మెకానిక్ మూవీ ఆడియో సక్సెస్ మీట్
టీనాశ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై మణిసాయితేజరేఖ నిరోషా జంటగా నటించిన చిత్రం మెకానిక్. ముని సహేకర దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, పాటలు కూడా రాశారు. ఎం. నాగ మునెయ్య (మున్నా) నిర్మాత. నందిపాటి శ్రీధర్‌రెడ్డి, కొండ్రాసి ఉపేందర్ సహ నిర్మాతలు. ఈనెల 26న విడుదల కానున్న ఈ చిత్రం ఆడియో సూపర్‌హిట్ అయింది. టి`సిరీస్ ద్వారా విడుదలైన ఆడియో 10 మిలియన్లకు దగ్గరగా వెళ్లి రికార్డు సృష్టిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆడియో సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత లక్ష్మి భూపాల, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా లక్ష్మీ భూపాల మాట్లాడుతూ…
విడుదలకు ముందే ఒక చిన్న సినిమా ఆడియో 10 లక్షల వ్యూస్‌కు చేరువలో ఉందంటే మాటలు కాదు. ఖచ్చితంగా ఇది వందకు వందశాతం జన్యూన్ ఆడియో సక్సెస్‌మీట్. కలలు కనడమే కాదు.. వాటిని నిజం చేసుకోవటానికి శ్రమ కూడా అవసరం. ఈ సినిమా యూనిట్ కూడా తాము కన్న కలను నిజం చేసుకుందని ఈ సక్సెస్‌మీట్ చెపుతోంది. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
ప్రసన్నకుమార్ మాట్లాడుతూ…
కొన్ని సినిమాల సక్సెస్ అవి విడుదలైన తర్వాతే తెలుస్తుంది. మరికొన్ని సినిమాల సక్సెస్ విడుదలకు ముందే కన్ఫర్మ్ అవుతాయి. అలాంటి సక్సెస్ సాధించబోతున్న సినిమా మెకానిక్. దర్శకుడు ముని సహేకర మల్టీటాలెంటెడ్ అని ఈ సినిమాకు ఇన్ని విభాగాలకు పనిచేసినప్పుడే అర్ధం అవుతోంది. సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.
నిర్మాత మున్నా మాట్లాడుతూ…
సినిమాలంటే నాకున్న ప్యాషన్ ఇక్కడిదాకా తీసుకొచ్చింది. నెలకు లక్ష రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి ఈ సినిమా నిర్మాణాన్ని చేపట్టాను. అది రిస్క్ అని నాకూ తెలుసు. కానీ ఇప్పుడు మా సినిమా ఆడియో టి`సిరీస్ వంటి ప్రఖ్యాత సంస్థ తీసుకోవడం, వారి చార్ట్‌బస్టర్‌లో మా మెకానిక్ ఆడియో దూసుకు పోవడంతో ఆ రిస్క్‌కు తగిన ఫలితం దక్కింది అనిపిస్తోంది. మా సహ నిర్మాతలు నందిపాటి శ్రీధర్‌రెడ్డి, కొండరాశి ఉపేందర్ల సహకారం వల్లనే మంచి సినిమా నిర్మించగలిగాను. వారికి నా థ్యాంక్స్. ఇక దర్శకుడు ముని సహేకర గారి టాలెంట్ గురించి చెప్పాలంటే నా స్థాయి సరిపోదు అనిపించింది. మల్టీ టాలెంటెడ్. మంచి పర్ఫెక్షన్, విజన్ ఉన్న దర్శకుడు, రచయిత. మొత్తం పాటలు ఆయనే రాశారు. హీరో మణిసాయితేజ`రేఖ నిరోషా జంట అందరినీ అలరిస్తుంది. ముఖ్యంగా సంగీత దర్శకుడు వినోద్ యాజమాన్య గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఆయన సంగీతం వల్లే విడుదలకు ముందే మా సినిమా టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయ్యింది అన్నారు.
దర్శకుడు ముని సహేకర మాట్లాడుతూ…
మంచి చిత్రం రావాలంటే మంచి నిర్మాత దొరకాలి. నాకు మంచి నిర్మాతలే కాదు.. గట్స్ ఉన్న నిర్మాతలు దొరికారు. దేనికి ఎంత అవుతోంది అని ఆలోచించకుండా ఖర్చుపెట్టారు. వినోద్ యాజమాన్యగారు పాటల విషయంలో తన స్వంత సినిమా అన్నట్టుగా ప్రాణం పెట్టి పనిచేశారు. తన రెమ్యునరేషన్ గురించి ఆలోచించకుండా మంచి పాటలు రావటానికి మాచేత ఖర్చు పెట్టించారు. ఇందుకు ఉదాహరణ సిద్‌శ్రీరాం గారు మా సినిమాలో ఓ పాట పాడటం. నా తొలి సినిమా విడుదలకు ముందే ఇంత సంతోషాన్ని పంచడం ఆనందంగా ఉంది. హీరో, హీరోయిన్లు కూడా చక్కగా సూటయ్యారు. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. తనికెళ్ల భరణిగారు అందించిన సహకారం మరువలేనిది. ఆడియో లాగే సినిమా కూడా సూపర్ సక్సెస్ అయి, మా అందరికీ మంచి కెరీర్ ఇస్తుందని ఆశిస్తున్నా అన్నారు.
కో`ప్రొడ్యూసర్స్‌లో ఒకరైన కొండ్రాసి ఉపేందర్ మాట్లాడుతూ…
మా అబ్బాయి మణిసాయి తేజను ఈ చిత్రానికి హీరోగా తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. సాయితేజను హీరోగా పెట్టి నేను ఇప్పటికే రెండు సినిమాలు చేశాను. అవి ఇంకా విడుదల కాకుండానే మూడో సినిమాకు బయట బ్యానర్ నుండి ఆఫర్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కథ వినగానే నేను నిర్మించాలనుకున్న మరో సినిమాను పక్కనపెట్టి ఇందులో భాగస్వామిగా చేరిపోయాను. అంతగా ఈ కథ ఆకట్టుకుంది. నిర్మాత మున్నాగారు, దర్శకుడు ముని సహేకర్ గారు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారని చెప్పాలి. మెకానిక్ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంటాడు అన్నారు.
హీరో మణి సాయితేజ, హీరోయిన్ రేఖ నిరోషాలు మాట్లాడుతూ తమను నమ్మి ఈ సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాత ముని గారికి, దర్శకుడు ముని సహేకర్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాము. మా సినిమా ఆడియో ఇంత సూపర్ సక్సెస్ కావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా కూడా ఇలాగే సూపర్ సక్సెస్ అవుతుంది. దర్శకుడు ముని గారి టాలెంట్‌కు హేట్సాఫ్. ఆయన చెప్పినదానికన్నా బాగా తెరకెక్కించారు. యూనిట్ అందరికీ మా థ్యాంక్స్ అన్నారు.
నటీనటులు :
తనకెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, చత్రపతి శేఖర్, సమ్మెట గాంధీ, కిరీటి, జబర్ధస్త్ దొరబాబు, జబర్ధస్త్ పణి, సంద్య జనక్, సునీత మనోహర్
సాంకేతిక వర్గం :
సంగీతం: వినోద్ యాజమాన్య
డీఓపీ: ఎస్.పి. శివరాం
ఎడిటర్: శివ శర్వాణి
నిర్మాత: ఎం. నాగ మునెయ్య (మున్నా)
దర్శకత్వం: ముని సహేకర