భగవంత్ కేసరి మూవీ అర్జున్ రాంపాల్ పోర్షన్ పూర్తి
నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి, భగవంత్ కేసరి – అర్జున్ రాంపాల్ పోర్షన్ పూర్తి
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్ట్ భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం దసరాకు థియేటర్లలో ప్రేక్షకులను అలరించేలా షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ తన పోర్షన్ ని పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రంలో అతని పాత్ర పేరు రాహుల్ సంఘ్వి అని తెలియజేశారు. మేకర్స్ షేర్ చేసిన పోస్టర్లలో అర్జున్ రాంపాల్, బాలకృష్ణ, అనిల్ రావిపూడి ఉన్నారు. దసరాకి సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నందున, అక్టోబర్ 19 నుంచి బిగ్ స్క్రీన్లపై అతని ఫెరోషియస్ అవతార్ అలరించబోతుంది.
భగవంత్ కేసరి యునిక్ కాన్సెప్ట్ తో హై యాక్షన్ గా వుంటుంది. బాలకృష్ణ మునుపెన్నడూ చూడని క్యారెక్టర్లో అనిల్ రావిపూడి ప్రజంట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ పవర్ ఫుల్ ప్రజన్స్, తెలంగాణ యాసలో డైలాగ్‌లని చెప్పడం ఎంతగానో అలరించింది.
ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది.
ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్ పార్ట్‌కి వి వెంకట్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదల కానుంది.
నటీనటులు :
నందమూరి బాలకృష్ణ, అర్జున్ రాంపాల్, కాజల్ అగర్వాల్, శ్రీలీల
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
బ్యానర్: షైన్ స్క్రీన్స్
సంగీతం: ఎస్ థమన్
డీవోపీ: సి రామ్ ప్రసాద్
ఎడిటర్: తమ్మి రాజు