Reading Time: 2 mins

భలే మంచి చౌకబేరమ్‌ సక్సెస్‌ మీట్‌ 

వీద్‌, కేరింత నూకరాజు, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో అరోళ్ళ గ్రూప్‌ పతాకంపై అరోళ్ళ సతీష్‌కుమార్‌ నిర్మించిన సినిమా ‘భలే మంచి చౌకబేరమ్‌’. మారుతి కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రానికి మురళీకృష్ణ ముడిదాని దర్శకుడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ బేనర్‌పై అక్టోబర్‌ 5న ఈ సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం సక్సెస్‌ మీట్‌ను నిర్వహించింది చిత్ర యూనిట్‌.

కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ ”మా బ్యానర్‌లో విడుదల చేసిన ఈ సినిమా అందర్నీ అలరిస్తోంది. కంటెంట్‌ బాగుండడం వల్ల సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. రోజు రోజుకూ కలెక్షన్లు ఇంప్రూవ్‌ అవుతున్నాయి. ఇంకా పికప్‌ అయి మా సినిమా పెద్ద విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను” అన్నారు.
మారుతి మాట్లాడుతూ ”సినిమా తీయడం తేలిక. విడుదల కష్టం. మౌత్‌టాక్‌తో రీచ్‌ అయ్యేలా చేయడం చాలా కష్టం. శనివారం సాయంత్రానికి సినిమా మీద మాకు ఒక క్లారిటీ వచ్చింది. మేం అనుకున్న టార్గెట్‌ని రీచ్‌ అయ్యాం. కష్టపడి సినిమా చేశాం. మా చిన్న కాన్సెప్ట్‌ని పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌” అన్నారు.
మురళీకృష్ణ ముడిదాని మాట్లాడుతూ ”చిన్న సినిమా పెద్ద విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. రోజురోజుకీ కలెక్షన్లు పెరుగుతున్నాయి” అని చెప్పారు.
నవీద్‌ మాట్లాడుతూ ”మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్‌. కలెక్షన్లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. 100 రూపాయలు పెడితే 1000 రూపాయల వినోదం వస్తుంది. మంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఉన్న సినిమా ఇది” అని అన్నారు.

ముజ్‌తబా మాట్లాడుతూ ”ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన మారుతిగారికి, నిర్మాతకు థాంక్స్‌” అని అన్నారు.
నూకరాజు మాట్లాడుతూ ”శుక్రవారం విడుదల రోజు మార్నింగ్‌ ఓపెనింగ్స్‌ చూసి డిసప్పాయింట్‌ అయిన మాట వాస్తవం. ఆ రోజు ఈవెనింగ్‌కి ఫుల్స్‌ అయ్యాయి. ఇంకా పెద్ద హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది” అని చెప్పారు.

రాజా రవీంద్ర మాట్లాడుతూ ”30 ఏళ్ళుగా నాకు పాత్రికేయులు పరిచయం. ఫలానా క్యారెక్టర్‌ బాగా చేశారని ఏరోజూ నన్ను వాళ్ళు అప్రిషియేట్‌ చెయ్యలేదు. పాత్రికేయులు ఎప్పుడూ ఫోన్లు చేయలేదు. ఈ సినిమాలో పాత్ర బావుందని అన్నారు. డైరక్టర్‌ బాగా తీశారు. రవి బాగా డైలాగులు రాశారు” అని అన్నారు.
యామిని భాస్కర్‌ మాట్లాడుతూ ”మా సినిమాకి మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్‌. థియేటర్‌కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తున్నారు” అన్నారు.

ఉద్ధవ్‌ మాట్లాడుతూ ”జెన్యూన్‌ హిట్‌ ఇది. మారుతిగారు అందించిన కాన్సెప్ట్‌తో మురళీగారు బాగా తీశారు”అని అన్నారు. పూర్ణాచారి మాట్లాడుతూ ”సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. మారుతిగారి కాన్సెప్ట్‌ బావుంది” అని అన్నారు. నిర్మాత అరోళ్ళ సతీష్‌మారు సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ ”టఫ్‌ సిచ్చువేషన్‌లో కాన్ఫిడెన్స్‌తో విడుదల చేశాం. టాక్‌ బావుంది. ఇంకా పెద్ద హిట్‌ కావాలి” అని అన్నారు.