Reading Time: 5 mins

భగవంత్ కేసరి మూవీ సక్సెస్ మీట్ ఈవెంట్

భగవంత్ కేసరి చిత్రాన్ని భారతీయ చిత్ర పరిశ్రమలో శాశ్వతంగా నిలిచిపోయే చిత్రాలలో చేర్చినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు: భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో నందమూరి బాలకృష్ణ

బాలకృష్ణ గారి డెడికేషన్‌ కి హ్యాట్సప్. భగవంత్ కేసరి ప్రతి తెలుగు కుటుంబం చూసే లాంగ్ రన్ మూవీ: నిర్మాత దిల్ రాజు

గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది బాలకృష్ణ గారి ద్వారా చెప్పించడం గొప్ప దేశసేవ: డైరెక్టర్ నందిని రెడ్డి

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని దసరా విన్నర్ గా నిలిచింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శ్రీలీల కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులందరి ప్రశంసలు అందుకొని అఖండ విజయం సాధించింది. భగవంత్ కేసరి రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ ని నిర్వహించింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకురాలు నందిని రెడ్డి ఈ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు.

బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. శక్తికి నిర్వచనం స్త్రీ. అలాంటి స్త్రీ శక్తి ప్రతిరూపం దుర్గమ్మ. అమ్మవారిని 108 నామాలతో స్మరిస్తాం. నా 108వ చిత్రం భగవంత్ కేసరి ఈ నవరాత్రుల్లో విడుదల కావడం, ఈ చిత్రానికి మూలం స్త్రీశక్తి కావడం, అమ్మవారి వాహనం పులి కావడం, ఈ చిత్రం కూడా బనావో బేటికో షేర్ అనే అంశంతో చేయడం చాలా సంతోషంగా వుంది. ఇలాంటి గొప్ప సందేశాత్మక చిత్రంలో మేమంతా పాలుపంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే కాదు భారతీయ చలనచిత్రపరిశ్రమలో శాశ్వతంగా నిలిచిపోయే చిత్రం భగవంత్ కేసరి. ఇలాంటి అద్భుతమైన సినిమా తెలుగువారు తీశారని దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నాను. ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాన్నగారి స్ఫూర్తితో ఏదైనా వైవిధ్యంగా చేయాలనే తపనతో చిత్ర పరిశ్రమలో నా ప్రస్థానం కొనసాగుతోంది. భైరవద్వీపం, ఆదిత్య 369, గౌతమీపుత్రశాతకర్ణి ఎలాంటి ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేసే అవాకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి వైవిధ్యమైన చిత్రాలని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. దర్శకుడు అనిల్ రావిపూడి నా అభిమాని. ప్రతి సినిమాకి వైవిధ్యం చూపుతున్నారు. ఎంత ఎదిగిన ఒదిగివుండే తన స్వభావం, అంకితభావం చూస్తుంటే చాలా గర్వంగా వుంది. ప్రతి మహిళ కూడా తనని తాను తర్ఫీదు చేసుకొని ఒక సైనికుడిలా తయారవ్వాలి. ఈ సినిమాతో ఇలాంటి మంచి సందేశం ప్రేక్షకుల్లోకి వెళ్ళింది. కుటుంబాలు తమ పిల్లలని తీసుకెళ్ళి థియేటర్ లో సినిమా చూపిస్తున్నారు. ఇంత అద్భుతమైన చిత్రాన్ని తీసిన దర్శకుడు అనిల్ రావిపూడిని అభినందిస్తున్నాను. శ్రీలీలకు తనలో నటన ప్రతిభని చూపించే పాత్ర దక్కింది. ఈ పాత్రకు తను పూర్తి న్యాయం చేశారు. కాజల్ తన అనుభవం అంతా రంగరించి తన పాత్రని చక్కగా చేశారు. అర్జున్ రాంపాల్ గారు జాతీయ అవార్డ్ పొందిన నటుడు. ఈ చిత్రంలో తన పాత్రని అద్భుతంగా పోషించారు. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పడం మరో విశేషం. తమన్ నా చిత్రాలకు హైఎనర్జీ మ్యూజిక్ అందిస్తారు. ఈ చిత్రం పాటలు నేపధ్య సంగీతం చాలా అద్భుతంగా చేశారు. రామ్ ప్రసాద్ నా ప్రతికదలిక తెలిసిన కెమరామెన్. దర్శకుడు మనసులో వున్న కాన్సప్ట్ ని అద్భుతంగా ఒడిసిపట్టుకుంటాడు. జయచిత్ర గారు చాలా అద్భుతమైన పాత్ర చేశారు. ఏదైనా విస్పోటనం జరిగినప్పుడే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. భగవంత్ కేసరి కూడా అలాంటి ఒక విస్పోటనంతో పుట్టింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ నిర్మాతలు సాహు, హరీష్ పరిశ్రమకు దొరికిన మంచి నిర్మాతలు. మంచి సినిమా ప్రేక్షకులకు ఇవ్వాలనే ప్యాషన్ వున్న నిర్మాతలు. కేవలం డబ్బు కోసమే కాదు మంచి సినిమాలు తీయాలి, సంస్థ నిలబడాలనే గొప్ప ఉద్దేశంతో పని చేస్తున్న సాహు, హరీష్ కు పరిశ్రమ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాసర్ల శ్యామ్, రామజోగయ్య శాస్త్రి, అజ్జు  ఇలా అందరూ చక్కగా కుదిరారు. వెంకట్ మాస్టర్ అద్భుతమైన పోరాటాలు డిజైన్ చేశారు. పోరాట సన్నివేశాలకు ప్రేక్షకులు లేచి చప్పట్లు కొడుతున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్, వీఎఫ్ ఎక్స్ నరేంద్ర మంచి పని తీరు కనబరిచారు. మా నటులు జానకి, శకుంతుల, శ్రీనివాస్ వడ్లమాని, మురళీధర్ గౌడ్, రచ్చరవి, జీవన్ , శ్రవణ్, భరత్ రెడ్డి ఆనంద్ ఇలా అందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ చిత్రంలో పని చేసిన అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విజయం సమిష్టి కృషి. ఇంత ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రం కోసం దంచవేమేనత్త కూతురా పాటని చాలా గ్రాండ్ గా తీశాం. ఇప్పుడా పాటని అభిమానులు, ప్రేక్షకులు కోరిక మేరకు యాడ్ చేస్తున్నాం. మరోసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమీకి డబుల్ ధమాకా అటు పండగ ఇటు భగవంత్ కేసరి ఘన విజయం. భారతీయ చిత్ర పరిశ్రమలో శాశ్వతంగా నిలిచిపోయే చిత్రాలు చాలా అరుదుగా వుంటాయి. వాటిలో ఒకటిగా భగవంత్ కేసరి ని చేర్చినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ భగవంత్ కేసరి చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లోని ప్రతికుటుంబం థియేటర్ కి వెళ్లి సినిమాని చూస్తున్నారు. ఇది బిగినింగ్ మాత్రమే, ఇంకా లాంగ్ రన్ వుంది. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. డీవోపీ రామ్ ప్రసాద్ గారు, ఎడిటర్ తమ్మిరాజు రాజు, యాక్షన్ వెంకట్ అందరూ అద్భుతమైన పనితీరు కనబరిచారు. తమన్ ప్రాణం పెట్టి మ్యూజిక్ చేశారు. నా రైటింగ్, డైరెక్షన్ టీం అందరికీ థాంక్స్. కాజల్ ఇలాంటి చక్కని కథలో భాగమవ్వాలని తన పాత్రని చేశాను. అర్జున్ రాం పాల్ గారు రాహుల్ సంఘ్వీ పాత్రలో అద్భుతంగా నటించడంతో పాటు తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పడం నిజంగా హ్యాట్సప్. శ్రీలీల అచ్చతెలుగమ్మాయి. భవిష్యత్ లో మరిన్ని విజయాలు అందుకోవాలి. శ్రీదేవి జయప్రద లాంటి గొప్ప స్థాయికి ఎదగాలి. మా బాలయ్య బాబుకి హ్యాటప్స్. నాకు ఎంతో నమ్మకం, స్వేఛ్చ ఇచ్చారు. వెనకుండి నడిపించారు. ఈ సినిమాకి, మా అందరికీ అయ్యోరు రూపంలో వున్నా అమ్మోరు మా బాలయ్య బాబు. ఈ విజయం వెనుక వున్న పెద్ద శక్తి మా బాలయ్య బాబు. ఆయన నిరంతర విద్యార్ధి. ఆయనలా ఎవరూ ఉండలేరు. బాలకృష్ణ గారితో ఈ ప్రయాణం ఇలానే కొనసాగాలని, ఆయనతో మళ్ళీ సినిమా చేయాలని కోరుకుంటున్నాను. నిర్మాతలు సాహు, హరీష్ కి థాంక్స్. వారితో మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయబోతున్నాం. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా శానా యేండ్లు యాదుంటాది అని చెప్పాం. అలాంటి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు

శ్రీలీల మాట్లాడుతూ భగవంత్ కేసరితో గొప్ప సందేశం జనాల్లోకి వెళ్ళింది. నాకు విజ్జి పాపలాంటి గొప్ప పాత్రని ఇచ్చిన దర్శకుడు అనిల్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో భాగం కావడం చాలా గర్వంగా వుంది. ఆడపిల్లగా పుట్టినందుకు గర్వంగా వుంది. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు. బాలకృష్ణ గారు ఎప్పటికీ నా చిచ్చా. ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు

అర్జున్ రాం పాల్ మాట్లాడుతూ అందరికీ దసరా శుభాకాంక్షలు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ కథ చెప్పినపుడు మునుపెన్నడూ చేయని కొత్త ప్రయత్నం చేస్తున్నాని అన్నారు. ఈ రోజు ఈ చిత్రానికి దక్కిన గొప్ప విజయాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. ఆ అమ్మాయి అమెరికాలో ఫుల్ క్రౌడ్ తో ఈ సినిమా చూసింది. తనకి చాలా నచ్చిందని చెప్పింది. నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. సినిమాకి భాష వుండదు. ఎమోషన్ వుంటుంది. ఆ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అయ్యింది. శ్రీలీల అద్భుతంగా నటించింది. బాలకృష్ణ గారు గొప్ప వ్యక్తిత్వం వున్న మనిషి. ఆయనలో అంకితభావానికి, ఎనర్జీకి హ్యాటప్స్. సాహు హరీష్ అద్బుతమైన నిర్మాతలు. చాలా గొప్పగా చూసుకున్నారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇప్పటివరకూ దాదాపు 46 చిత్రాల్లో పని చేశాను. కానీ ఏ చిత్రానికి చూడని ప్రేమ ఆప్యాయత ఈ చిత్రానికి చూశాను. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. ప్రేక్షకుల ఆదరణ గొప్ప ఆనందాన్ని ఇచ్చింది అన్నారు.

తమన్ మాట్లాడుతూబాలకృష్ణ గారితో ఇలాంటి సోషల్ మెసేజ్, ఎమోషనల్ సినిమా తీయాలనే ఆలోచన వచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడికి అభినందనీయం. ఈ సినిమాకి మ్యూజిక్ చేయడం నాకు కూడా చాలా కొత్త అనుభవాన్ని ఇచ్చింది. మన మదర్, సిస్టర్ కి ఎలా గౌరవిస్తామో అలాంటి గౌరవంతో ఈ సినిమాకి పని చేయడం జరిగింది. అనిల్ చాలా అద్భుతంగా రాశాడు, తీశాడు. ఆర్ఆర్, నేపధ్య సంగీతానికి చాలా అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ సినిమా మొదటి సీన్ చూసినప్పుడే బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయ్యాను. చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాను. అదే మాకు గొప్ప విజయాన్ని తీసుకొచ్చింది. కాసర్ల శ్యామ్, రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరాం చక్కని సాహిత్యం అందించారు. బాలకృష్ణ గారి సినిమా అంటేనే పూనకం వచ్చేస్తుంది. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడం చాలా ఆనందంగా వుంది. నిర్మాత సాహు, హరీష్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్ తెలిపారు.

నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ భగవంత్ కేసరి ఘన విజయం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. బాలకృష్ణ గారితో సినిమా చేయడం మా అదృష్టం. ఇంత గ్రేట్ సక్సెస్ ఇచ్చిన అనిల్ రావిపూడి గారికి చాలా థాంక్స్. అర్జున్ రామ్ పాల్ గారు కాజల్ శ్రీలీల , మిగతా టీం అంతా ఒక ఫ్యామిలీ కలిసి ఈ సినిమా చేశాం. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఈ సినిమా చూస్తారని నమ్మాము, అది ఈ రోజు నిజమైయింది. ప్రేక్షకులకు కృతజ్ఞతలు అన్నారు.

నిర్మాత హరీష్ పెద్ది మాట్లాడుతూ  ఈ సినిమాని ఇంత గొప్ప విజయాన్ని చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. బాలకృష్ణ గారికి, అనిల్ రావిపూడి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. శ్రీలీల, కాజల్, అర్జున్ రామ్ పాల్ తో పాటు సినిమాలో పని చేసిన అందరికీ థాంక్స్ తెలిపారు.

దిల్ రాజు మాట్లాడుతూ మా బ్యానర్‌లో అనిల్‌ రావిపూడి ఇప్పటికే 5 సినిమాలు చేశాడు. భగవంత్‌ కేసరి గురించి నాకు ఎప్పుడో చెప్పాడు. తెలంగాణ యాసలో బాలకృష్ణ గారు డైలాగ్స్ చెబితే చాలా కొత్తగా ఉంటుందన్నా. ముందు నుంచీ బ్రో ఐ డోంట్‌ కేర్‌ని టైటిల్‌ అనుకుని తర్వాత భగవంత్‌ కేసరిగా మార్చాడు. ఎక్కువగా ఎంటర్‌టైనింగ్‌ సినిమాలు తీసే అనిల్‌ ఇలాంటి బలమైన కథను రాసి అందరినీ సర్ ప్రైజ్ చేశారు. అనిల్ లో చాలా సామర్ధ్యం వుంది. అనిల్ ఇప్పుడు 2.o. తను ఇలాంటి అద్భుతమైన కథలు రాయాలి. ఇంత మంచి చిత్రాన్ని అందించిన అనిల్ కు అభినందనలు. తమన్ చక్కని మ్యూజిక్ చేశారు. నటిగా శ్రీలీలకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమా విడుదలకు ముందు వరకు శ్రీలీల అంటే డ్యాన్స్‌ అనేవారు. కానీ, ఇందులోని ఆమె నటన జయసుధ, జయప్రద, శ్రీదేవిలను గుర్తు చేసింది. బాలకృష్ణ మంగమ్మగారి మనవడు, ముద్దుల మావయ్య, సమరసింహారెడ్డి, లెజెండ్ ఇవన్నీ క్లాసిక్స్. ఇప్పుడు మరో క్లాసిక్ గా భగవంత్ కేసరి వచ్చింది. బాలకృష్ణ గారి డెడికేషన్‌తో ఈ సినిమా ఇంత గొప్ప విజయాన్ని సాధించింది. నిజంగా బాలయ్య గారికి సలాం కొట్టాలి. ఇలాంటి సినిమాలు చేస్తూ క్లైమాక్స్ లో అమ్మాయితో ఫైట్ ఒప్పుకున్నందుకు బాలకృష్ణ గారికి హ్యాట్సప్ . ఇది లాంగ్‌రన్‌ ఫిల్మ్‌. తప్పకుండా ప్రతి తెలుగు కుటుంబం ఈ సినిమా చూస్తుంది అన్నారు

నందిని రెడ్డి మాట్లాడుతూ నేను, అనిల్‌ రావిపూడి బాలకృష్ణ గారికి అభిమానులం. ఆయన సినిమాల ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోలో మేం కలుసుకునే వాళ్లం. బాలకృష్ణతో ఎప్పుడు సినిమా తీస్తావ్‌ అని అడిగితే నేనెప్పుడు చేసినా అది మీరంతా కాలర్‌ ఎగరేసేలా ఉంటుంది అని అనిల్‌ సమాధానమిచ్చేవాడు. ఇప్పుడదే పని చేస్తున్నా. గొప్ప సందేశం ఉన్న ఇలాంటి కథను తెరకెక్కించినందుకు అనిల్‌కు, నటించినందుకు బాలకృష్ణకు హ్యాట్సాఫ్‌. గొప్ప సోషల్ మెసేజ్ వున్న సినిమా తీశారు. దిని వలన చాలా మంది జీవితాలు మారిపోతాయి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది బాలకృష్ణ గారి ద్వారా చెప్పించడం ద్వారా చాలా దేశసేవ చేశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ అభినందనలు తెలిపారు.

రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూభగవంత్ కేసరిలాంటి సినిమా చేయడం బాలకృష్ణ గారు తీసుకున్న గొప్ప నిర్ణయం. నిర్మాతలు సాహు హరీష్ గారికి అభినందనలు. అనిల్ అద్భుతమైన చిత్రాన్ని తీశారు. తమన్ చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాని చేశారు. ఇందులో ఒక్క సన్నివేశం గుడ్ టచ్ బ్యాడ్ ఇది చాలు ఇది దేశం అంతా చూడదగ్గ సినిమా అని చెప్పడానికి. ఈ సినిమాకి అన్నీ చక్కగా కుదిరాయి. ఈ విజయంలో భాగం కలిగినందుకు ఆనందంగా వుంది అన్నారు. ఈ వేడుకలో జయచిత్ర, జానకి, శకుంతుల, శ్రీనివాస్ వడ్లమాని, మురళీధర్ గౌడ్, రచ్చరవి, జీవన్ , శ్రవణ్, భరత్ రెడ్డి ఆనంద్, కాసర్ల శ్యామ్, రామజోగయ్య శాస్త్రి, డీవోపీ రామ్ ప్రసాద్, అజ్జు, ఫైట్ మాస్టర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.