భీమ్లానాయక్ మూవీ రివ్యూ
పవన్ ‘భీమ్లా నాయక్’ మూవీ రివ్యూ
పవన్ ఫాన్స్ మాత్రమే కాదు. మూవీ లవర్స్ అంతా భీమ్లా నాయక్ మానియాతో ఊగిపోతున్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా పెద్ద సినిమాల రిలీజ్ లు ఆగిపోవడం, మళ్ళీ సాధారణ పరిస్థితికి వచ్చాక విడుదలవుతున్న బిగ్ బడ్జెట్ మూవీ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ కావడంతో ఫాన్స్ అయితే లాలా భీమ్లా అంటూ పూనకాలతో తెచ్చేసుకుంటున్నారు. ఫాన్స్ రచ్చ, ట్రేడ్ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన భీమ్లా నాయక్ హడావిడి గత రాత్రి నుంచే మొదలైపోయింది. యాటిట్యూడ్ చూపించడంలో పవన్ కళ్యాణ్‌ను మించిన వారు లేరంటూ కామెంట్లు వినపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ – రానా సీన్స్, పవన్ కళ్యాణ్‌కు పెట్టిన డైలాగ్స్ తో థియేటర్లో ఫ్యాన్స్ విజిల్స్‌తో మోత మోగిస్తున్నాయంటున్నారు. అవన్నీ నిజమేనా?ఫ్యాన్స్ మాటలా.అసలు సినిమా కథేంటి, మళయాళ
చిత్రాన్ని తెలుగుకు తెచ్చే ప్రాసెస్ లో జరిగిన మార్పులు ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
Storyline:
నిజాయితీగా తను నమ్మిందిచేస్తూ పోయే మొండివాడు భీమ్లా నాయక్(పవన్‌కల్యాణ్). తనలాంటి మరో మొండివాడు డానియల్ శేఖర్(రానా) తో అతనికి తగువు వస్తుంది. ఆర్మీ రిటైర్డ్ హవల్దార్ డానీది పొలిటికల్ ఫ్యామిలీ. మంచి పలుకుబడి ఉన్నవాడు. రేపో ,మారో రాజకీయ నాయకుడు అయ్యేవాడు. అతను ఓ రోజు రాత్రి తన కారులో మందు బాటిల్స్ పెట్టుకుని అడవిలో వెళ్తూంటాడు. అది alcohol-restricted ఏరియా కావటంతో భీమ్లా అడ్డుపడతాడు. డానీని కొట్టి అరెస్ట్ చేస్తాడు. తనంతటివాడినే అరెస్ట్ చేస్తాడా అని డానీకి కాలుతుంది. ఇద్దరి మధ్యా ఇగో భగ్గుమంటుంది. అంతే డానీ తనను ఇంతలా అవమానించిన భీమ్లాని వదలకూడదనుకుంటాడు. ఓ ప్లాన్ చేసి ఉద్యోగం పోయేలా చేస్తాడు. అక్కడ నుంచి భీమ్లా రైజ్ అవుతాడు. డానిని వదలకూడదనుకుంటాడు. ఇద్దరూ ఒకరిపై మరకొకరు ఆధిపత్యం చూపించే ప్రాసెస్ లో ఒకరినొకరు చంపుకునే దాకా వెళ్లిపోతారు. ఇంతకీ ఆ పరిస్దితులు ఏమిటి?ఈ గొడవలోకి భీమ్లా భార్య సుగుణ(నిత్యామీనన్) ఎలా ఇరుక్కుంది?.చివరకి ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Screenplay Analysis:
ఇద్దరి మధ్య చిన్నగా ఒక మామూలు వివాదం చిలికి చిలికి గాలి వానై ఆ ఇద్దరి ఇగో వార్ కు దారితీస్తే..ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేదే మళయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కథ . వాస్తవానికి తెలుగుకు ఈ సినిమా వర్కవుట్ అవుతుందా అంటే ధైర్యంగా చెప్పలేం. కానీ నిర్మాత, దర్శకుడు దాన్ని నమ్మి త్రివిక్రమ్ సాయింతో నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లటం జరిగింది.ఒక చిన్నసైజు పొలిటీషియన్ కుమారుడికి, మరో పోలీసాఫీసర్ కు మధ్యన జరిగిన ఇగో వార్ మన నేటివిటికి తీసుకొచ్చారు. స్క్రిప్టు, మెయిన్ ఆర్టిస్ట్ ల స్క్రీన్ ప్రెజన్స్,ఫెరఫార్మెన్స్ లు అక్కడ సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లాయి. అంతేకాదు అవకాసం ఉన్నా డైరక్టర్ ఈ సినిమాని డార్క్ మోడ్ లోకి తొయ్యడు. ఓ టైమ్ లో ఇద్దరి పరిస్దితులు తమ చేజారిపోయాక…ఇదేమన్నా వైల్డ్ గా సాగే సినిమానా అనిపిస్తుంది. మనకి ఆ మేకింగ్ స్టైల్ …స్క్రీన్స్ మీద వర్కవుట్ అయినవి చూస్తూంటే Italian filmmaker Sergio Leone చేసిన వెస్ట్ మూవీస్ గుర్తు వస్తాయి. అవే పవన్ కు నచ్చినట్లు ఉన్నాయి. మెయిన్ క్యారక్టర్స్ పవన్,రానాలు ఇద్దరూ Clint Eastwood,Lee Van Cleef అనిపిస్తారు.
అలాగే ఈ స్క్రిప్టులో ఇంకో గొప్పతనం ఏమిటి అంటే ఓ మహిళా పాత్రలకు కావాల్సినంత స్పేస్ ఇస్తాడు. చాలా హుందాగా ,గౌరవంగా తీర్చిదిద్దుతారు. సెంట్రల్ కాంప్లిక్ట్ వల్ల వచ్చే సమస్యల నుంచి ఆ మహిళాపాత్రలు రెండు తమను తాము ధైర్యంగా పోరాడగలవు…చాచి లెంపకాయ కొట్టగలవు. బేలగా చూడవు. అలాగే ఈ సినిమాలో మరో అంశం మనలని ఎట్రాక్ట్ చేస్తుంది అదేమిటంటే… humiliation ఉన్నా ఒకరే గెలుచుకుంటూ పోవటం ఉండదు. రెండు పాత్రలూ పోటాపోటీగా ఉంటాయి. అవన్నీ స్క్రిప్టులో ఫెరఫెక్ట్ గా యాప్ట్ అయ్యాయి కాబట్టే సినిమా నెక్ట్స్ లెవిల్ కు వెళ్లింది. త్రివిక్రమ్ ఒరిజనల్ లో ఉన్న అంతర్గత అంశాలను కూడా పట్టుకున్నారు. వాటికి తన స్క్రిప్టులో తగినంత స్పేస్ ఇచ్చి స్క్రిప్టు రైటర్ గా విజ్ఞత చాటుకున్నారు. అయితే మళయాళంలో పోలీస్ ఆఫీసర్ పాత్ర కంటే రిటైర్డ్ మిలటరీ హవాల్దార్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కానీ తెలుగుకు వచ్చేసరికి రానా పాత్రకు ప్రాధాన్యం తగ్గించి , పవన్ కళ్యాణ్ చేసిన పాత్రకు ప్రాధాన్యత పెంచేసారు . అలాగే మలయాళ మాతృకలో బ్రహ్మానందం పాత్ర లేదు. తెలుగులో ఆ క్యారెక్టర్‌ను కలిపారు.
