Reading Time: 4 mins

రైటర్ పద్మభూషణ్ ఈవెంట్

రైటర్ పద్మభూషణ్ ఫ్యామిలీతో కలసి చూడాల్సిన సినిమా: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్

ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రైటర్ పద్మభూషణ్‌ తో వస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మాతలు కాగా జి. మనోహరన్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ కథాంశాన్ని వెల్లడించింది. విజయవాడకు చెందిన ఒక మధ్యతరగతి యువకుడు పద్మభూషణ్ గుర్తింపు పొందిన రచయిత కావాలని కలలు కంటాడు. చివరకు అతను తన మొదటి పుస్తకాన్ని ప్రచురిస్తాడు. అది నిరాశపరుస్తుంది. అందరూ అతన్ని కించపరిచినప్పుడు, టీనా అతనిని గొప్ప రచయితగా గుర్తిస్తుంది. కానీ కథలో ఒక ట్విస్ట్ ఉంది, ఇది ప్రేమ కథకు ట్రబుల్స్ తెస్తుంది.

కథాంశం, కథనం రిఫ్రెష్‌గా అనిపిస్తుంది. క్యారెక్టరైజేషన్స్ నుండి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ప్రజంట్ చేయడం వరకు దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ అద్భుతంగా పనిచేశాడు. సుహాస్ తన హిలేరియస్ పాత్రతో కొత్తదనం తెచ్చాడు. రొమాంటిక్ ట్రాక్ కూడా ఆకట్టుకుంటుంది. టీనా శిల్పరాజ్‌ తన ఛార్మ్ తో ఆకట్టుకుంది. వెంకట్ ఆర్ శాకమూరి సినిమాటోగ్రఫీ పర్ఫెక్ట్ గా వుంది, శేఖర్ చంద్ర, కళ్యాణ్ నాయక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్ద అసెట్. మొత్తానికి ట్రైలర్ మంచి అంచనాలను నెలకొల్పింది.

రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో హీరో అడివి శేష్ ట్రైలర్ ని లాంచ్ చేశారు.

నిర్మాత అనురాగ్ మాట్లాడుతూ ఎ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్ లో మేజర్ సినిమా చేశాం. కొత్త వారితో సినిమాలు చేయాలని ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ మొదలుపెట్టాం. రైటర్ పద్మభూషణ్ తో పాటు మరో నాలుగు సినిమాలు అంతా కొత్తవారితోనే ఫైనల్ అయ్యాయి. కొత్తవారితో సినిమాలు చేయడం కొనసాగుతూనే వుంటుంది. సుహాస్ ఛాయ్ బిస్కెట్ లో మొదట్లో ఫన్ వీడియోలు చేసినప్పటి నుండి నువ్వు హీరో అనే చెప్తూ ఉండేవాడిని. ఇప్పుడు తను హీరోగా మా ప్రొడక్షన్ లో సినిమా చేయడం ఒక సర్కిల్ పూర్తయినట్లనిపించింది. సుహాస్ అనే నటుడ్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. మనం ఎంత సపోర్ట్ చేస్తే అతను అన్ని మంచి సినిమాలు ఇస్తూనే ఉంటాడు. తన నుండి మరిన్ని మంచి సినిమాలు వస్తూనే వుంటాయి. ఒకరికి మంచి చేయకపోయిన పర్లేదు కానీ చెడు చేయకూడదనే ఉద్దేశం ఛాయ్ బిస్కెట్ ని మొదలుపెట్టాం. మా నుండి తర్వాత వచ్చే సినిమాకు కూడా అదే మంచి ఉద్దేశంతో వుంటాయి. ఇక్కడి వచ్చిన అందరూ కూడా అదే మంచి ఉద్దేశం వచ్చి సపోర్ట్ చేశారు. అందరికీ కృతజ్ఞతలు. ఫిబ్రవరి 3న సినిమా విడుదలౌతుంది. సుహాస్ ని యూట్యూబ్ లో సపోర్ట్ చేశారు. ఓటీటీలో సపోర్ట్ చేశారు. ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ మీ పేరెంట్స్ తో కలసి ఈ సినిమా చూడాలని మా విన్నపం  అన్నారు.

అడివి శేష్ మాట్లాడుతూ ఇది ఫ్యామిలీ వేడుకలా వుంది. ఈ టీం అందరితో నాకు మంచి అనుబంధం వుంది. సుహాస్ టెర్రిఫిక్ యాక్టర్. టీనా, గౌరీ వెరీ ట్యాలెంటెడ్. ఇందులో రోహిణీ గారు నటన చూసి హార్ట్ టచింగ్ గా అనిపించింది. ఫిబ్రవరి 3న అందరం థియేటర్ లో కలుద్దాం. అనురాగ్, శరత్ అండ్ శేష్ థాంక్స్ .  అన్నారు.

