Reading Time: < 1 min

మోస‌గాళ్లు చిత్రం టైటిల్ కీ థీమ్ మ్యూజిక్‌తో శ్యామ్ సిఎస్‌కి ప్ర‌శంస‌లు

మోస‌గాళ్లు టైటిల్ కీ థీమ్ మ్యూజిక్‌తో అందరి ప్ర‌శంస‌లు అందుకుంటున్న శ్యామ్ సిఎస్‌

విష్ణు హీరోగా న‌టిస్తోన్న ‘మోస‌గాళ్లు’ టైటిల్ కీ థీమ్ మ్యూజిక్ ఇటీవ‌ల ‘ద రైజ్ ఆఫ్ మోస‌గాళ్లు’ పేరిట విడుద‌లైంది. ఆస‌క్తిక‌రంగా ఉన్న ఆ థీమ్ మ్యూజిక్ బాగా పాపుల‌ర్ అయ్యింది. కుర్చీలలో మునివేళ్ల‌పై కూర్చోపెట్టి చూసే థ్రిల్ల‌ర్‌గా ‘మోస‌గాళ్లు’ చిత్రం ఉంటుంద‌నే అభిప్రాయాన్ని అది క‌లిగించింది.

ద‌క్షిణ భార‌త సినీ రంగంలోని ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుల్లో ఒక‌రిగా పేరుపొందిన శ్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. థీమ్ మ్యూజిక్‌తో అంద‌రి మ‌న‌సుల్నీ గెలుచుకున్న ఆయ‌న‌, ఆ ఎక్స‌పెక్టేష‌న్స్‌కు మ్యాచ్ అయ్యేలా ఈ సినిమాకు సంబంధించిన త‌దుప‌రి ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కు వ‌ర్క్ చేస్తున్నారు. అలాగే సినిమాకు బెస్ట్ మ్యూజిక్ ఇవ్వ‌డానికి కృషి చేస్తున్నారు.

హీరోగా న‌టిస్తూ విష్ణు మంచు నిర్మిస్తోన్న ‘మోస‌గాళ్లు’ సినిమాకు జెఫ్రీ గీ చిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. విష్ణు సోద‌రిగా ఆయ‌న పాత్ర‌తో స‌మాన ప్రాధాన్యం ఉన్న పాత్ర‌ను కాజ‌ల్ అగ‌ర్వాల్ చేస్తున్నారు.

భార‌త్‌లో మొద‌లై, అమెరికాను వ‌ణికించిన చ‌రిత్ర‌లోనే అతి పెద్ద ఐటీ కుంభ‌కోణం నేప‌థ్యంలో వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా ‘మోస‌గాళ్లు’ చిత్రం రూపొందుతోంది.

బాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ యాక్ట‌ర్ సునీల్ శెట్టి ఈ చిత్రంతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.