Reading Time: < 1 min

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌వ‌చం డిసెంబ‌ర్ 7న విడుద‌ల‌

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్, కాజ‌ల్, మెహ్రీన్ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో వ‌స్తున్న‌ సినిమా క‌వ‌చం. ఈ చిత్రం డిసెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. టీజ‌ర్ 10 మిలియన్ డిజిటల్ వ్యూస్ అందుకుని.. అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ తో శ్రీ‌నివాస్ మామిళ్ళ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. కెరీర్‌లో తొలిసారి ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. హర్షవ‌ర్ధ‌న్ రానే, బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే క‌వ‌చం షూటింగ్ పూర్తైంది.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. ఛోటా కే నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. వంశ‌ధార క్రియేష‌న్స్ సంస్థ‌లో న‌వీన్ సొంటినేని(నాని) క‌వ‌చం సినిమాను నిర్మిస్తున్నారు.

న‌టీన‌టులు:
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా, నీల్ నితిన్ ముఖేష్, హ‌ర్షవ‌ర్ధ‌న్ రాణే, పోసాని కృష్ణ‌ముర‌ళి, స‌త్యం రాజేష్, అపూర్వ‌..

సంగీతం: ఎస్ఎస్ థ‌మ‌.న్ సినిమాటోగ్ర‌ఫర్: ఛోటా కే నాయుడు. ఎడిట‌ర్: ఛోటా కే ప్ర‌సాద్. ఆర్ట్ డైరెక్ట‌ర్: చిన్నా. ద‌ర్శ‌కుడు: శ్రీ‌నివాస్ మామిళ్ళ‌.నిర్మాత‌: న‌వీన్ చౌద‌రి సొంటినేని (నాని).నిర్మాణ సంస్థ‌: వ‌ంశ‌ధార క్రియేష‌న్స్.