?
ఒక యాక్షన్ సీక్వెన్స్ అనుకున్నప్పుడు పాజిటివ్ నెగిటివ్ రెండూ ఆలోచిస్తాం. హీరో చేయవచ్చా లేదా అనేది ముందే చూస్తాం. అలాగే ప్రతి క్షణం పరిశీలిస్తుంటాం. ఒక రోప్ కట్టామంటే దాని లాడింగ్ ఎలా వుంటుందనేది ముందే మా కంట్రోల్ లో ఉండేలా చూస్తాం. కొబ్బరికాయ్ కొట్టినప్పటి నుంచి చివరి రోజు షూటింగ్ పూర్తయి జాగ్రత్తగా వెళ్ళినంత వరకూ మా కేరింగ్ వుంటుంది.

ఒక సినిమాలో ఎనిమిది ఫైట్ సీన్స్ వున్నప్పుడు.. ప్రతి సీన్ ని కొత్తగా చూపించడంలో ఎలాంటి కసరత్తులు చేస్తారు ?
నిజానికి చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం ఇది. బాలకృష్ణ గారు చేయని యాక్షన్స్ సీక్వెన్స్ అంటూ లేదు. ఆయన అన్ని మూమెంట్స్ చేశారు. మళ్ళీ వాటిని కొత్తగా ప్రజెంట్ చేయడం సవాల్ తో కూడుకున్న విషయం. దానిపై జాగ్రత్తలు తీసుకోని, ఆయన బాడీ లాంగ్వేజ్, కథ, సిట్యువేషన్, లొకేషన్ కి తగ్గట్టుగా సరికొత్తగా ప్రజెంట్ చేయడం జరిగింది.

ఈ ఎనిమిది ఫైట్స్ లో మీకు బెస్ట్ అనిపించిన ఫైట్ ఏది ?
నాకు అన్నీ బెస్ట్ గానే వుంటాయి. అయితే ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళకి ఒకొక్క బెస్ట్ వుంటుంది. ఆడియన్స్ ఏది బెస్ట్ అంటే అదే నా బెస్ట్ (నవ్వుతూ).

కొత్తగా చేస్తున్న చిత్రాలు ?
నా సామిరంగా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అలాగే గోపీచంద్ గారు హర్ష గారి సినిమా చేస్తున్నాను.

ఆల్ ది బెస్ట్
థాంక్స్