మోసగాళ్లు మూవీ విలేకరుల సమావేశం
మోసగాళ్లు సక్సెస్‌పై మా టీమ్ అందరం కాన్ఫిడెంట్‌గా ఉన్నాం – విష్ణు మంచు.
విష్ణు మంచు , కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మోసగాళ్లు’. ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలో నటించారు. ఈ మూవీలో కాజల్ అగర్వాల్, విష్ణు మంచు అక్కా తమ్ముళ్లుగా నటించడం విశేషం. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటి స్కామ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా పది నిమిషాల నిడివిగల మోసగాళ్లు మూవీ స్నీక్‌పీక్ వీడియో ఈ రోజు హైదరాబాద్‌లో ప్రదర్శించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..
నవదీప్ మాట్లాడుతూ – “మోసగాళ్లు స్నీక్ పీక్ చూశాక ఆడియన్స్ కి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది అని మాకు కాన్ఫిడెన్స్ కలిగింది. వైజాగ్‌లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. రీజెంట్‌గా విడుదలైన తెలుగు సినిమాలకి మంచి రెస్పాన్స్‌తో పాటు మంచి కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. తెలుగు ప్రేక్షకుల బ్లడ్‌లోనే సినిమా ఉంది అని మరోసారి ప్రూవ్ చేశారు. అదే ఆదరణ ఈ సినిమా కూడా పొందుతుంది అని కోరుకుంటున్నాము. ఇండియాలో ఎక్కడో ఒక మారుమూల ప్రదేశం నుండి ఇద్దరు అక్కా తమ్ముళ్లు అమెరికన్స్ అందరినీ ఎలా మోసం చేశారు అనే ఇంట్రెస్టింగ్ కథాంశాన్ని చాలా మలుపులతో సినిమాటిక్‌గా చెప్పాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఈనెల 19న థియేటర్లలో సినిమా చూడండి“ అన్నారు.
విష్ణు మంచు మాట్లాడుతూ – “హిందీ, తమిళ్, కన్నడ, మళయాలంలో డబ్చేసి తెలుగుతో పాటు ఈ నెల 19న రిలీజ్ చేస్తున్నాం. మాకు సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే ఈ రోజు పది నిమిషాల స్నీక్ పీక్ చూపించాం. ఇప్పుడు మరింత నమ్మకం కలిగింది ప్రజలందరూ మోసగాళ్లు సినిమాని ఆదరిస్తారని. ఈ సినిమా ప్రమోషన్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు ముందు నేను కొంచెం తప్పు చేశాను..అదేంటంటే నాకు జనాల ముందుకు వెళ్లాలన్నా, మీడియాతో మాట్లాడాలన్నా మొహమాటం టెన్షన్ ఎక్కువ,, దాంతో ఎక్కువగా బయటకు వచ్చేవాణ్ణి కాదు కాని కొంత మంది దాన్ని యారగెన్స్ అనుకునేవారు. కాని ఈ సినిమాకు అలా కాదు ఇది నా గత చిత్రాల్లాగా యాక్షన్ కామెడీ కాదు. ఒక బ్రిలియంట్ సబ్జెక్ట్. కాబట్టి ఈ సినిమా గురించి, ఈ కథ గురించి ఎంత ఎక్కువ ఆడియన్స్‌లోకి తీసుకెళ్తే అంత మంచిది అని భారీగా ప్రమోషన్స్ చేస్తున్నాం. మా టీమ్ అందరం కూడా సక్సెస్‌పై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. నా దృష్టిలో తక్కువ మంది చూసి అప్రిషియేట్ చేస్తే అది క్లాస్. ఎక్కువ మంది చూసి అప్రిషియేట్ చేస్తే అది మాస్. ఈ రోజు స్నీక్ పీక్‌లో చూపించినట్టుగా సినిమా అంతా కంప్యూటర్స్ మీద ఉండదు. కేవలం ఈ స్క్యామ్ ఎలా జరిగింది. అనే దానిమీదే సినిమా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరికీ అర్ధ అయ్యేలాగే ఉంటుంది. ముఖ్యంగా ఈ అక్కా తమ్ముళ్లు ఎక్కడ మొదలయ్యారు? ఈ స్క్యామ్ ఎందుకు చేశారు అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంత స్క్యామ్ జరుగుతున్నా అమెరికన్స్ వీళ్లని ఎందుకు పట్టుకోలేకపోయారు లాంటి అంశాలను డీటైల్డ్‌గా చూపించాం. ఇప్పుడు ఆ బ్రదర్ సిస్టర్స్ బాంబేలోనే ఉన్నారు. ఆ పోలీస్ ఆఫీసర్, నవదీప్ చేసిన క్యారెక్టర్ అతను కూడా బోంబేలోనే ఉన్నారు. ఎన్నో ఛాలెంజ్‌లతో కూడుకున్న ఫ్యాషనేటింగ్ స్టోరీ. మహారాష్ట్ర, గుజరాత్లో ఈ స్టోరీ ఎక్కువ మందికి తెలుసు. ఇక్కడ కూడా చెప్పాలన్న ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాం. యూఎస్‌లో జరిగిన కథ కాబట్టి ముందు ఇంగ్లీష్‌లోనే చేద్దాం అనుకున్నాం తర్వాత ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నాం. ఈ స్క్యామ్ని లీడ్ చేసిన అక్క పాత్రలో కాజల్ నటిస్తోంది. తను ప్రొఫెషనల్ యాక్టర్. చాలా బాగా పెర్ఫామ్ చేసింది. ఈ సినిమా ప్రాసెస్‌లో ఈ స్క్యామ్కి సంభందించిన కొందరు వ్యక్తులు నన్ను ఫోన్లో కాంటాక్ట్ అయ్యారు. ఆ ఆడియో నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్లే చేస్తాను“ అన్నారు.
తారాగణం:
విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, రుహీ సింగ్, నవదీప్, నవీన్ చంద్ర
సాంకేతిక బృందం:
మ్యూజిక్: శ్యామ్ సీఎస్
సినిమాటోగ్రఫీ: షెల్డన్ చౌ
ప్రొడక్షన్ డిజైన్: కిరణ్‌కుమార్ ఎం.
పీఆర్వో: వంశీ-శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్‌కుమార్ ఆర్.
నిర్మాత: విష్ణు మంచు
దర్శకత్వం: జెఫ్రీ గీ చిన్
బ్యానర్: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ.