మెయిల్ సినిమా ఓటీటీ ఆహాలో సంక్రాంతి విడుదల
మెయిల్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్.. సంక్రాంతి సందర్భంగా జనవరి 12 సాయంత్రం 6 గంటలకు తెలుగు ఓటీటీ ‘ఆహా’లో విడుదల
2020లో తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌మెంట్‌తో అలరించిన తెలుగు ఓటీటీ ‘ఆహా’.. రానున్న కొత్త సంవత్సరం 2021కి సరికొత్తగా ఆహ్వానం పలుకుతుంది. అందులో భాగంగా స్వప్నా సినిమాస్ బ్యానర్‌పై ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మాతలుగా డైరెక్టర్ ఉదయ్ గుర్రాల దర్శకత్వంలో రూపొందిన డిఫరెంట్ మూవీ ‘మెయిల్’. ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నారు.
శుక్రవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో …
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘కంబాలపల్లె కథలు, మెయిల్ గురించి మాట్లాడే ముందు నాగురించి, అశ్వినీదత్‌గారి గురించి మాట్లాడాలను కుంటున్నాను. మేం ఇద్దరం నలబై ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చాం. అప్పటి నుంచి సినిమా తీస్తూ ఉన్నాం. మాతో పాటు వచ్చిన వాళ్లలో మేమే ఇంకా సినిమాలు తీస్తున్నాం. అంటే ఇది మా గొప్పతనం అని అనడం కంటే మా పిల్లలు మా నుండి వస్తున్న దాన్ని అందుకోవడం వల్ల.. మాకు ఉత్సాహం వాళ్ల వల్ల వచ్చింది. అలా మా పిల్లలు ఇదే ఇండస్ట్రీలో సెటిల్ కావడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తాను. మేం నిర్మాతలం అనే కాదు మంచి స్నేహితులం. అంతే కాదు, ఏడు సినిమాలు ఇద్దరం కలిసి నిర్మించాం. సినిమాలు వచ్చాయి, పోయాయి. అయినా కూడా మేం మా స్నేహాన్ని కొనసాగించాం. ఇప్పుడు మా సెకండ్ జనరేషన్ వచ్చి సినిమాలు చేస్తున్నారు. అశ్వినీదత్‌గారి అమ్మాయి అయిన స్వప్న తన బ్యానర్ స్వప్న సినిమాస్ బ్యానర్‌పై సినిమా చేస్తుంది. నేను ఆహా కోసం కంటెంట్‌ను చేస్తున్న క్రమంలో స్వప్నను పిలిచి నా కోసం ఓ వెబ్ సిరీస్ చేసి పెట్టవా అని అడిగాను. స్వప్న సినిమాస్ బ్యానర్‌లో తక్కువ సినిమాలే వచ్చినా ఎలాంటి సినిమాలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన బ్యానర్‌లో ఉదయ్ గుర్రాలతో కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. నేను రషెష్ చూశాను. నాకు నచ్చింది. త్వరలోనే ఆహాలో ప్రసారం అవుతుంది. కాబట్టి ఆహా తరపున స్వప్నకు థాంక్స్ చెబుతున్నాను’’ అన్నారు.
వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ మాట్లాడుతూ – ‘‘నేను నిర్మాతగా మారే క్రమంలో నవయుగ ఫిలింస్ వారిని కలిసినప్పుడు వారు అరవింద్‌గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. తర్వాత ఆయన్ని ఎన్నో విషయాల్లో ఆదర్శంగా తీసుకుని, ఇద్దరం మాట్లాడుకుంటూ ముందుకుసాగాం. నాకు ఇండస్ట్రీలో ఎవరు అత్యంత ఆప్తులు అని అడిగితే మూడు పేర్లు చెబుతాను. వారిలో ఒకరు చిరంజీవిగారు, రెండో వ్యక్తి అరవింద్‌గారు, మూడో వ్యక్తి రాఘవేంద్రరావుగారు. స్వప్న ఓ రోజు ఇలా అరవింద్ అంకుల్ నన్ను ఆహా కోసం వెబ్ సిరీస్ చేయమని అన్నారు. చేస్తున్నాను. అనగానే…కచ్చితంగా నీకు ఇది గోల్డెన్ ఆపర్చ్యునిటీ అన్నాను. కచ్చితంగా ఓటీటీ ఫార్మేట్‌లోనూ నువ్వు సక్సెస్ అవుతావని అన్నాను. ఓటీటీ మాధ్యమం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఆహా మనలో ఓ భాగమైంది. ఇలాంటి ఫ్లాట్‌ఫామ్‌ను అరవింద్‌గారు టేకప్ చేయడం మంచి పరిణామం’’ అన్నారు.
