Reading Time: < 1 min

మార్కెట్‌ చిత్రం ప్రారంభo

మార్కెట్‌లో క్రైమ్ క‌థ మొద‌లైంది

మూవీ మొఘ‌ల్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై అజ‌ర్ షేక్ నిర్మిస్తోన్న‌ చిత్రం మార్కెట్‌. దాస‌రి గంగాధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ  చిత్రంలో కిషోర్‌, దివ్య (నూత‌న ప‌రిచయం) హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.  ఈ చిత్ర ప్రారంభోత్స‌వ పూజా కార్య‌క్ర‌మాలు రామానాయుడు స్టూడియోలో జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశ‌లో 

ద‌ర్శ‌కుడు గంగాధ‌ర్ మాట్లాడుతూ….  ఇది నా మొద‌టి సినిమా న‌న్ను ఆద‌రించి న‌న్ను ప్రొడ్యూస‌ర్‌గారికి ప‌రిచ‌యం చేసిన రాముగారికి ముందుగా నా కృత‌జ్ఞ‌త‌లు.  ప్ర‌తి ఊరిలోను నేర చ‌రిత్ర ఉంటుంది. రాత్రి స‌మయంలో జ‌రిగే క్రైమ్ ఇన్సిడెన‌ట్స్‌ని తీసుకుని ఇప్ప‌టివ‌ర‌కు ప్రపంచానికి చూపించ‌ని నేర సామ్రాజాన్ని చూపించ‌డ‌మే ఈ చిత్ర క‌థాంశం అని అన్నారు. మీరంద‌రూ ఈ చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అన్నారు.

ప్రొడ్యూస‌ర్ అజ‌ర్ షేక్ మాట్లాడుతూ… సినిమాల్లో నా మొద‌టి ప్ర‌యాణం గంగాధ‌ర్ చెప్పిన క‌థ న‌చ్చి ఈ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాను. మీరంద‌రూ ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను. జ‌న‌వ‌రిలో షూటింగ్ ప్రారంభం కానుంది. మార్చిలో సినిమా మొత్తం పూర్తి చేసి మీ ముందుకు తీసుకువ‌స్తాం అన్నారు. 

హీరోయిన్ దివ్య మాట్లాడుతూ… నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన ప్రొడ్యూస‌ర్‌, డైరెక్ట‌ర్‌గారికి నా కృత‌జ్ఞ‌త‌లు. ఈ చిత్రంలో న‌టించే మేమంద‌రం కొత్త‌వాళ్ళం మాకుమీ స‌పోర్ట్ త‌ప్ప‌క కావాలి. అంద‌రూ మమ్మ‌ల్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అన్నారు. 

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో దాస‌రిగంగాధ‌ర్‌, అజర్‌షేక్‌, దివ్య త‌దిత‌రులు పాల్గొన్న ఈ చిత్రానికి సంగీతంఃఆర్మ‌న్‌, కెమెరాఃసి.ఎస్‌.చంద్ర‌, ఎడిట‌ర్ఃశివ‌స‌ర్వాని, క‌థ‌, మాట‌లు, రైట‌ర్ఃఅనంత‌సేన‌, నిర్మాతఃఅజ‌ర్‌షేక్‌, ద‌ర్శ‌క‌త్వంఃదాస‌రిగంగాధ‌ర్‌.