తమిళంలో 50రోజులు ప్రదర్శింపబడిన సూపర్‌హిట్ చిత్రాన్ని `లవ్‌గేమ్` పేరుతో ధను క్రియేషన్స్ బ్యానర్ పై భువన్ కుమార్ అల్లం తెలుగులోకి అనువదిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం ఈ నెల 8న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నటుడు భాగ్యరాజ్ తనయుడు శంతన్ భాగ్యరాజ్, సృష్టి జంటగా నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్ ల్ లోని దస్ పల్లా హోటల్ లో గ్రాండ్ గా జరిపారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనిల్‌రావిపూడి మాట్లాడుతూ… “భాగ్యరాజ్‌గారు నా `ఎఫ్2` చిత్రం చూసి ప్రతీ డైలాగ్ గుర్తుంచుకొని ఆయన నాకు ఫోన్ చేసి మరీ ప్రశంసించారు. కుటుంబ కథా చిత్రాలు చేయడంలో భాగ్యరాజ్గారి తర్వాతే ఎవరైనా. నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ ని. ఆయనతో నేను ఈ ఫంక్షన్ కు హాజరుకావడం అదృష్టంగా భావిస్తున్నా“ అన్నారు.
కరుణాకరన్ మాట్లాడుతూ… “ నేను భాగ్యరాజ్ గారికి పెద్ద ఫ్యాన్ ని . వారి తనయుడు తమిళంలో నటించిన ఈ సినిమా తెలుగులో `లవ్ గేమ్ ` పేరుతో వస్తోంది. ఇక్కడ బాగా ఆడాలని కోరుకుంటున్నా“ అన్నారు.
చంద్రమహేష్ మాట్లాడుతూ… “ముందుగా ఈ `లవ్‌గేమ్` ప్రొడ్యూసర్‌కి నా శుభాకాంక్షలు. నేను భాగ్యరాజ్గారికి ఏకలవ్యశిష్యుడ్ని. సెంథిల్ చాలా అద్భుతమైన ఆర్టిస్ట్. ఈ చిత్రం తప్పకుండా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
డైరెక్టర్ తిరు మాట్లాడుతూ… ఈ సినిమా తమిళ్లో హిట్ అయినట్లే తెలుగులో కూడా హిట్ కావాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
హీరో సెంథిల్ మాట్లాడుతూ…“ 30ఏళ్ళ నుంచి మా నాన్నగారిని ఆదరిస్తున్నారు. అదే ఆదరణ నాకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నాను. ఈ సినిమాలో ఒక మంచి పాయింట్ ఉంటుంది. అది అందరికీ అనెక్ట్ అవుతుంది“ అన్నారు.
ప్రొడ్యూసర్ భువన్ కుమార్ అల్లం మాట్లాడుతూ… “ నేను 20 సినిమాలు చూశాను. అందులో ఈ సినిమా బాగా నచ్చింది. వెంటనే రైటర్ వెన్నెలకంటిగారిని చూడమన్నా… ఆయన ఈ సినిమాని ఎంతో మెచ్చుకున్నారు. మీరు ఈ సినిమాకి నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు నేను చేస్తాను అన్నారు. దాంతో నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ సినిమా తప్పకుండా తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను“ అన్నారు.
నటుడు భాగ్యరాజ్ మాట్లాడతూ…“మా అబ్బాయి నటించిన తమిళ చిత్రం తెలుగులో `లవ్ గేమ్` పేరుతో తెలుగులో కి విడుదలవుతోంది. డెఫ్‌నెట్‌గా ఇక్కడ కూడా హిట్ అవుతుందని నమ్ముతున్నా. నా డబ్బింగ్ చిత్రాలన్నీ ఇక్కడ సూపర్హిట్లు అయ్యాయి. మరి ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారని నమ్ముతున్నా“ అన్నారు.
రమ్యకృష్ణ మాట్లాడుతూ… “భాగ్యరాజ్ గారు ఇండియాలోనే జీనియస్ డైరెక్టర్. సెంథిల్ ప్రస్తుతం ఉన్న యంగ్ జనరేషన్లో చాలా టాలెంటెడ్ డైరక్టర్ . ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
తేజ డైరెక్టర్ మాట్లాడుతూ… “నేను భాగ్యరాజ్గారికి పెద్ద ఫ్యాన్‌ని. నేను చదువుకునే రోజుల్లో ఆయన సినిమాలన్నీ చూసేవాడ్ని. వాళ్ళ అబ్బాయి మూవీఇక్కడ రిలీజ్ అయి పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
రాజశేఖర్ మాట్లాడుతూ… “భాగ్యరాజ్‌గారు చాలా మంచి స్క్రీన్ ప్లే డైరెక్టర్. వాళ్ళ అబ్బాయి అంటే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు . తప్పకుండా లవ్‌గేమ్ పెద్ద హిట్ అవుతుంది“ అన్నారు.
జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ… “తేజ నేను క్లాస్మేట్స్ …తను ఎలా భాగ్యరాజు గారి మూవీస్ చూసి ఇష్టపడ్డాడో నేను అంతే. మేము వాళ్ళ అబ్బాయి ఫంక్షన్‌కి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్ర యూనిట్ అందరికీ మా స్పెషల్ విషెస్ అన్నారు“ అన్నారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ… “భాగ్యరాజ్‌గారు చాలా పెద్ద వారు. వాళ్ళ అబ్బాయి సెంథిల్ నాకు మంచి ఫ్రెండ్. ఎదుటి వాళ్ళకి ఎంతో హెల్ప్ చేసే గుణముంది. చాలా తక్కువ సమయంలోనే తను నాకు చాలా సహాయపడ్డాడు. ఈ సినిమా సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటున్నాను అన్నారు.