భూతద్ధం భాస్కర్ నారాయణ మూవీ AI జెనరేటడ్ లిరికల్ వీడియో సాంగ్ విడుదల
ఇండియన్ సినిమాలో తొలి AI జెనరేటడ్ లిరికల్ వీడియో గా భూతద్ధం భాస్కర్ నారాయణ శివ ట్రాప్ ట్రాన్స్ సాంగ్
భూతద్ధం భాస్కర్ నారాయణ AI జెనరేటడ్ శివ ట్రాప్ ట్రాన్స్ లిరికల్ వీడియో గూస్ బంప్స్ తెప్పించింది: సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో సుహాస్ & మూవీ టీం
శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. న్యూ ఏజ్ స్టార్ కంపోజర్ శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం టైటిల్ సాంగ్ వైరల్ అయ్యింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ నేపధ్యంలో ఈ చిత్రం నుంచి శివ ట్రాప్ ట్రాన్స్ పాటని రిలీజ్ చేశారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణీ ఈ పాటని లాంచ్ చేశారు. శ్రీచరణ్ పాకాల కంపోజ్ చేసిన ఈ పాట గూస్ బంప్స్ తెప్పించింది. చైతన్య ప్రసాద్ అందించిన లిరిక్స్ అద్భుతంగా వున్నాయి. సింగల్ కాలభైరవ హై ఎనర్జీతో పాడిన ఈ పాట నిజంగానే ఒక ట్రాన్స్ లోకి తీసుకెళుతుంది. ఈ పాట లిరికల్ విజువల్స్ AI చాట్ జీపీటీని ఉపయోగించి రూపొందించారు. ఇండియన్ సినిమాలో మొదటి AI జెనరేటడ్ లిరికల్ వీడియో ఇదే కావడం విశేషం. హీరో సుహాస్ ముఖ్య అతిధిగా హాజరై ఈ సాంగ్ లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగింది. దర్శకుడు విజయ్ కనకమేడల, హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఈ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు.
సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ముఖ్య అతిధిగా హాజరైన హీరో సుహాస్ మాట్లాడుతూ.. నిర్మాతలు స్నేహాల్, శశిధర్, కార్తీక్ గారికి, దర్శకుడు పురుషోత్తం రాజ్ కు అభినందనలు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అద్భుతంగా వున్నాయి. కలర్ ఫోటోకి ముందు మను చరిత్ర సినిమాలో శివ స్నేహితుడిగా చేశాను. రాజ్ కందుకూరిగా నిజంగా తన బిడ్డలానే చూసుకునే వారు. నేను హీరో కాకముందే హీరోలా చూశారు. శివ చాలా మంచోడు. వెరీ జెన్యూన్ పర్సన్. రాశి చాలా మంచి నటి. రాబోయే నా ప్రసన్నవదనం సినిమాలో తనతో నటించాను. చైతన్య ప్రసాద్ గారు లిరిక్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. శ్రీచరణ్ అద్భతమైన మ్యూజిక్ ఇచ్చారు.భూతద్ధం భాస్కర్ నారాయణ మార్చి 1న థియేటర్స్ లోకి వస్తుంది. తప్పకుండా అందరూ చూడాలి అని కోరారు.
దర్శకుడు విజయ్ కనకమేడల మాట్లాడుతూ..శివ ట్రాప్ ట్రాన్స్ పాట ఓ రేంజ్ లో వుంది. చైతన్య ప్రసాద్ గారు అద్భుతంగా రాశారు. నేపధ్య సంగీతంలో ఇలాంటి పాటలు వచ్చి సినిమాని నిలబెడుతున్న సందర్భాలు ఈ మధ్య కాలంలో చుస్తున్నాం. ఈ పాట కూడా అంత పవర్ ఫుల్ గా వుంది. శ్రీచరణ్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు. భూతద్ధం భాస్కర్ నారాయణ టైటిల్ లానే ఈ కథ కూడా ఆసక్తికరంగా వుంటుంది. శివ చాలా పాజిటివ్ పర్సన్. తనకి మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.
హీరోయిన్ వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. శివ నా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరు. ఈ సినిమా కంటెంట్ నాకు చాలా నచ్చింది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ జోనర్ చాలా కొత్తగా ఆసక్తిగా వుంది. మార్చి 1న థియేటర్స్ లోకి వస్తుంది. తప్పకుండా అందరూ చూడాలి అన్నారు.