హరీష్ శంకర్ మాట్లాడుతూ ఈ ట్రైలర్ చూస్తున్నపుడు దర్శకుడు ప్రశాంత్ ఎంత స్మార్ట్ డైరెక్టరో అర్ధమైయింది. ఎక్స్ లెంట్ గా తీశాడు. చాలా రోజుల తర్వాత తెరపై పుస్తకాలు కనిపించాయి. చాలా ఆనందంగా వుంది. శరత్ అనురాగ్ నాకు ఫ్యామిలీ. వారికి బెస్ట్ అఫ్ లక్. తెలుగు హీరోయిన్లు వస్తునందుకు చాలా ఆనందంగా వుంది. కెమరా వర్క్ నాకు చాలా నచ్చింది. పాండమిక్ సమయంలో సుహాస్ చేసిన వీడియోలు నాకు పెద్ద రిలీఫ్. ఇండస్ట్రీలో రాజకీయాలు, నెపోటిజం అని చాలా మాట్లాడుకుంటారు. వాళ్ళందరికీ కంటికి కనిపించే సమాధానం సుహాస్. ఇక్కడ ప్రతిభ మాత్రమే వుంటుంది. మిగతావన్నీ రూమర్స్. సుహాస్ సక్సెస్ అందరికీ ఒక స్ఫూర్తి. ట్రైలర్ లో నేపధ్య సంగీతం బావుంది. ఛాయ్ బిస్కెట్ పేరులోనే ఒక ఎమోషన్ వుంది. పదేళ్ళ తర్వాత చాలా మంది దర్శకులు నటులు మేము ఛాయ్ బిస్కెట్ నుండే వచ్చామని చెప్పుకుంటారు. అనురాగ్ శరత్ ని చూస్తే చాలా గర్వంగా వుంది. ఈ సినిమా చాలా గొప్పగా ఆడాలి  అని కోరారు.

సుహాస్ మాట్లాడుతూ శరత్ , అనురాగ్, చంద్రు గారి కృతజ్ఞతలు. శరత్ , అనురాగ్ లేకపోతే నేను లేను. ఇంతమంచి సినిమాని నా దగ్గరకి తీసుకొచ్చిన ప్రశాంత్ కి కృతజ్ఞతలు. మ్యూజిక్ చేసిన శేఖర్ చంద్రకి, బిజియం చేసిన కళ్యాణ్ కి కృతజ్ఞతలు. ఎడిటర్ పీకే కి, డీవోపీ వెంకట్ రమణకి కృతజ్ఞతలు. ఫిబ్రవరి 3న సినిమా థియేటర్ లో రిలీజ్ అవుతుంది. ఇది నా మొదటి థియేట్రికల్ రిలీజ్ సినిమా. కలర్ ఫోటో థియేటర్ లో రాకవడం చాలా బాధగా వుంది. ఈ సినిమాతో వస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. సినిమా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సినిమా చూసిన వచ్చిన తర్వాత ఖచ్చితంగా రెండు మూడు గంటలు హ్యాంగోవర్ లో వుంటారు. ఈ ఇక్కడి వచ్చిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు  తెలిపారు.

హను రాఘవ పూడి : రైటర్ పద్మభూషణ్ ఎక్స్ ట్రార్డినరీ వుంది. మొదటి రోజే సినిమా చూడాలనిపించేత ఎక్సయిట్ మెంట్ కలిగించింది. శరత్, అనురాగ్ చాలా పెద్ద సినిమాల విజయంలో వారి భాగస్వామ్యం వుంది. వాళ్ళు ఎనిమిదేళ్ళుగా కలిసిపని చేయడం చాలా గొప్ప విషయం. రైటర్ పద్మభూషణ్ లో గొప్ప మ్యాజిక్ వుంటుందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. దర్శకుడు చాలా ఎక్స్ ట్రార్డినరీ గా తీశారు. అ,అ అందరికీ ఆల్ ది బెస్ట్  చెప్పారు.

