మంచి రోజులు వచ్చాయి మూవీ రివ్యూ
‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ రివ్యూ
Emotional Engagement Emoji (EEE) :
పండుగ రోజు ఫన్ సినిమా అంటే చూడాలనే అనిపిస్తుంది. అందులోనూ మారుతి బ్రాండ్ ఫన్ సినిమాల అంటే క్లీన్ గా ఫ్యామిలీలు చూడదగ్గట్లుగా ఉంటాయనే పేరు. దాంతో ఆయన కామెడీ సినిమాలకు మంచి డిమాండు. అయితే ఫన్ ప్రతీ సారీ అనుకున్నట్లు వర్కవుట్ కాదు. ఫన్ పండాలంటే సరైన ప్రిమేజ్ ఉండాలి. క్యారక్టర్స్ పండాలి. మారుతి ఈ విషయాల్లో మాస్టర్స్ చేసినట్లుగా ఉంటారు. ఆ క్రమంలోనే ‘మంచి రోజులు వచ్చాయి’ కు మంచి క్రేజ్ వచ్చింది. దానికి తోడు ఏక్ మినీ కథతో ఓటీటిని హీటెక్కించిన సంతోష్ శోభన్ హీరో కావటం కూడా కలిసివచ్చింది. ఇవన్నీ ఏ మేరకు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. అసలు ఈ సినిమా కథేంటి, ఎవరికి మంచి రోజులొచ్చాయి వంటి విషయాలు తెలియాలు రివ్యూ చేద్దాం.
స్టోరీ లైన్
సాఫ్ట్ వేర్ ఉద్యోగులైన సంతోష్ అలియాస్ సంతు (సంతోష్ శోభన్), పద్దు అలియాస్ పద్మ (మెహరీన్) గత మూడేళ్లగా రిలేషన్ షిప్ లో ఉంటారు. అయితే ఇద్దరి ఫ్యామిలీలకు ఈ విషయం తెలియదు. ఈ లోగా 2020లో కరోనా ఇండియాలోకి ప్రవేశిస్తూండటంతో వర్క్ ఎట్ హోట్ ప్రకటిస్తారు. దాంతో వీళ్లిద్దరూ తాము ఉంటున్న బెంగుళూరు వదిలి హైదరాబాద్ తమ ఇళ్లకు వస్తారు. ఇక ఇక్కడ పద్మ తండ్రి తిరుమలశెట్టి గోపాల్ అలియాస్ గుండు గోపాల్ (అజయ్ ఘోష్)కి తన కూతురు పద్దు అంటే ప్రాణం. ఎంతో నమ్మకం. కానీ, ఎప్పుడూ సంతోషంగా కనిపించే గోపాల్‌ని చూసి అసూయ పడిన ఇద్దరు పక్కింటి వ్యక్తులు మూర్తి,గోపీలు ఆయనలో లేనిపోని అబద్దాలు చెప్పి,ఆయనలో భయాల్ని సృష్టిస్తారు.
పద్మజ ఎవరితోనో ప్రేమలో ఉందని, లేచిపోతుందని, దాంతోకుటుంబం పరువు పోతుందని, రోడ్డున పడతావని ఇలా గోపాలంలో లేనిపోని భయాలను రేపుతారు. దాంతో గోపాల్ తన కూతురు విషయంలో చిన్న చిన్న విషయాలను పెద్దదిగా ఆలోచిస్తూ ఆందోళన చెందడం మొదలుపెడతాడు. దాంతో గోపాలం ఒకానొక టైమ్ లో మూర్తి, కోటి దెబ్బకు గోపాలంకు గుండె నొప్పి కూడా వస్తుంది. దానికి కారణం సంతోశ్‌ను ప్రేమించడమేనని మూర్తి, కోటి కలిసి పద్మజను తిడతారు. దాంతో ఆమె సంతోశ్‌ను కలిసి తన తండ్రికి ఏమైనా అయితే ముఖం కూడా చూడనని వార్నింగ్ ఇస్తుంది. దానికితోడు కరోనా భయం కూడా తోడవుతుంది. ఇన్ని చిక్కుల మధ్య సంతోష్, పద్దుల ప్రేమాయణం ఏమైంది? గోపాల్ భయాల్ని ఈ జంట ఎలా దూరం చేసింది? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.
