Reading Time: < 1 min

బాలమిత్ర చిత్రం ట్రైలర్ విడుదల

యాక్షన్ కింగ్ అర్జున్ చేతుల మీదుగా ‘బాలమిత్ర’ ట్రైలర్ విడుదల*
విఎస్, శ్రీ సాయి బాలాజీ ఫిల్మ్స్ బ్యానర్లపై శైలేష్ తివారి, బొద్దుల లక్ష్మణ్ నిర్మిస్తోన్న చిత్రం ‘బాలమిత్ర’. శైలేష్ తివారి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం నుంచి ఇటీవలే ‘వెళ్లిపోమాకే’ అనే వీడియో సాంగ్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. మధుర ఆడియో ద్వారా విడుదలైన ఈ సాంగ్ ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను యాక్షన్ కింగ్ అర్జున్ విడుదల చేశారు.

ట్రైలర్ విడుదల అనంతరం యాక్షన్ కింగ్ అర్జున్ మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. కరెంట్ ట్రెండ్‌కు అనుగుణంగా అంటే.. నేటి వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంది. సినిమా కోసం అందరూ చాలా కష్టపడినట్లుగా అర్థమవుతుంది. సినిమా టైటిల్ కూడా చక్కగా ఉంది. ఇటువంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలి. సినిమా మంచి విజయం సాధించి, నటీనటులకు అలాగే సాంకేతిక నిపుణులకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు.

దర్శకనిర్మాత శైలేష్ తివారి మాట్లాడుతూ.. ‘‘ముందుగా మా చిత్ర ట్రైలర్‌ని విడుదల చేయడమే కాకుండా.. మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించిన యాక్షన్ కింగ్, మనసున్న హీరో అర్జున్ గారికి ధన్యవాదాలు. రీసెంట్‌గా మా సినిమా నుంచి విడుదలైన ‘వెళ్లిపోమాకే’ వీడియో సాంగ్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. ఈ ట్రైలర్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆశిస్తున్నాము. సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో పాటు మంచి ఎమోషన్ నిండిన కథతో ప్రతి ఒక్కరినీ అలరించే విధంగా ‘బాలమిత్ర’ చిత్రం ఉంటుంది. కంటెంట్, టేకింగ్ పరంగా పెద్ద సినిమాలకు పోటాపోటీకి ఉంటుందని చెప్పగలను. ఈ సినిమా నిర్మాణంలో నాకు సహకరించిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాము..’’ అని తెలిపారు.

హీరో రంగ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా హీరోగా చేసే అవకాశం కల్పించిన మా దర్శకనిర్మాత శైలేష్ తివారి గారికి, ట్రైలర్ విడుదల చేసిన యాక్షన్ కింగ్ అర్జున్ గారికి ధన్యవాదాలు. సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతగానో కష్టపడ్డారు. అందరికీ ధన్యవాదాలు..’’ అని తెలిపారు.

రంగ, శశికళ, కియారెడ్డి, అనూష, దయానంద రెడ్డి, మీసాల లక్ష్మణ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి
సంగీతం: జయవర్ధన్,
సినిమాటోగ్రఫీ: రజిని,
ఎడిటర్: రవితేజ,
ఫైట్స్: వెంకట్ మాస్టర్,
కొరియోగ్రఫీ: విగ్నేష్ శుక్లా,
ఆర్ట్: భీమేష్,
నిర్మాతలు: శైలేష్ తివారి, బొద్దుల లక్ష్మణ్,
కథ, దర్శకత్వం: శైలేష్ తివారి.