Reading Time: 2 mins

బొమ్మల కొలువు చిత్రం మీడియా స‌మావేశం

ఏప్రిల్ 22న బొమ్మల కొలువు చిత్రం విడుద‌ల‌

‘రఘువరన్ బి.టెక్‌’లో  ధ‌నుష్ త‌మ్ముడిగా న‌టించిన రిషికేశ్ ఇప్పుడు ‘బొమ్మల కొలువు’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. రిషికేశ్‌, ప్రియాంక శ‌ర్మ‌, మాళ‌వికా స‌తీశ‌న్ హీరో హీరోయిన్లుగా సుబ్బు వేదుల ద‌ర్శ‌క‌త్వంలో పృథ్వీ క్రియేష‌న్స్‌, కిక్కాస్ స్టోరీ టెల్ల‌ర్ పతాకాల‌పై ఎ.వి.ఆర్‌.స్వామి నిర్మిస్తోన్న చిత్రం ‘బొమ్మ‌ల కొలువు’. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుద‌ల‌తేదీని తెలియ‌జేసేందుకు సోమ‌వారంనాడు రామానాయుడు స్టూడియోలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు.

ఈ సంద‌ర్భంగా ముఖ్య అతిథిగా హాజ‌రైన ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు బి.వి.ఎస్‌.ర‌వి మాట్లాడుతూ, ఈ సినిమా ఆల్‌రెడీ చూశాను. నాకు బాగా న‌చ్చింది. నిర్మాత స్వామిగారు మంచి సినిమా తీశారు. ద‌ర్శ‌కుడు ఇంత‌కుముందు రాహో సినిమా తీశాడు. చాలా కొత్త‌గా వుంది. ఇప్పుడు థ్రిల్ల‌ర్ బేస్ సినిమా తీశాడు. రిషికేశ్‌, మాళ‌విక చ‌క్క‌గా న‌టించారు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫ‌ర్ ఈశ్వ‌ర్ అద్భుతంగా తెర‌కెక్కించారు. ఆయ‌న‌తో నేను మ‌రో సినిమా చేయ‌బోతున్నా. చాలా రిచ్‌లుక్ చూపించాడు. సంగీత‌ప‌రంగా ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు మంచి ఆడియో ఇచ్చాడు. ఇందులో అమృత్ పాడిన పాట వైర‌ల్ అయింది. ఈ సినిమా స‌క్సెస్ అవుతుంద‌నే పూర్తి న‌మ్మ‌కం వుంది. ఏప్రిల్ 22 విడుద‌ల కాబోతుంది. ఆచార్య‌, కెజి.ఎఫ్‌. వంటి పెద్ద సినిమాల మ‌ధ్య‌లో ఈ సినిమా వ‌స్తుంది. వేస‌విలో చిన్న‌ సినిమాలు వ‌చ్చినా మ‌న ప్రేక్ష‌కులు చూస్తార‌నే న‌మ్మ‌క‌ముంది. థ్రిల్ల‌ర్ జోన‌ర్ అయినా అన్ని అంశాలు ఇందులో వున్నాయ‌ని తెలిపారు.

మాళ‌విక మాట్లాడుతూ, ఈరోజు విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌డం చాలా ఆనందంగా వుంది. ఈరోజు నా పుట్టిన‌రోజు కూడా. నా న‌ట‌న‌పై న‌మ్మ‌కంతో ద‌ర్శ‌కుడు సుబ్బుగారి అవ‌కాశం ఇచ్చారు. నిర్మాత‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

చిత్ర ద‌ర్శ‌కుడు సుబ్బు వేదుల మాట్లాడుతూ, నా ద‌ర్శ‌కుల టీమ్ మంచి స‌హ‌కారం అందించారు. ప్ర‌వీణ్ చ‌క్క‌టి బిజి.ఎం. ఇచ్చి సంగీతంతో సినిమా మ‌రో స్థాయిలో తీసుకెల్లేలా దోహ‌ద‌ప‌డ్డాడు. ఎడిట‌ర్ వ‌ర్మ ప‌నితీరు బాగుంది. నిర్మాత స్వామిగారు నాపై న‌మ్మ‌కంతో  రెండో సినిమా చేశారు. ఈ సినిమా అంద‌రికీ న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌క‌ముంద‌ని తెలిపారు.

నిర్మాత ఎ.వి.ఆర్‌.స్వామి  మాట్లాడుతూ, ద‌ర్శ‌కుడు సుబ్బు ఎక్సెలెంట్ మూవీ తీశారు. అన్ని అంశాలున్నాయి. థ్రిల్ల‌ర్‌లో చ‌క్క‌టి చిత్ర‌మ‌వుతుంది. ఈ సినిమాను అంద‌రూ చూసి ఎంక‌రేజ్ చేయండ‌ని అన్నారు.

సినిమాటోగాఫ్ర‌ర్‌ ఈశ్వ‌ర్ మాట్లాడుతూ, సుబ్బుగారితో ఇది రెండో సినిమా. ఇంత‌కుముందు రాహో సినిమా చేశాను. ఇక ఈ సినిమా కంప్లీట్ థ్రిల్ల‌ర్. క‌రోనా టైంలో దాన్ని బేస్ చేసుకుని తీసిన చిత్ర‌మిది. హీరోహీరోయిన్లు ఇద్ద‌రూ బాగా న‌టించారు. ఏప్రిల్ 22న సినిమా చూసి ఆనందించండి అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో న‌టుడు. శ్రీ‌నివాస్‌, అప‌ర్ణ తదిత‌రులు మాట్లాడుతూ చిత్రం విజ‌యంతం కావాల‌ని ఆకాంక్షించారు.

నటీన‌టులు:
రిషికేశ్‌, ప్రియాంక శ‌ర్మ‌, మాళ‌వికా స‌తీశ‌న్‌, సుబ్బు, శివ‌మ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  సుబ్బు వేదుల‌
నిర్మాత‌:  ఎ.వి.ఆర్‌.స్వామి
బ్యాన‌ర్స్‌:  పృథ్వీ క్రియేష‌న్స్‌, కిక్కాస్ స్టోరీ టెల్ల‌ర్
సినిమాటోగ్ర‌ఫీ:  ఈశ్వ‌ర్‌
మ్యూజిక్‌:  ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు
ఎడిట‌ర్‌:  ఎం.ఆర్‌.వ‌ర్మ‌
పాట‌లు:  శ్రీనివాస మౌళి