Analysis of its technical content
తమన్ ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అరిపించాడు. మలయాళంలో నాలుగు పాటలు ఉంటే… తెలుగులో డీజే వెర్షన్‌తో కలిపి ఐదు పాటలున్నాయి. ముఖ్యంగా ‘లా లా భీమ్లా’ సాంగ్ కు ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తోంది. డైలాగ్స్, స్క్రీన్ ప్లే విషయంలో త్రివిక్రమ్ పూర్తి న్యాయం చేసారు. ఓ ఫెరఫెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ కు కావాల్సిన మసాలాలు అన్నీ ఏర్చి కూర్చి పటాస్ లా వదిలారు. సెకండాఫ్‌లోనూ పవన్ నుంచి వచ్చే డైలాగ్‌లు ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తాయి. ప్రతి సీన్ ఒకదానినిని మించి మరొకటి ఉండేలా రూపొందించారు. దర్శకుడు విషయానికి వస్తే సాగర్ చంద్ర ఎక్కడా డల్ అవ్వనివ్వకుండా స్క్రీన్ ని ఫైర్ లా ఉంచటంతో సక్సెస్ అయ్యారు. అయితే ఫస్టాఫ్ కాస్తంత స్లో తగ్గించి ఉంటే,సెకండాఫ్ కు సింక్ అయ్యేది. రవి కె.చంద్ర సినిమాటోగ్రఫీ సినిమా హైలెట్స్ లో ఒకటి. అలాగే యాక్షన్ సీన్స్ డిజైన్ చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్స్ కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టి చేసారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. ల్యాగ్ లు లేకుండా లాక్కెళ్లిపోయారు.
మలయాళంలో అయ్యప్ప – కోషియమ్ మధ్య జరిగే వార్ వెర్బల్‌గా సాగితే అది తెలుగులోకి వచ్చేసరికి యాక్షన్ డ్రామా మారిపోయింది. దాంతో ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కు స్పెషల్ ప్రయారిటీ క్రియేటైంది. ఏదో ఫైట్స్ అంటే కొట్టేసుకోవటం కాకుండా …క్యారక్టర్స్ ఇంటెక్షన్ తో కలిపి ఇంటెన్స్ గా డిజైన్ చేయటం బాగుంది. అందుకే టెక్నికల్ డిపార్టమెంట్ లో యాక్షన్ కొరియోగ్రఫీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. బీజీఎమ్ కు తగ్గట్లు స్టంట్స్ ,యాక్షన్ నెక్స్ట్ లెవెల్లో సాగింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా దృష్టి పెట్టి చేసారు. వారి కష్టానికి తగినట్లే థియోటర్స్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్ సీన్స్ లో పవన్ కళ్యాణ్ ఇంటెన్సిటీని పూర్తిగా మ్యాచ్ చేయడంలో రానా దగ్గుబాటి సక్సెస్ సాధించాడు. తెలుగులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ జోడించడం, హీరో కోపాన్ని యాక్షన్ కోణంలో మలచడం ఇవన్నీ కలిసి వచ్చాయి.ముఖ్యంగా క్లైమాక్స్ లో రెండు కొదమ సింహాలు తలపడితే ఎలా ఉంటుందో పవన్ – రానా పాత్రల్ని తెరపై చూసినప్పుడు అలాంటి ఫీల్ వచ్చేలా చేసారు.
నచ్చినవి…
పవన్,రానా పోటా పోటీ నటన
మేకింగ్, త్రివిక్రమ్ రైటింగ్
సాంగ్స్
నచ్చనవి
ఫస్టాఫ్ స్లోగా సాగటం
సెకండాఫ్ లో కొన్ని సీన్స్
చూడచ్చా…
నిరభ్యంతరంగా…చూసి ఎంజాయ్ చేయచ్చు…
తెర ముందు…వెనక.
బ్యానర్:సితార ఎంటర్టైన్మెంట్స్
నటీనటులు: పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి,నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్’, ఇతర ప్రధాన పాత్రల్లో రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి తదితరులు.
సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్
ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISC
సంగీతం: తమన్.ఎస్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్
వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్ టి
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత:సూర్యదేవర నాగవంశి
దర్శకత్వం: సాగర్ కె చంద్ర
రన్ టైమ్: 2h 25m
విడుదల తేదీ: 25, పిబ్రవరి 2022