Reading Time: 2 mins

మర్డర్ చిత్రం 24 డిసెంబర్ విడుదల

అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఆనంద్ చంద్ర దర్శకత్వంలో నట్టి కరుణ,నట్టి క్రాంతి లు నిర్మిస్తున్న రాంగోపాల్ వర్మ కుటుంబ కథా చిత్రం మర్డర్.డిసెంబర్ 24 న థియేటర్స్ లలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రాన్ని హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో పాత్రికేయులకు,థియేటర్ ఓనర్లకు,డిస్ట్రిబ్యూటర్లకు రెండు రోజులు ముందుగా చిత్రాన్నిప్రదర్శించడం జరిగింది.
 
 
సినిమా ప్రదర్శన అనంతరం దర్శకుడు ఆనంద్ చంద్ర మాట్లాడుతూ… అందరూ మా ఇన్విటేషన్ ని పాజిటివ్ గా తీసుకొని వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది.ఈ సినిమా  పై చాలామందికి చాలా అపోహలున్నాయి.ఇందులో ఎం చూపించబోతున్నారు.సినిమా ఎలా ఉండబోతుంది అని.. వాటన్నిటినీ క్లారిఫై చేయడానికి మేము థియేటర్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్, పాత్రికేయులకు ఈ సినిమా రెండ్రోజుల ముందుగానే చూపించడం జరిగింది.కరోనా వల్ల చాలామంది థియేటర్లలోకి రావడానికి భయపడుతున్నారు.ఈ సినిమాను చూసి మీరు సినిమా బాగుందని అనిపిస్తే మీడియా ద్వారా ఆడియన్స్ కు పాజిటివ్ కలిగించాలని కోరుకుంటున్నాను.అప్పుడు  ఆడియన్స్ థియేటర్ కు వచ్చి సినిమా చూస్తారు.ఒక సినిమా లవర్ గా సినిమా బాగుంది అని టాక్ వస్తే కచ్చితంగా ఆడియన్స్ థియేటర్ వరకు వచ్చి చూస్తారని నా నమ్మకం అన్నారు.
 
 నట్టి కరుణ మాట్లాడుతూ… పిలవగానే అందరూ వచ్చి మా సినిమా చూసినందుకు థ్యాంక్యూ .మా డైరెక్టర్ గారు చెప్పినట్టు మూవీ పైన చాలా మందికి ఇందులో నెగిటివ్ చూయించారా.. పాజిటివ్ చూపించారా..అని చాలా క్వశ్చన్స్ వచ్చాయి.వాటన్నిటినీ దాటుకొని ఈ సినిమా ఈ నెల 24న విడుదల చేస్తున్నాం.ఈ మూవీఅనుకున్న దానికంటే బాగా వచ్చింది ఇందులో ఎమోషన్,ఫాదర్ సెంటిమెంట్ అన్ని వున్నాయి.ప్రతి తల్లిదండ్రి కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది.కాబట్టి థియేటర్ కు రావడానికి భయపడుతున్న మీకు థియేటర్స్ వారు అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకున్నారు కాబట్టి దయచేసి అందరూ థియేటర్కు వచ్చి సినిమా చూసి మా చిత్ర యూనిట్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము అన్నారు.
 
 
నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ… నిన్నటివరకూ చాలామంది ఇందులో ఏదో చూపించారని అపోహలతో కోర్టుకు వెళ్లడం జరిగింది. కోర్టు పరిశీలించి ఆర్డర్ ప్రకారం సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది ఈ నెల 24న విడుదల చేస్తున్నాం. రెండు రోజుల ముందు మేము ఈ సినిమాను వేయడానికి కారణం వారి అపోహలను తొలగించడానికి ఈ సినిమా వేయడం జరిగింది. మేము నల్గొండ కెళ్ళి ఎస్పీ గారి
నీ కలిస్తే మాకు అక్కడ కొన్ని కారణాల వలన మిర్యాలగూడ లోని నటరాజ్ థియేటర్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టడానికి పర్మిషన్ దొరకలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత మిర్యాలగూడ కు తప్పకుండా వస్తామని రాంగోపాల్ వర్మ గారు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ సినిమా ద్వారా మేము ఒక తండ్రికి,కూతురు పై ఎంత ప్రేమ ఉంది.ఆ ప్రేమ వల్ల అనర్ధాలు ఏంటో తెలియజేస్తూ..మర్డర్ అనంతరం ఆ కుటుంబం ఎలా చిన్నాభిన్నం అయిందో ఈ సినిమాలోచూపిస్తున్నాం.ప్రతితల్లి,తండ్రి,కూతురు,కొడుకు చూడవలసిన చిత్రం మర్డర్. మా మర్డర్ కుటుంబ కథ చిత్రం సినిమాను చూసి మీరందరూ ఆదరించాలని ప్రేక్షక దేవుళ్ళని కోరుకుంటున్నానని అన్నారు.
 
నటీనటులు ..
శ్రీకాంత్ అయ్యంగార్,గాయత్రీ భార్గవి,సాహితీ, గిరిధర్,దీపక్, గణేష్
 
సాంకేతికవర్గం..
నిర్మాతలు..నట్టి కరుణ /నట్టి క్రాంతి
 
దర్శకత్వం… ఆనంద్ చంద్ర
 
సంగీతం.. డి ఎస్ ఆర్
 
డిఓపి.. జగదీష్ చీకటి
 
ఎడిటర్ ..శ్రీకాంత్ పట్నాయక్. ఆర్