ఎనాలసిస్
మొదట ఓటీటి రిలీజ్ అనుకుని మొదలెట్టిన ఈ సినిమా థియేటర్ రిలీజ్ కు వచ్చింది. అయితే ఈ సినిమాలో అన్ని ఓటీటి లక్షణాలే కనపడతాయి. గతంలో మారుతి డైరక్ట్ చేసిన ‘భలే భలే మగాడివోయ్, మహానుభావుడు’ వంటి చిత్రాలను అదే పంథాలో తెరకెక్కించి ప్రేక్షకుల మన్ననలు అందుకోవాలుకున్నా స్క్రిప్టు సహకరించలేదు. ఆ కథల్లో హీరోకు లోపాన్ని పెట్టి వాళ్లని సెంటర్‌గా చేసుకుని కథను అల్లుకున్నాడు. కానీ ‘మంచిరోజులు వచ్చాయి’ సినిమాలో లోపాన్ని హీరో సంతోశ్ శోభన్‌కు కాకుండా హీరోయిన్ మెహరీన్ తండ్రి పాత్రలో నటించిన అజయ్ ఘోష్ పాత్రకు లోపం ఆపాదించాడు. ఆ పాత్రను ప్రధానంగా చేసుకుని పాత్రలు అల్లుకుంటూ వచ్చాడు.
దాంతో హీరో పాత్ర సైడ్ లైన్ అయ్యిపోయింది.దాంతో ఈ సినిమాలో ఎంటర్‌టైనింగ్‌గా గ్రిప్పింగ్ తప్పిపోయింది. ఫస్టాఫ్‌లో కథను అక్కడక్కడే గానుగెద్దులా తిప్పాడు.దాంతో కథ కదలినట్లు ఉండదు. మనకు అక్కడ నుంచి కదిలి వెల్లిపోవాలనిపిస్తుంది. ఎంతసేపూ అజయ్ ఘోష్ పాత్రలోని భయాన్ని ఎక్కువగా హైలైట్ చేస్తూ చూపించడంతోనే ఫస్టాఫ్ ముగిసిపోయింది.
ఉన్నంతలో సెండాఫ్ కాస్త బెటర్. అజయ్ ఘోష్ క్యారెక్టర్‌కు, కమెడియన్ ప్రవీణ్ లేడీ వాయిస్‌తో మాట్లాడే అప్పడాల విజయలక్ష్మి అనే ఫిక్షనల్ పాత్రకు మధ్య ఉండే కామెడీ ట్రాక్ బాగా నవ్విస్తుంది. ఈ ట్రాక్ మినహా చెప్పుకోదగినదేమీ ఈ సినిమాలో లేదు. దానికి తోడు ద్వంద్వార్థాలు దట్టించారు. క్లైమాక్స్ సైతం తేలిపోయింది.
నచ్చినవి
అప్పడాల విజయలక్ష్మి పాత్ర ద్వారా వచ్చే ఫన్
మెసేజ్
నచ్చనవి
స్క్రీన్ ప్లే
టేకింగ్
టెక్నికల్ గా..
అజయ్ ఘోష్ పాత్ర ఈ సినిమాకు ప్రాణం. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. కాకపోత కొన్ని సీన్స్ రిపీటెడ్‌గా అనిపిస్తాయి. సంతోష్, మెహరీన్ కాంబినేషన్ బాగుంది. పాటలు బాగున్నాయి. వెన్నెల కిషోర్, ప్రవీణ్, హర్ష, సప్తగిరి అలా అలా నడిపించుకుంటూ పోయారు. అనూప్ సంగీతం, సాయిశ్రీరామ్ కెమెరా వర్క్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఓక అనిపిస్తాయి. లిమిటెడ్ బడ్జెట్ లో తీసిన సినిమా అని అర్దమవుతుంది. లెంగ్త్ తక్కువ కూడా సినిమాకు కలిసొచ్చింది.
చూడచ్చా
అక్కడక్కడా వచ్చే ఫన్ కోసం సరదాగా చూడచ్చు
బ్యానర్: యూవీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్;
నటీనటులు: సంతోష్ శోభన్, మెహరీన్, వెన్నెల కిషోర్, సప్తగిరి, వైవా హర్ష, అజయ్ ఘోష్, ప్రవీణ్ తదితరులు;
సంగీతం: అనూప్ రూబెన్స్;
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్;
ఎడిటింగ్: ఎస్‌బీ ఉద్ధవ్;
ఆర్ట్: రామ్ కుమార్;
నిర్మాత: వి సెల్యులాయిడ్, ఎస్‌కేఎన్;
విడుదల తేదీ: 04-11-2021
రన్ టైమ్:2 hr 16 Mins