మట్కా మూవీ లుక్ టెస్ట్ కోసం హైదరాబాద్‌లో నోరా ఫతేహి
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్, వైర ఎంటర్టైన్మెంట్స్ పాన్ ఇండియా మూవీ మట్కా లుక్ టెస్ట్ & వర్క్‌షాప్ కోసం హైదరాబాద్‌లో నోరా ఫతేహి
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తొలి పాన్ ఇండియా మూవీ మట్కా. పలాస ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్, డ్యాన్సర్ నోరా ఫతేహి ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు. వైర ఎంటర్టైన్మెంట్స్పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ చిత్రం ప్రారంభోత్సవ వేడుక ఇటీవలే ఘనంగా జరిగింది.
నోరా ఫతేహి కి డ్యాన్స్ నంబర్ ఉంటుంది, ఆమె పాత్ర చాలా కీలకమైనది. షూటింగ్ ఇంకా ప్రారంభం కానప్పటికీ, సినిమాలో ఛాలెంజింగ్ క్యారెక్టర్లో నటించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. 1958-1982 మధ్య కాలంలో జరిగే సినిమా కథలో వైజాగ్ అమ్మాయిగా నటించడం పెద్ద ఛాలెంజ్. నోరా ఫతేహి ప్రస్తుతం హైదరాబాద్‌లో వున్నారు. మూడు రోజుల పాటు ఆమె టీమ్‌తో వుంటారు.
మొదట్లో నోరాకి లుక్ టెస్ట్ చేశారు. తర్వాత పాత్ర ప్రిపరేషన్ కోసం వర్క్‌షాప్‌లో పాల్గోన్నారు. సబ్జెక్ట్‌ని ఇష్టపడి, తన పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉన్న నోరా, మేకింగ్ దశలో తప్పులు జరగకూడదని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆమె అంకితభావనికి యూనిట్ సర్ప్రైజ్ అయ్యింది.
ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇందులో నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ ఇతర ప్రముఖ తారాగణం.
ఈ సినిమా కోసం 60వ దశకంలో వైజాగ్‌ను తలపించే భారీ వింటేజ్ సెట్‌ను నిర్మించనున్నారు. 60వ దశకంలోని వాతావరణాన్ని, అనుభూతిని అందించడానికి చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ చిత్రానికి ఆశిష్ తేజ ప్రొడక్షన్ డిజైనర్, సురేష్ ఆర్ట్ డైరెక్టర్.
ఈ చిత్రానికి అద్భుతమైన సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. సౌత్‌లో అత్యంత బిజీ గా ఉన్న కంపోజర్లలో ఒకరైన జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ప్రియాసేత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.
యూనివర్సల్ అప్పీల్ వున్న మట్కా పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుంది. ఇది వరుణ్ తేజ్‌కి మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.
తారాగణం :
వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, కన్నడ కిషోర్, అజయ్ ఘోష్, మైమ్ గోపి, రూపలక్ష్మి, విజయరామరాజు, జగదీష్, రాజ్ తిరందాస్
సాంకేతిక విభాగం :
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల
బ్యానర్: వైర ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డివోపీ: ప్రియాసేత్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్