లైగర్ మూవీ రివ్యూ
విజయ్ దేవరకొండ “లైగర్” రివ్యూ!
Emotional Engagement Emoji (EEE)

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్..ఇద్దరూ ఫెరఫెక్ట్ కాంబినేషన్. రెగ్యులర్ గా సినిమాకు వెళ్లేవారికి వీళ్లద్దరి యూటిట్యూట్ పరిచయమే. క్యారక్టరైజేషన్ తో నే సినిమాని నిలబెట్టే వీళ్లద్దరు కలిస్తే ఎలా ఉంటుంది. ఎలాంటి సినిమా రాబోతుందీ అనేది ఆసక్తికరమే.అలాగే తన సినిమాలకు విభిన్నమైన టైటిల్స్ పెట్టే పూరి ఈ సినిమాకు పెట్టిన టైటిల్ ఆసక్తికరం. ఈ నేపధ్యంలో రిలీజైన ఈ చిత్రం విజయ్ దేవరకొండని ప్లాఫ్ ల నుంచి ఒడ్డున పడేసిందా, అసలు సినిమా కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
బాలామణి(రమ్యకృష్ణ)కు ఓ కోరిక. తన కొడుకు లైగర్ (విజయ్ దేవరకొండ)ని మార్షల్ ఆర్ట్స్ MMAలో విజేతను చెయ్యాలని. అందుకోసం ఆమె కష్టనష్టాలకు ఓర్చి కరీనంగర్ నుంచి ముంబై తీసుకెళ్తుంది. అక్కడ నానా భాధలు పడి ఓ కోచ్ (రోనిత్ రాయ్)ని పట్టుకుని ట్రైనింగ్ ఇప్పిస్తుంది. ఆమె జీవిత కోరిక తన భర్త లాగే పెద్ద ఫైటర్ కావాలని. ఆమె తన కలను కొడుకుకి ఇంజెక్ట్ చేస్తుంది. లైగర్ కూడా బాగా కష్టపడుతూంటాడు. కానీ అతని వెనక అమ్మాయిలు పడుతూంటారు. అది చూసి ఆమె మండిపడి వార్నింగ్ కూడా ఇస్తుంది. కానీ ఊహించని విధంగా లైగర్ ఓ అమ్మాయి టాన్యా(అనన్యా పాండే)తో ప్రేమలో పడతాడు. అక్కడనుంచి అతను కాన్సర్టేషన్ తగ్గుతుంది. అప్పుడు ఆమె ఏం చేసింది. తాన్యాతో లైగర్ ప్రేమ కథ చివరకు ఎలా ముగిసింది. తల్లి లక్ష్యమైన MMA నేషనల్ ఛాంపియన్ షిప్ లో ఎలా గెలిచాడు..ఇంటర్నేషనల్ స్దాయికి వెళ్లి అతనే సాంధించాడు. అతని తండ్రి ఎవరు..మైక్ టైసన్ కు ఈ కథకు లింకేంటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే ఎనాలసిస్ :
కోవిడ్ తర్వాత ప్రేక్షకుడు సినిమాని చూసే తీరులో మార్పు వచ్చింది. ఓటిటిలు అందులో ముఖ్య పాత్ర వహించాయి. మళయాళ సినిమాని, ప్రపంచ సినిమాని వైవిధ్యంగా మన ముందు ఉంచాయి. వీటిని చూసిన ప్రేక్షకుడుకి తమ సినిమాల్లోనూ ఎంతో కొంత కొత్తదనం ఆశిస్తాడు. అది వదిలేసి..ఇంకా పాతకాలం స్క్రీన్ ప్లేలు, కథలు చెప్తే ఇలాగే ఉంటుంది. పూరి వంటి దర్శకుడు ఖచ్చితంగా మార్పుని ఆహ్వానించాలి. లేకపోతే ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు ఇలాంటి రిజల్ట్ ని ఇస్తాయి. స్పోర్ట్స్ కథలకు ఇన్నాళ్లకు ఓ టెంప్లేట్ ఉంటూ వచ్చింది. పూరి కూడా అదే టెంప్లేట్ ని నమ్ముకున్నాడు. ఓ స్లమ్ డాగ్ తరహా హీరో…అంతర్జాతీయ స్దాయిలో అదీ మైక్ టైసన్ పై గెలవటం చూసి జనం ఆనందపడతారు. అందులో తల్లి సెంటిమెంట్ కలిస్తే మురిసిపోతారని భావించాడు. కానీ ఇప్పుడు ఆ స్క్రీన్ ప్లేలకు కాలం చెల్లింది. మైక్ టైసన్ ని లైవ్ లోనే జనం చూడాలనుకుంటే చూస్తున్నారు. ప్రత్యేకంగా తెరపై చూడటానికి రావటంలేదు. కథలో ఆ పాత్ర ఏదైనా డ్రామా క్రియేట్ చేసి కొత్తదనం ఉంటేనే ఇష్టపడుతున్నారు. అలాంటి డ్రామా ఏదీ ఈ సినిమాలో లేదు. ఎంతసేపూ ఫైట్స్, పాటలు, తల్లి సెంటిమెంట్, లవ్ అంటూ రొటీన్ టెంప్లేట్ ని క్రియేట్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. అదే సినిమాకు ఇబ్బందిగా మారింది. దానికి తోడు కథలో ఎక్కడా సరైన కాంప్లిక్ట్ అనేది ఎస్టాబ్లిష్ కాలేదు. విలన్ పాత్ర కానీ హీరోకు ఎదురయ్యే ప్రతికూల పరిస్దితులు కానీ ఏమీ ఉండవు. నల్లేరు పై నత్తనడకలా కథలో విజయం వైపు నడుచుకుంటూ పోతాడు. అది ఎప్పుడూ ఇబ్బందే. దానికి తోడు ఎంతకానో బిల్డప్ చేసిన మైక్ టైసన్ సన్నివేశాలు కామెడీగా మారాయి.
టెక్నికల్ గా చూస్తే…
పూరీ జగన్నాథ్ ఈ సినిమాలో దర్శకుడుగా కూడా పూర్త స్దాయిలో నిరాశపరిచాడు పూరి మార్క్ కనిపిస్తుంది, కానీ గొప్పగా ఉండదు . ఈసారి ఆయన హీరో క్యారక్టరైజేషన్ ని పట్టించుకోలేదు. ఓవరాల్ కథను చూసుకోలేకపోయారు. మధ్యలో ఉండిపోయారు. సినిమాని రిచ్ గా కలర్‌ఫుల్‌గా చూపించే ప్రయత్నం చేసిన విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త కష్టపాడాల్సింది. సంగీతం , బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా పెద్దగా ఆశపడక్కర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
నటీనటుల్లో…
ఇది విజయ్ దేవరకొండ పూర్తిగా నమ్మి చేసిన చిత్రం అని అతని కష్టం చూస్తే అర్దమవుతుంది. బాడీ బిల్డింగ్, క్యారక్టర్స్ తన స్టైల్ ని యాడ్ చేయటం వంటివి నచ్చుతాయి. ముఖ్యంగా నత్తి పాత్రకు డబ్బింగ్ చెప్పటం మామూలు విషయం కాదు. ఫైట్స్ కూడా బాగా చేసాడు. కోకా సాంగ్, అకడి పకిడి సాంగ్ లు రెండిటిలో డాన్స్ లు ఇరగతీసాడు. అయితే అతనికి స్క్రిప్టు కలిసిరాలేదు. ప్చ్.
ఇక హీరోయిన్ గా అనన్య పాండే చూడటానికి బాగుంది. అయితే తాన్యాగా ఆమె అలరించలేకపోయింది. ఓ రకంగా విసిగించింది.రోనిత్ రాయ్…ఎమ్ ఎమ్ ఎస్ కోచ్ గా బాగా చేసారు. రమ్య కృష్ణ పాత్ర మొదట్లో బాగుంది..రాను రాను మరీ లౌడ్ గా తయారైంది. గెటప్ శీను కు ఇది అలవాటైన పాత్రే. చుండీ పాండే, అలీ , విషు రెడ్డి అంతా ఓకే ఓకే.
ప్లస్ లు +
విజయ్ ఫెరఫార్మెన్స్
తల్లి,కొడుకుల మధ్య వచ్చే సీన్స్
యాక్షన్ సీక్వెన్స్ లు
అక్కడక్కడా వినిపించే మాస్ డైలాగులు
మైనస్ లు –
ఊహించగలిగే స్క్రీన్ ప్లే
నత్తి తో విసిగించటం
నాన్‌సింక్ సీన్స్
సెకండాఫ్
చూడచ్చా?:
విజయ్ దేవరకొండ అభిమానులు తమ హీరో నటన కోసం చూడవచ్చు..మిగతావాళ్లు ఆలోచించి అడుగేయాలి
తెర వెనక..ముందు
నటీనటులు: విజయ్‌దేవరకొండ, అనన్యాపాండే, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శీను తదితరులు
డీఓపీ: విష్ణు శర్మ
ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్ భాష
ఎడిటర్: జూనైద్ సిద్ధిఖీ
స్టంట్ డైరెక్టర్: థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ
కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, చార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా
రన్ టైమ్: 2 గంటల 20 నిముషాలు
విడుదల తేదీ: ఆగస్ట్ 25, 2022