స్వప్న దత్ మాట్లాడుతూ – ‘‘ఒకానొక సందర్భంలో నేను పార్టినర్‌షిప్ గురించి డాడీతో మాట్లాడుతుంటే అరవింద్ అంకుల్ గురించి చెబుతూ ‘ముప్పై ఏళ్లుగా నేను, అరవింద్ సినిమాలు చేశాం. హిట్స్ తీశాం. ఫ్లాపులు తీశాం. కానీ ఏసందర్భంలోనూ ఒకరినొకరు మాటలు అనుకోలేదు. అదే నిజమైన పార్టినర్ షిప్ అంటే’ అన్నారు. దాంతో నేను ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇంకా జాగ్రత్తగా చేశాం. మాపై నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చినందుకు అరవింద్ అంకుల్‌గారికి ధన్యవాదాలు. మా హృదయాలకెంతో దగ్గరైన ప్రాజెక్ట్ ఇది. ఎంతో హాయిగా ఇంట్లోని అందరూ చూసే అందమైన కథ ఇది. ఇలాంటి కథను నమ్మి నాకు, ఉదయ్‌కు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా అందిరకీ ఇది చాలా మంచి పేరుని తెచ్చిపెడుతుందని నమ్ముతున్నాం’’ అన్నారు.
డైరెక్టర్ ఉదయ్ గుర్రాల మాట్లాడుతూ – ‘‘దీన్ని నేను ఇండిపెండెంట్‌గా చేద్దామని అనుకుంటున్న సమయంలో స్వప్నగారు ఈ కథను విని ఓకే చేశారు. అందుకు ముందుగా ఆమెకు థాంక్స్. మాపై ఎలాంటి ప్రెజర్ లేకుండా చిత్రీకరణకు సపోర్ట్ చేశారు. హర్షిత్, రోజా, సుబ్బు, సన్ని, శివన్న అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు’’ అన్నారు.
ప్రియదర్శి మాట్లాడుతూ – ‘‘ఎంతో పెద్ద లెగసీ ఉన్న అరవింద్‌గారు, అశ్వినీదత్‌గారితో కలిసి సినిమా చేయడం చాలా ఆనందంగాఉంది. ముఖ్యంగా అరవింద్‌గారు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడం ఆహాను స్థాపించి కొత్త వారిని ఎంకరేజ్ చేస్తుంన్నందుకు థాంక్స్. ఉదయ్ వరల్డ్ సినిమా స్టైల్లో మెయిల్‌ను తెరకెక్కించాడు. తప్పకుండా సంక్రాంతికి మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తాం’’ అన్నారు.
హర్షిత్ మాట్లాడుతూ – ‘‘నా తొలి సినిమానే ఇంత గొప్పగా చేయడం ఆనందంగా ఉంది. గర్వంగా ఫీల్ అవుతున్నాను. షూటింగ్ సమయంలో అక్కడున్న స్కూల్ ఉండి షూటింగ్ పూర్తి చేశాం. అందరి సపోర్ట్‌తోనే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయగలిగాం’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ స్వీకర్ అగస్తి సహా చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
నటీనటులు:
ప్రియదర్శి, హర్షిత్ మాల్గి రెడ్డి, మణి అగెరుల, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, శ్రీకాంత్ పల్లె, రవీందర్ బొమ్మకంటి, అనుషా నేత తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: ఉదయ్ గుర్రాల
నిర్మాతలు: ప‌్రియాంక దత్, స్వప్న దత్
సినిమాటోగ్రఫీ: ఉదయ్ గుర్రాల, శ్యామ్ దుపాటి
మ్యూజిక్: స్వీకార్ అగస్తి
ఎడిటర్: హరి శంకర్ టి.ఎన్