మార్షల్ చిత్రం ప్రీ రిలీస్ ఈవెంట్
మార్షల్ సినిమా చూసాను బాగా నచ్చింది, ఈ మూవీ పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను – మార్షల్ ప్రీ రిలీస్ ఈవెంట్ లో హీరో శ్రీకాంత్
అభయ్, మేఘా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘మార్షల్’. హీరో శ్రీకాంత్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని హీరో అభయ్ తన సొంత బ్యానర్ లోనే నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జై రాజాసింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరు 13 న విడుదలవుతోంది. ఈ సందర్బంగా జరిగిన ప్రీ రిలీస్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు
ఈ సందర్బంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ…
అభయ్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవ్వడం ఆనందంగా ఉంది. తను మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడని ఆశిస్తున్నాను. హీరోగానే కాకుండా ఈ సినిమాతో నిర్మతగా ఒక అడుగు ముందుకు వెయ్యడం సంతోషంగా ఉంది. నిన్న మార్షల్ సినిమా చూసాను, నేను ఈ మధ్య కాలంలో చేసిన సినిమాల్లో ఈ మూవీ బెస్ట్ అని చెప్పవచ్చు.
హీరో అభయ్ మాట్లాడుతూ…
మా మార్షల్ సినిమా ప్రీ రేలీస్ ఈవెంట్ కు వచ్చిన ప్రతివక్కరికి థాంక్స్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ కావాలి. అన్నీ జాగ్రత్తలు తీసుకొని మేము ఈ సినిమా తీసాము. స్వామి గారు సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. సినిమా గ్రాండ్ గా వచ్చింది. నేను బాగా పెర్ఫామ్ చేయడానికి శ్రీకాంత్ గారు సపోర్ట్ చేశారు. సెట్ లో ఆయన అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయి. సాంగ్స్, ఫైట్స్, మదర్ సెంటిమెంట్ ఇలా అన్నీ ఈ సినిమాలో ఉండబోతున్నాయి. శ్రీకాంత్ గారికి నాకు మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా ఎప్పుడు వచ్చినా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఈ సినిమా అలాగే అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆధరిస్తారని నమ్ముతున్నాను అన్నారు.
డైరెక్టర్ జయరాజ్ సింగ్ మాట్లాడుతూ..
మా హీరో, నిర్మాత అభయ్ ఈ కథ నేను చెప్పినప్పుడు విన్న వెంటనే చెయ్యడానికి ఒప్పుకున్నారు. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ చేసిన శ్రీకాంత్ గారికి థాంక్స్. కొత్త పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాము. సెప్టెంబర్ 13న ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్మకం ఉందన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ…
అభయ్ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం సంతోషం. మొదటి సినిమాతోనే కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాడు. భవిషత్తులో అతను నటుడిగా మరో మెట్టు ఎక్కలని కోరుకుంటున్న అన్నారు.
వరికుప్పల యాదగిరి మాట్లాడుతూ…
నాకు ఈ అవకాశం ఇచ్చిన హీరో అభయ్ గారికి థాంక్స్. నేను ఈ సినిమాలో రాసిన పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ రవి బర్సుర్ మాట్లాడుతూ…
కే. జీ.ఎఫ్ సినిమా తరువాత నేను ఒప్పుకున్న సినిమా మార్షల్. కథ నచ్చి వెంటనే ఈ సినిమా చెయ్యడానికి అంగీకరించాను. దర్శకుడు ఒక కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నిర్మాత, హీరో అభయ్ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తాడు. సినిమా బాగా వచ్చిందని అన్నారు.
హీరోయిన్ మేఘ చౌదరి మాట్లాడుతూ…
ఈ సినిమాలో నా పాత్ర మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. అభయ్ తో కలిసి నటించడం బెస్ట్ మెమోరీస్ ను ఇచ్చింది. సెప్టెంబర్13న వస్తున్న మా సినిమాను చూసి మీరందరూ ఆదరించండి. హీరో శ్రీకాంత్ గారు సెట్స్ లో బాగా సపోర్ట్ చేశారు, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
నటీనటులు:-
అభయ్ ,శ్రీకాంత్,మేఘా చౌదరి,రష్మి సమాంగ్,సుమన్,వినోద్ కుమార్,శరణ్య,పృద్విరాజ్,రవి ప్రకాష్, ప్రియ దర్శిని రామ్,ప్రగతి,కల్ప వల్లి,సుదర్శన్, తదితరులు నటించిన
ఈ చిత్రానికి సంగీతం: యాదగిరి వరికుప్పల. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : కె.జీ.ఎఫ్ ఫేమ్ రవి బసురి.
ఛాయాగ్రాహకుడు : స్వామి ఆర్ యమ్. మాటలు : ప్రవీణ్ కుమార్ బొట్ల .ఫైట్స్ : నాభ మరియు సుబ్బు. ఎడిటర్ : చోట కె ప్రసాద్. పాటలు : యాదగిరి వరికుప్పల. కళా దర్శకుడు : రఘు కులకర్ణి.
డాన్స్ మాస్టర్ : గణేష్. డైరెక్టర్: జయరాజ్ సింగ్. నిర్మాత : అభయ్ అడకా