Reading Time: < 1 min

మే 31న “సువర్ణ సుందరి” విడుదల 

 పూర్ణ,  సాక్షి చౌదరి , జయప్రద   ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతొన్న చిత్రం “సువర్ణసుందరి”.   సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న క్యాప్షన్ తో    భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని  రీతిలొ ఓ  సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న  ఈ చిత్రం మే 31న  ప్రేక్షకుల ముందుకు రానుంది.  

ఈ సందర్బంగాడైరెక్ట‌ర్ సూర్య మాట్లాడుతూ… సువర్ణ సుందరి  చిత్రంలో  ఎఫ్ఎక్స్ కోసం  ఏడాదిపాటు  వ‌ర్క్ జ‌రిగింది.  టైమ్ తీసుకున్నా ఔట్పుట్ మాత్రం అద్భుతంగా వ‌చ్చింది.గత కొంతకాలంగా తెలుగులో స్క్రీన్  ప్లే బెస్డ్ సినిమాలకు ఆదరణ లభిస్తొందు. సువర్ణ సుందరి సైతం మూడు జన్మల కాన్సెప్ట్ తో ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లే తో రూపొందిచాము. ఆడియెన్స్ ఆకట్టుకొవటంతో పాటు ,కమర్షియల్‌ గా పక్కా హిట్ కొడతామన్న నమ్మంకంతొ ఉన్నామన్నారు.

నిర్మాత లక్ష్మీ మాట్లాడుతూ..‌ సువర్ణ సుందరి   చిత్ర ట్రైలర్ ‌ సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు   ఆకట్టుకుంది. బడ్జెట్ ఎక్కువయినా , క్వాలిటీ ఔట్పుట్ చూశాక సినిమా విజయంపై  చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. చిత్రం సెన్సార్ కు సిద్దమయింది. తెలుగు ,కన్నడ ,తమిళ్ భాషల్లొ మే 31న ప్రపంచవ్యాప్తంగా   విడుదల చెయటానికి  సన్నాహాలు చెస్తున్నామన్నారు. 

 జ‌య‌ప్ర‌ద‌, పూర్ణ‌, సాక్షి, ఇంద్ర‌, రామ్ మద్దుకూరి, సాయికుమార్‌, కోటాశ్రీ‌నివాస‌రావు, ముక్త‌ర్‌ఖాన్‌, నాగినీడు, స‌త్య‌ప్ర‌కాష్‌, అవినాష్ న‌టిస్తున్నారు

 మ్యూజిక్‌డైరెక్ట‌ర్: సాయికార్తిక్‌

స్టంట్స్: రామ్‌సుంక‌ర‌

ఆర్ట్ డైరెక్ట‌ర్: నాగు

డి.ఓ.పి: ఎల్లుమహంతి

ఎడిట‌ర్: ప్ర‌వీణ్‌పూడి

స్టోరీ: ఎం.ఎస్‌.ఎన్.సూర్య‌

పి.ఆర్‌.ఓ. సాయిస‌తీష్‌

ప్రొడ్యూస‌ర్: ఎం.ఎల్‌.ల‌క్ష్మి

డైరెక్ట‌ర్: ఎం.ఎస్‌.ఎన్‌.సూర్య‌.