హీరో శివ కందుకూరి మాట్లాడుతూ.. శివ ట్రాప్ ట్రాన్స్ ఈ సినిమా ఆల్బం లో నా ఫేవరేట్. సినిమాలో చాలా కీలక సమయంలో ఈ పాట వస్తుంది. విజువల్ తో ట్రాక్ వినప్పుడు అన్ బిలివబుల్ అనిపించింది. ఇలాంటి ట్రాక్ దొరకడం ఆనందంగా వుంది. శ్రీచరణ్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు. చైతన్య ప్రసాద్ గారి లిరిక్స్, కాలభైరవ పాడిన తీరు పాటని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది. ఈ పాటని లెజెండరీ ఎంఎం కీరవాణీ గారు రిలీజ్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ వేడుకు అతిధిగా వచ్చిన సుహాస్ గారికి ధన్యవాదాలు. తను మా ఇంట్లో మనిషి. విజయ్ గారికి, వర్షకి థాంక్స్. మా ట్రైలర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ పాట కూడా నచ్చుతుంది. ఈ రెండు నచ్చాయంటే మా సినిమా కూడా తప్పకుండా నచ్చుతుంది. మార్చి1న థియేటర్స్ లోకి వస్తున్నాం. అందరూ థియేటర్స్ కి రండి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అన్నారు.
దర్శకుడు పురుషోత్తం రాజ్ మాట్లాడుతూ.. ఈ పాట కోసం శ్రీ చరణ్ ఇచ్చిన ట్యూన్, చైతన్య ప్రసాద్ గారు అల్లిన పదాలు గూస్ బంప్స్ తెప్పించాయి. రావణాసురుడు శివుడుని ఎంత తీవ్రతతో పూజించారో ఇందులో మా విలన్ పాత్ర కూడా ఆ స్థాయిలో వుంటుంది. ఖచ్చితంగా సినిమా మీ అందరికీ నచ్చుతుంది. హీరోశివ గారికి, టీం అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. సుహాస్ నా బిడ్డలాంటి వాడు. మంచి నటుడు. గొప్పగా ఎదుగుతున్నాడు. ఇంకా ఎదగాలి. నాంది లాంటి మంచి సినిమాని ఇచ్చిన విజయ్ ఈ వేడుకులో వుండటం ఆనందంగా వుంది. భూతద్ధం భాస్కర్ నారాయణ చాలా మంచి సబ్జెక్ట్. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా చేశారు. ఈ పాట వింటుంటే గూస్ బంప్స్ వచ్చాయి. చైతన్య ప్రసాద్ గారు గ్రేట్ లిరిక్స్ ఇచ్చారు. శ్రీ చరణ్ చాలా మంచి ట్యూన్ ఇచ్చారు. కాల భైరవ టెర్రిఫిక్ గా పాడారు. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అన్నారు
హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ .. ట్రైలర్ కి అద్భుతమైన స్పంధన వచ్చింది. పాటని కీరవాణి గారు విడుదల చేశారు. ఆయన్ని కలసి బ్లెస్సింగ్ తీసుకోవడం ఆనందంగా వుంది. ఈ పాట చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. సినిమా చూస్తున్నపుడు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది. మార్చి 1న అందరూ థియేటర్స్ లో చూడాలి అని కోరారు.
సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ.. ఈ పాటకు అన్నీ అద్భుతంగా కుదిరాయి. కీరవాణి గారు ఈ పాటని లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది. చైతన్య ప్రసాద్ గారు చాలా అర్ధవంతమైన సాహిత్యాన్ని అందించారు. కాల భైరవ అద్భుతంగా పాడారు. ప్రొడక్షన్ డిజైనర్ చాలా అద్భుతంగా చూపించారు అన్నారు.
నిర్మాతలు స్నేహాల్, శశిధర్, కార్తీక్ మాట్లాడుతూ.. ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ పాటని లాంచ్ చేసిన కీరవాణి గారికి కృతజ్ఞతలు. ఈ వేడుకు విచ్చేసిన సుహాస్ గారికి, విజయ్ గారి, వర్ష గారి ధన్యవాదాలు. శ్రీ చరణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. చైతన్య ప్రసాద్ గారు చాలా గొప్ప సాహిత్యాన్ని అందించారు. టీం అందరికీ ధన్యవాదాలు. మార్చి 1న సినిమా వస్తోంది. తప్పకుండా థియేటర్స్ లో చూడండి. అందరికీ అద్భుతంగా నచ్చుతుంది అన్నారు. సినిమా యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.