Reading Time: < 1 min

బెదురులంక 2012 మూవీ ఆగస్టు 25 విడుదల

ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న బెదురులంక 2012

కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటించిన సినిమా బెదురులంక 2012. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ సమర్పకులు. క్లాక్స్ దర్శకుడు.ఇందులో కార్తికేయ సరసన డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటించారు.
ఇప్పటికే విడుదల అయిన ద వరల్డ్ ఆఫ్ బెదురులంక గ్లింప్స్, వెన్నెల్లో ఆడపిల్ల పాట మరియు ఇతర కంటెంట్ వల్ల ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
గోదావరి ఒడ్డున ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో చిత్రీకరించిన బెదురులంక 2012, అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ సందర్బంగా చిత్రనిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ఫుల్ స్వింగులో అన్ని వర్క్స్ జరుగుతున్నాయి. ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించే కొత్త తరహా డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. అని చెప్పారు.

దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో మా చిత్రానికి సంబంధించిన కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. కార్తికేయ, నేహా శెట్టి జోడీ మధ్య కెమిస్ట్రీ, ద వరల్డ్ ఆఫ్ బెదురులంక, మిగతా క్యారెక్టర్లు, పాటలు మరియు గోదావరి ఒడ్డున లొకేషన్లు అన్నీ మీకు చాలా నచ్చుతాయి. ఒక కొత్త తరహా చిత్రాన్ని చూసిన అనుభూతి తో పాటు సినిమా అంతటా నవ్వుతూనే ఉంటారు. అని చెప్పారు.

నటీనటులు :

కార్తికేయ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని

సాంకేతికవర్గం :

ఎడిటింగ్: విప్లవ్ న్యాసదం
సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి
సంగీతం: మణిశర్మ
సమర్పణ: సి. యువరాజ్
నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని
రచన – దర్శకత్వం: క్లాక్స్