శివ నిర్వాణ : ఇప్పుడున్న యవ నటుల్లో కెరీర్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలో అనే దానికి సుహాస్ ఒక స్ఫూర్తి. తను ఎంచుకున్న కంటెంట్ చాలా వైవిధ్యంగా వుంటుంది. శరత్ , అనురాగ్ చాలా క్రియేటివ్ నిర్మాతలు. రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ చాలా బావుంది. ఫిబ్రవరి 3న మీ అందరితో పాటే ఈ సినిమాని చూస్తాను. ఆల్ ది బెస్ట్  అన్నారు

శశి కిరణ్ తిక్క : రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ చాలా కూల్ గా పాజిటివ్ గా మంచి తెలుగు సినిమా నే వైబ్ ని ఇచ్చింది. శరత్, అనురాగ్ తో మేజర్ సినిమా చేశాం. చాలా ప్యాషన్ వున్న నిర్మాతలు. ఈ సినిమాని అమ్మతో కలసి చూస్తాను  అన్నారు.

టీనా మాట్లాడుతూ ఇది హృదయాన్ని హత్తుకునే చిత్రం. మీ అందరికీ నచ్చుతుంది. ఇది నా మొదటి సినిమా. ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. సుహాస్ తో పాటు ఈ సినిమాలో మిగతా నటీనటులతో కలసి నటించడం ఆనందంగా వుంది. ఫిబ్రవరి 3న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మీ అందరూ తప్పకుండా చూడాలి  అన్నారు.

దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ మాట్లాడుతూ ఛాయ్ బిస్కెట్, లహరి సఫిలిమ్స్ తో నా మొదటి సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. అనురాగ్ , శరత్ గారుసినిమా అంటే ప్యాషన్ వున్న నిర్మాతలు. సుహాస్ అన్న పేరు చెప్పకుండా నా గురించి నేను చెప్పలేను. కలర్ ఫోటో కి సహాదర్శకుడిగా పని చేశాను. ఇప్పుడు సుహాస్ తో దర్శకుడిగా రైటర్ పద్మభూషణ్ చేశాను. ఈ సినిమాని ఒక ఫ్యామిలీ కోసం స్పెషల్ షో వేశాం. పిల్లలకి చూపించాల్సిన సినిమా ఇది అని ప్రసంశించారు. ఇది నేను ఇప్పటివరకూ అందుకున్న బెస్ట్ కాంప్లీమెంట్. క్లాప్స్ తో పాటు క్యాష్ తీసుకొచ్చే చిత్రమిది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది  అన్నారు.

నిర్మాత శరత్ మాట్లాడుతూ మేజర్ లాంటి పెద్ద సినిమాని ఎ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్ లో చేశాం. కొత్త ప్రతిభని ప్రోత్సహించాలని ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ మొదలుపెట్టాం. ఈ సినిమాకి దాదాపు అందరూ కొత్తవాళ్ళే చేశారు. సుహాస్ కి ఇది తొలి థియేటర్ రిలీజ్ మూవీ. మీ అందరి సపోర్ట్ కావాలి  అన్నారు

నిర్మాత చంద్రు మాట్లాడుతూ లహరి మ్యూజిక్ 35 ఏళ్లుగా మ్యూజిక్ ఇండస్ట్రీ లో వుంది. తొలిసారి ఈ చిత్రంతో ప్రొడక్షన్ చేయడం ఆనందంగా వుంది. ఛాయ్ బిస్కెట్ తో అసోసియేట్ కావడం ఆనందంగా వుంది. మీ అందరి సపోర్ట్ కావాలి  అన్నారు.

రోహిణి మాట్లాడుతూ : రైటర్ పద్మభూషణ్ మంచి ఎంటర్ టైనర్. ఇలాంటి సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా వుంది. సుహాస్ అద్భుతమైన నటుడు. ఫిబ్రవరి 3న అందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి  అన్నారు. సందీప్ రాజ్, సాయి రాజేష్, వినయ్ , ఎస్కేఎన్, వెంకటేష్ మహా, ఎడిటర్ పవన్ కళ్యాణ్, నాయక్ తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

తారాగణం :

సుహాస్, టీనా శిల్పరాజ్, ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి, గోపరాజు రమణ, శ్రీ గౌరీ ప్రియ

టెక్నికల్ టీం :

రచన, దర్శకత్వం: షణ్ముఖ ప్రశాంత్
నిర్మాతలు: అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్
సమర్పణ: జి. మనోహరన్
బ్యానర్లు:ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్
సంగీతం: శేఖర్ చంద్ర, కళ్యాణ్ నాయక్
డీవోపీ: వెంకట్ ఆర్ శాకమూరి
ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్, సిద్ధార్థ తాతోలు