Reading Time: 2 mins

రోటి క‌ప‌డా రొమాన్స్ మూవీ ఏప్రిల్ 12 విడుద‌ల

హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం రోటి కపడా రొమాన్స్. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. ఈచిత్రానికి సంబంధించి ఇటీవ‌ల విడుద‌ల చేసిన ప్ర‌తి ప్ర‌చార చిత్రానికి మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల‌ తేది ఖ‌రారు ప్రెస్‌మీట్‌ను బుధ‌వారం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ క‌థ‌ను న‌మ్మి ఎమోష‌న‌ల్‌గా ఫీల్ అయి చేసిన సినిమా ఇది. నేను మొద‌ట్నుంచి కంటెంట్‌ను న‌మ్మి సినిమాలు చేస్తూ వ‌చ్చాను. ప్రేక్ష‌కులు కూడా నాకు అన్ని విధాలా స‌పోర్ట్ చేశారు. ఈ క‌థ‌ను కూడా ఇష్ట‌ప‌డి, న‌మ్మి చేస్తున్న సినిమా ఇది. ఏప్రిల్ 12న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం. త‌ప్ప‌కుండా చిత్రం జ‌నాద‌ర‌ణ పొందుతుంద‌నే న‌మ్మ‌కం వుంది* అన్నారు. ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ద‌ర్శ‌కుడి కావాల‌న్న నా 15 ఏళ్ల క‌ల నాకు ఈ సినిమాతో తీరుతుంది. మొద‌ట్నుంచీ త‌న సంస్థ‌లో ప్ర‌తిభ‌గ‌ల న‌టీన‌టుల‌ను, సాంకేతిక నిపుణుల‌కు స‌పోర్ట్ చేసే వేణుగోపాల్ నాకు ఈ అవ‌కాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం వుంది. అయితే క‌మ‌ర్షియ‌ల్‌గ ఏ రేంజ్ హిట్ అన్న‌ది మాత్ర‌మే ఇప్పుడే చెప్ప‌లేను. ఇది అంద‌రూ అనుకున్న‌ట్లు కేవ‌లం ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమానే కాదు, అన్ని ర‌కాల ఎమోష‌న్స్ ఈ చిత్రంలో వున్నాయి. ఇట్స్ ప్యూర్ ఫిలిం. లైఫ్‌లో ఒక్క‌సారైనా అంద‌రూ ల‌వ్ అనే ఎక్స్‌పీరియ‌న్స్‌ను చూసి వుంటారు. అలాంటి వారంద‌రికి మా సినిమా క‌నెక్ట్ అవుతుంది అన్నారు. ఈ సినిమా అంద‌రికి న‌చ్చుతుంద‌ని, ఇది కేవ‌లం యూత్‌ఫుల్ సినిమానే కాదు అన్ని వ‌ర్గాల వారికి న‌చ్చుతుంద‌ని హీరోల్లో ఒక‌రైన హర్ష తెలిపారు. త‌మ మీద న‌మ్మ‌కం వుంచి చిత్రంలో న‌టించే అవ‌కాశం ఇచ్చినందుకు ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు త‌మ థ్యాంక్స్ తెలియ‌జేశారు త‌రుణ్‌, సుప్ర‌జ్‌. ఈ స‌మావేశంలో కెమెరామెన్ సంతోష్ రెడ్డి, హీరోయిన్లు సోనూ ఠాకూర్‌, మేఘ‌లేఖ‌, ఖుష్బూ చౌద‌రి త‌దిత‌ర‌లు పాల్గొన్నారు.

నటీనటులు :

హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి

సాంకేతిక వర్గం :

డీఓపీ: సంతోష్ రెడ్డి,
సంగీతం: హర్ష వర్థన్ రామేశ్వర్, ఆర్ ఆర్ ధ్రువన్, వసంత్.జి
ఎడిటర్: విజయ్ వర్థన్
నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్, సృజన్‌ కుమార్ బొజ్జం
కథ, స్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: విక్రమ్ రెడ్డి