యానం చిత్రం విలేఖరుల సమావేశం
విలక్షణ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం `యానం`
విలక్షణ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ నిర్మాతగా కేఎస్ఐ సినిమా అన్‌లిమిలెట్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న చిత్రం యానం. షేక్స్‌పియర్ రచనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి కరుణాకరణ్ దర్శకుడు. ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో కేఎస్ఐ సినిమా అన్‌లిమిలెట్ బ్యానర్ లోగోను ప్రముఖ నిర్మాత బన్నీవాసు, `యానం` చిత్ర టైటిల్ లోగోను ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ విడుదల చేశారు.
ఈ సందర్భంగా…
ప్రముఖ నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ – “శ్రీకాంత్ అయ్యంగారు నిర్మిస్తున్న ఫస్ట్‌మూవీ `యానం` మరియు కేఎస్ఐ సినిమా అన్‌లిమిటెడ్ బ్యానర్‌కు ఆల్ ది బెస్ట్. ఈ రోజుల్లో ఒక సినిమా తీయాలంటే చాలా ధైర్యం కావాలి. కరోనా తర్వాత సమీకరణాలు మారిపోయాయి. ప్రతి ఒక్కరు జీరో నుండి మళ్లీ నేర్చుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సినిమా మొదలు పెట్టడం నిజంగా గొప్ప విషయం. శ్రీకాంత్ గారు వర్సటైల్ ఆర్టిస్ట్..ఆయన నిర్మాతగా మారుతున్నాడు కాబట్టి కొత్త ఆర్టిస్టులని, టెక్నీషియన్స్‌ని పరిచయం చేయాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ – “శ్రీకాంత్‌గారు నాకు 2010నుండి తెలుసు. `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` సినిమాలో అద్భుతమైన పాత్ర చేశారు. శ్రీకాంత్ గారు తొలిసారి నిర్మాతగా చేస్తున్న `యానం` సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నవతరానికి ఈ బ్యానర్ ఒక మార్గం అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను“ అన్నారు..
శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ – “ఈ కార్యక్రమానికి హాజరైన నిర్మాత బన్నీవాసుగారికి, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కరుణాకరన్ నేను దర్శకత్వం వహించిన నాటకాలు, యాడ్ ఫిలింస్‌కి వర్క్ చేశాడు. అందరికీ నా కుడి బుజం, నా ఆత్మ అని చెప్తూ ఉంటాను. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
దర్శకుడు కరుణాకరణ్ మాట్లాడుతూ – “నాకు దర్శకుడిగా మొదటిసినిమా అవకాశం ఇచ్చిన శ్రీకాంత్ అన్నకి ధన్యవాదాలు. శ్రీకాంత్ గారి ఆలోచనలను తప్పకుండా ముందుకు తీసుకెళ్తాను. దానికి మీ అందరి సహాయసహకారాలు కావాలి“ అన్నారు.